M.S Dhoni
-
ఒక్క క్లిక్‌తో నేటి క్రీడా వార్తలు
తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ ఓటమి. పీవీ సింధుకు నిరాశ. ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చేసిన దరఖాస్తుకు భారత ఆర్మీ నుంచి గ్రీన్ సిగ్నల్. కూర్పు వైవిధ్యం కారణంగానే రాయుడును ఎంపిక చేయలేదని అంతేకాని అతనిపై ఎలాంటి వివక్ష చూపలేదని తెలిపారు. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ మీ కోసం. మరిన్ని క్రీడా వార్తల కోసం కింది వీడియోను వీక్షించండి.. -
క్రికెట్‌కు మునాఫ్ పటేల్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత పేస్‌బౌలర్ మునాఫ్ పటేల్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన మునాఫ్ ఆ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. 2006లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను మొత్తం 13 టెస్టుల్లో 35 వికెట్లు... 70 వన్డేల్లో 86 వికెట్లు... 3 టి20ల్లో 4 వికెట్లు తీశాడు. వరల్డ్‌కప్ గెలిచిన ఏడాదే ఇంగ్లండ్‌తో చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన మునాఫ్ ఆ తర్వాత తిరిగి జట్టుకు ఎంపిక కాలేదు. ‘ఇప్పటి వరకు చాలామందితో కలిసి ఆడాను. వారిలో ధోని తప్ప దాదాపు అందరూ తప్పుకున్నారు. మిగతావారు ఆడుతూ నేను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎక్కువ బాధ ఉండేది. ఇక వైదొలగాల్సిన సమయం వచ్చేసింది’ అని 35 ఏళ్ల మునాఫ్ పేర్కొన్నాడు. -
ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాలి
షాంఘై: యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్‌వా అన్నారు. కోహ్లీ తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనూహ్యంగా గత డిసెంబర్లో ధోని భారత టెస్టు క్రికెట్ సారథ్య బాధ్యతలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని స్వీకరించిన విరాట్ ఆధ్వర్యంలో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా మరొకటి ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన స్టీవా.. 'కోహ్లీ ఇప్పటికే పరిణతి చెందాడు. అయితే ఈ ప్రపంచ కప్‌లో కొన్ని విషయాలు అతడిని కాస్తంత డిస్ట్రబ్ చేశాయి. వ్యక్తిగతం కావొచ్చు.. మరేవైనా కావొచ్చు.. అతడు కొంత అసహనంగా, చిరాకుగా, భావోద్వేగాలు ఎక్కువగా బయటపెట్టినట్లు కనిపించాడు. నాయకత్వం విషయంలో ధోని మంచి సమర్థుడు. ఎవరు ఏమన్నా అతడు పెద్దగా పట్టించుకోడు. స్పందించడు. అలాంటి ధోని తప్పకుండా కోహ్లీకి ఒక మంచి రోల్ మోడల్ కాగలడు. అందుకే ధోని నుంచి కోహ్లీ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని స్టీవా చెప్పాడు. -
తొలి టెస్టులో ధోని ఆడతాడు!
పేస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాం ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాఖ్య అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగబోయే తొలి టెస్టుకు కెప్టెన్ ఎంఎస్ ధోని అందుబాటులో ఉండే అవకాశాలున్నాయని ఓపెనర్ శిఖర్ ధావన్ తెలిపాడు. విరాట్ కోహ్లి తొలిసారిగా టెస్టు జట్టుకు సారథిగా ఉండేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని ధావన్ అన్నాడు. ‘ఇద్దరు కెప్టెన్లు చాలా దూకుడుగా ఉంటారు. అయితే ఇద్దరికీ స్పష్టమైన తేడా ఉంది. కోహ్లి మైదానంలో కాస్త ఆవేశంగా ఉంటాడు. ఇద్దరి నేతృత్వంలో ఆడడం చాలా బాగుంటుంది. ధోని రానుండడంతో కోహ్లి టెస్టు కెప్టెన్సీ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే’ అని అన్నాడు. ‘జాన్సన్‌ను మెరుగ్గా ఆడతాం’ మరోవైపు సిరీస్‌లో పేసర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలర్లలో జాన్సన్ ఒకడని, అయితే తనలాంటి పేస్‌ను ఎదుర్కొనే విషయంలో తాము చాలా ప్రాక్టీస్ చేశామని గుర్తుచేశాడు. అలాగే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో, ఐపీఎల్లో గతంలోనే తాను అతడి బౌలింగ్‌ను ఆడానని చెప్పాడు. ‘ఓవరాల్‌గా దూకుడుగా ఆడే ఓపెనర్ జట్టుకు అత్యం త ముఖ్యం. ఇది ఒక్క ఆస్ట్రేలియా గడ్డపైనే కాకుండా ప్రస్తుత క్రికెట్లో అవసరం. మిడిలార్డర్‌పై ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉంటుంది. నేనలాంటి పాత్రను నిర్వర్తించడానికి ఇష్టపడతాను’ అని చెప్పాడు. ‘జట్టుకు ఉపయోగపడతా’ 2013లో ధావన్ తన తొలి టెస్టును మొహాలీలో ఆసీస్‌పైనే ఆడి అత్యంత వేగవంతమైన సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. అప్పటి నుంచి జట్టులో చోటు పక్కా చేసుకున్నప్పటికీ విదేశీ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ‘తొలి టెస్టు కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది మాకు చాలా ముఖ్యమైన పర్యటన. ఆసీస్ అత్యుత్తమ జట్టు. వీరిపై భారీ స్కోరు సాధించడం ప్రత్యేకతనిస్తుంది. నా వైఫల్యాల నుంచి ఎప్పుడూ పాఠాలు నేర్చుకుంటాను. ఆసీస్ దేశం నాకు కొత్త కాదు. మెల్బోర్న్లో నా భార్య, పిల్లలతో గడిపేందుకు వస్తుంటాను. గతంలో చాలా క్రికెట్ ఇక్కడ ఆడాను. ఓపెనర్‌గా మంచి ఆరంభాన్నిచ్చి జట్టుకు ఉపయోగపడాలనుకుంటున్నాను’ అని ధావన్ పేర్కొన్నాడు. -
ధోనీపై సినిమా ఖాయం!
క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు తీయడమనేది బాలీవుడ్లో లేటెస్ట్ ట్రెండ్. గత ఏడాది మిల్కా సింగ్ జీవితంతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’, ఈ ఏడాది మేరీ కోమ్ జీవితంతో వచ్చిన ‘మేరీ కోమ్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తాజాగా, టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోని’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పోస్టర్ని ధోని భార్య సాక్షీ సింగ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అయితే, కొన్ని రోజుల క్రితం ధోనీ జీవితంతో సినిమా రూపొందనుందనే వార్త రాగానే, ‘బీసీసీఐ’ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్త వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో దోనీ ఇంకా ఆడుతున్నందున ఇప్పుడు సినిమా తీయడం సరికాదని, ఆయన రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఈ సినిమా తీయాలని బీసీసీఐ చెప్పినట్లు ఓ వార్త హల్చల్ చేసింది. దాంతో ధోనీపై చిత్రం ఉండదని ఎవరికి వారు అనుకుంటున్న తరుణంలో, హఠాత్తుగా సాక్షీ సింగ్ ఈ చిత్రం పోస్టర్‌ను బయటపెట్టడంతోపాటు, ‘గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. మీ కోసమే ఈ పోస్టర్’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నందుకుగాను హక్కుల నిమిత్తం ధోని 40 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. దాదాపు 100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు.