Muhammad asif
-
ఆ ఇద్దరు క్రికెటర్లకు ఊరట!
కరాచీ:స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని దాదాపు ఐదు సంవత్సరాలు నిషేధం ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, మొహ్మద్ ఆసిఫ్ లకు కాస్త ఉపశమనం లభించించింది. ఆ ఇద్దరు పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో రెండో సీజన్ పీఎస్ఎల్ కోసం ఆ ఇద్దరు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతేడాది పీఎస్ఎల్ నాటికి వీరికి స్పాట్ ఫిక్సింగ్ పై నిషేధం పూర్తయినా ఆడేందుకు అవకాశం దక్కలేదు. ఆ ఇద్దరిపై నిషేధం పూర్తయ్యే సరికి పీఎస్ఎల్ వేలం పూర్తికావడంతో వారికి ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుతం పీసీబీ తీసుకున్న నిర్ణయం తమకు ఎంతగానో ఉపకరిస్తుందని సల్మాన్ భట్ పేర్కొన్నాడు. తాము చేసిన తప్పులు అనేవి గతమని భట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. తాను ఇప్పుడు మానసికంగా చాలా బలంగా ఉన్నానని, ఇక జీవితంలో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఈ మాజీ కెప్టెన్ తెలిపాడు. అంతకుముందు మొహ్మదల్ ఆమిర్ కూడా ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్లు నిషేధం ఎదుర్కొన్న తరువాత పాకిస్తాన్ జాతీయ జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. -
ఆ ఇద్దరి పైనే ఎందుకంత వివక్ష?
కరాచీ: జట్టు నుంచి కొన్నేళ్లపాటు ఉద్వాసనకు గురై పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు సంపాదించిన మహమ్మద్ ఆమీర్ తరహాలోనే మరో ఇద్దరికి రెండో అవకాశం కల్పించాలని ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. ఆమీర్‌కు ఇచ్చినట్లుగానే స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన బాట్స్మన్ సల్మాన్ బట్, బౌలర్ మహమ్మద్ ఆసిఫ్‌లకు జట్టులో చోటు కల్పించాలన్నాడు. ఐదేళ్ల నిషేధం తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే బట్ సెంచరీ చేశాడని, ఆసిఫ్ రెండు వికెట్లు తీశాడని.. అయినప్పటికీ ఆ ఇద్దరిపైనే ఎందుకంత వివక్ష అని వ్యాఖ్యానించాడు. దేశవాలీ క్రికెట్లో బట్, ఆసిఫ్ రాణిస్తున్నారని, వారు ఫిట్నెస్ మెరుగ్గానే ఉందని యూనిస్ పేర్కొన్నాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఒకే రకమైన తప్పు చేసి, ఒకే రకమైన శిక్షకు గురయ్యారు. అటువంటిది, ఇప్పుడు ఒకరికి అవకాశం కల్పించి మిగతా ఇద్దరిని జట్టులోకి తీసుకోకపోవడం భావ్యం కాదన్నాడు. బట్, ఆమీర్, ఆసిఫ్ లను ఒకే విధంగా ట్రీట్ చేయాలని గత కొన్ని రోజుల నుంచి పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, పాక్ టీ20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలకు వకార్ యూనిస్ సూచించాడు. ఆమీర్ విషయం, బట్, ఆసిఫ్ వ్యవహారాన్ని ఓకే తీరున చూడలేమని షాహిద్ ఇటీవలే ప్రకటించాడు. కానీ, ఆఫ్రిది ఏం ఆలోచిస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదన్నాడు. బట్, ఆసిఫ్ లను జట్టులోకి ఎందుకు తీసుకోరని యూనిస్ ప్రశ్నించాడు. వారు తప్పుచేసినందుకు ఐదేళ్ల పాటు క్రికెట్ ఆటకు దూరం చేసి శిక్షించారు. ఇప్పుడు వారిని జట్టులోకి తీసుకోవాలని, వారికి స్థానం కల్పిస్తే పాక్ టీమ్‌కు మంచి జరుగుతందని యూనిస్ పేర్కొన్నాడు. -
స్వైన్‌ఫ్లూ బాధితుడికి వైద్యాధికారుల పరామర్శ
మొయినాబాద్: స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతును గురువారం వైద్యాధికారులు పరామర్శించారు. అనంతరం బాధితుడి ఇంటికి వెళ్లి ఇంటి పరిసరాలను పరిశీలించారు. మొయినాబాద్‌కు చెందిన రైతు మహ్మద్ ఆసీఫ్(29) స్వైన్‌ఫ్లూ వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రిమియర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం పత్రికల ద్వారా విషయాన్ని తెలుసుకున్న చేవెళ్ల క్లస్టర్ ఎస్పీహెచ్ఓ చెంచయ్య తమ సిబ్బందితో కలిసి గురువారం ఆస్పత్రిలో ఆసీఫ్‌ను పరామర్శించారు. వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రిపోర్టులను పరిశీలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆసీఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రస్తుతం వెంటిలేషన్‌పై చికిత్స అందిస్తున్నారని, అతని ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతున్నట్లు వైద్యులు చెప్పారని చెంచయ్య చెప్పారు. ఆసీఫ్ ఇంటి పరిసరాలు పరిశీలన మొయినాబాద్ పీహెచ్సీ సిబ్బందితో ఎస్పీహెచ్ఓ చెంచయ్య బాధితుడు ఆసీఫ్ ఇంటికి వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాధి సోకే అవకాశం ఉందన్నారు. ఎక్కువ ప్రయాణం చేసే సందర్భాల్లో కూడా స్వైన్‌ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆసీఫ్ కుటుంబీకులంతా ఆరోగ్యంగానే ఉన్నారని, వారికి ముందు జాగ్రత్తగా వ్యాధి నివారణ మాత్రలు అందజేస్తామని ఎస్పీహెచ్ఓ చెంచయ్య చెప్పారు. అధిక జ్వరం, దగ్గు, నీరసంగా ఉన్నట్లైతే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎస్పీహెచ్ఓ చెంచయ్యతో పాటు సీహెచ్ఓ డోరకమ్మ, హెల్త్ సూపర్వైజర్ నీరజ, ఏఎన్ఎం శోభ ఉన్నారు. గ్రామస్తుల ఆందోళన... మొయినాబాద్‌కు చెందిన రైతు ఆసీఫ్‌కు స్వైన్‌ఫ్లూ సోకిందన్న విషయం తెలియడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉండడం.. వాతవరణంలో మార్పులు రావడంతో వ్యాధి వ్యాపిస్తుందేమోనని భయపడుతున్నారు.