Mulberry cultivation
-
‘పట్టు’కుంటే బంగారమే!.. ఏడాదికి రూ.లక్షల ఆదాయం
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): మండలంలోని రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం డివిజన్లో 200 ఎకరాల్లో సాగవుతుండగా 150 ఎకరాలు మండలంలోనే సాగవుతోంది. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ సాగు ద్వారా ఏడాదికి రూ.4.8 లక్షల విలువైన 600 కిలోల పట్టుగూళ్ల దిగుబడి సాధిస్తున్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా చూపింది. పట్టుగూళ్లు కొనేవారు లేక పట్టుగుడ్లు (లేయింగ్స్) లభించక రెండేళ్లలో రంపచోడవరం డివిజన్లో 300 నుంచి 200 ఎకరాలకు సాగు తగ్గిపోయింది. అప్పటిలో పట్టుగూళ్ల ధర రూ.300కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్లో మెరుగైన పరిస్థితులు కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత మార్కెట్లో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. పట్టుగూళ్ల ధర కిలో రూ.600 నుంచి రూ.700 వరకు పెరిగింది. దీంతో మళ్లీ రైతులు సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆదాయం ఆశాజనకంగా ఉన్నందున మండలంలో 20 ఎకరాలు అదనంగా సాగు పెరిగింది వై.రామవరం మండలంలో 4, రంపచోడవరం మండలంలో 7 ఎకరాలు, అడ్డతీగలలో 4 ఎకరాల్లో కొత్తగా పంట వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారని పట్టుపరిశ్రమశాఖ అధికారవర్గాలు తెలిపాయి. రంపచోడవరం డివిజన్లో ఉన్న గరప నేలలు మల్బరీ తోటల పెంపకానికి అనువైనవని పట్టుపరిశ్రమ శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యవంతమైన మల్బరీ ఆకులు దిగుబడి వస్తున్నందున నాణ్యమైన పట్టు లభిస్తుందని వారు చెబుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే పట్టుగూళ్లకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందని చెప్పారు. ఇక్కడి పట్టు గూళ్లను హనుమాన్ జంక్షన్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఉత్తమ రైతుకు పురస్కారం మండలంలోని కిండ్రకాలనీకి చెందిన పామి చినసత్యవతి పట్టుపరిశ్రమలో మంచి ఫలితాలు సాధిస్తూ మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ విస్తీర్ణం సాగు చేపట్టిన ఈమె రికార్డు స్థాయిలో ఆదాయం పొందారు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టి రూజ4.25 లక్షల ఆదాయం పొందారు. ఈమెను ఇటీవల ఏలూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సిల్క్ బోర్డు అధికారులు సత్కరించారు. చదవండి: అల్లుడు బియ్యం అదుర్స్! వాణిజ్య పంటల కన్నా లాభం రైతులు వాణిజ్య పంటల కన్నా మల్బరీ సాగు చేపట్టడం మంచిది. కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల వల్ల అప్పటిలో పట్టుగూళ్ల ధర పతనమైంది. అలాంటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎదురుకాదు. అప్పటిలో కిలో రరూ.600 నుంచి రూ.300కు పోయింది. ఇప్పుడు ధర చాలా బాగుంది. పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చే రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, వ్యవసాయ సూచనలు అందించి ప్రోత్సహిస్తున్నాం. వచ్చే జూన్ నాటికి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. –రంగారావు, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి, రంపచోడవరం వివరాలకు: రంగారావు, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి, రంపచోడవరం 9652714914 -
మల్బరీ, పట్టులో ‘ఉమ్మడి అనంత’ పైచేయి
ఉద్యాన పంటలకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలు రాష్ట్రంలోనే పేరెన్నికగన్నవి. కానీ ఈ రెండు ఇప్పుడు మల్బరీ సాగులోనూ మొదటి వరుసలో నిలిచాయి. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తయ్యే పట్టు అత్యంత నాణ్యమైనది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టుకు దేశీయంగా మంచి మార్కెట్ ఉంది. రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో మల్బరీ పండించే జిల్లాల్లో శ్రీసత్యసాయి మొదటి స్థానంలో ఉండగా.. అనంతపురం జిల్లా నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగానూ ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలకు ఎంత ఖ్యాతి ఉందో అందరికీ తెలిసిందే. సాక్షి ప్రతినిధి, అనంతపురం: మనరాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాలతో పాటు అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మల్బరీ సాగు భారీ విస్తీర్ణంలో ఉంది. ఒక్క శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల మంది రైతులు 44,487 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నట్టు పట్టుపరిశ్రమ శాఖ అంచనా. చిత్తూరులో 39,849 ఎకరాల్లోనూ, అన్నమయ్య జిల్లాలో 12,839 ఎకరాల్లోనూ పండిస్తుండగా, 6,740 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తూ అనంతపురం జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. శ్రీసత్యసాయి జిల్లాలో 26వేల పైచిలుకు మల్బరీ రైతులుండగా, అనంతపురం జిల్లాలో 8,500 మంది ఉన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పట్టుగూళ్లు అత్యంత నాణ్యమైనవిగా పేరుంది. ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా ధర్మవరం పట్టుగూళ్లు కిలో రూ.607 పలుకుతున్నాయి. పట్టుగూళ్ల ధర ఆశాజనకం రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాం. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టాం. బైవోల్టిన్ పట్టుగూళ్లు పెంచాం. దిగుబడి బాగా వచ్చింది. పట్టు గూళ్ల ధర కూడా ఆశాజనకంగా ఉంది. కిలో రూ.700పైగా పలికింది. రెండు ఎకరాలకు రూ.లక్షదాకా లాభం వచ్చింది. – రంగనాథ్, రైతు, రొళ్ల మల్బరీ సాగు లాభదాయకం కొన్నేళ్లుగా పట్టు పరుగులు పెంచుతున్నా. రెండెకరాల్లో మల్బరీ సాగు చేశా. ఏటా ఐదు నుంచి ఆరు పంటలు తీసుకుంటా. ఒక పంటకు ఖర్చు పోను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఆదాయం వస్తుంది. మల్బరీ నర్సరీని కూడా ఏర్పాటు చేశా. నర్సరీ ద్వారా కూడా ఆదాయం వస్తోంది. – నారాయణప్ప, వి.ఆగ్రహారం, అమరాపురం మల్బరీ విస్తీర్ణం పెంపునకు కృషి హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్ రాష్ట్రంలోనే అతి పెద్దది. సగటున రోజుకు 6వేల కిలోల పట్టుగూళ్లు వస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, ధర్మవరంలో కూడా పట్టుగూళ్ల మార్కెట్లు ఉన్నాయి. ఇప్పటికే మల్బరీ సాగు విస్తీర్ణం గణనీయంగా ఉంది. దీన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తాం. – పద్మమ్మ, పట్టు పరిశ్రమ శాఖ జేడీ, శ్రీసత్యసాయి జిల్లా -
సిరుల ‘పట్టు’
చిత్తూరు జిల్లా వి.కోట మండలం రామాపురం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జి.కుమార్. ఐదెకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఒకసారి పంట సాగు చేయడానికి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఏటా ఐదారు పంటలు తీస్తున్నామని కుమార్ చెప్పారు. ఇలా ఐదెకరాల్లో ప్రతి పంటకూ రూ.2 లక్షల వరకు ఆదాయం లభిస్తోందని కుమార్ వెల్లడించారు. పట్టు పురుగుల పెంపకం సున్నితమైన అంశమని, చిన్న పిల్లల మాదిరిగా వాటిని పెంచుతామని వివరించారు. వాటికి తగిన ఉష్ణోగ్రత, సమపాళ్లలో వెలుతురు ఉండేలా చూసుకుంటే పట్టు పురుగుల పెంపకం కష్టమేమీ కాదన్నారు. తాను మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగులు పెంచడం చేపట్టిన నాటినుంచి ఇప్పటివరకు తాను ఏ పంటలోనూ నష్టపోలేదని కుమార్ చెప్పారు. సాక్షి, చిత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో మల్బరీ సాగు ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మూడేళ్లుగా మల్బరీ సాగు పెరుగుతూ ప్రస్తుతం.. 1,26,828 లక్షల ఎకరాలకు విస్తరించింది. 2022–23 సంవత్సరంలో మరో 12 వేల ఎకరాల్లో సాగును విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ‘సిల్క్ సమగ్ర–2’ కింద వచ్చే ఐదేళ్లలో పట్టు పురుగుల పెంపకం చేపట్టే ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని, ఇతర రైతులకు 75 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. పట్టు గూళ్లను విక్రయించే రైతులకు రూ.45 కోట్ల మేర రాయితీ చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం 13.35 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న పట్టు పురుగుల పెంపక రంగం (సెరీ కల్చర్) ద్వారా రానున్న రోజుల్లో మరింత మంది రైతుల చేత సాగు చేయించేందుకు కార్యాచరణ చేపట్టింది. గ్రామీణులకు ఉపాధి మార్గం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల సమ్మేళనంగా ప్రసిద్ధి పొందిన పట్టు పరిశ్రమ ఉపాధి ఆధారిత రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగంలో మార్కెటింగ్ తప్ప మిగిలిన కార్యకలాపాలన్నీ కుటీర పరిశ్రమగానే కొనసాగుతున్నాయి. హెక్టారు మల్బరీ సాగుతో ఏడాది పొడవునా 12 మందికి ఉపాధి కలుగుతోంది. ఈ పంట మహిళలకు ఎంతో అనువుగా ఉంటోంది. సెరీ కల్చర్‌లో చిత్తూరుకు రెండో స్థానం చిత్తూరు జిల్లాలో 37,631 ఎకరాల్లో మల్బరీ సాగవుతుండగా.. రాష్ట్రంలోనే ఈ జిల్లా రెండో స్థానంలో ఉంది. కుప్పం, పలమనేరుతోపాటు చిత్తూరు ప్రాంతంలో దీని సాగు విస్తరించింది. కుప్పం పరిధిలో 3, పలమనేరు పరిధిలో 10, చిత్తూరు పరిధిలో 2 చాకీ పురుగుల పెంపక కేంద్రాలు ఉండగా.. పెద్ద పురుగుల్ని పెంచే గదులు కుప్పం డివిజన్లో 6,500, పలమనేరు డివిజన్లో 6,000, చిత్తూరు డివిజన్లో 500 కలిపి 13 వేల వరకు ఉన్నాయి. జిల్లాలో రైతులు పండించిన పట్టు గూళ్లను వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం పట్టు దారం తీసే కేంద్రాలను పునరుద్ధరించింది. వ్యవసాయేతర యూనిట్లు నెలకొల్పేందుకు వచ్చే ప్రైవేట్ రీలర్లకు యంత్ర సామగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం 75% రాయితీ ఇస్తోంది. -
ఒకేసారి పెట్టుబడి, నెలనెలా ఆదాయం.. క్వింటాలుకు రూ.50 వేలుపైనే..
సాక్షి, దౌల్తాబాద్ దుబ్బాక): రోజురోజుకు పెరుగుతున్న సాగు వ్యయంతో వ్యవసాయం అంటేనే రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఇంధనం ధరలు, కూలీల ఖర్చులు, పెట్టుబడి వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సాగుపై దృష్టి సారించాడు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబరాస్‌పూర్ గ్రామానికి చెందిన యువ రైతు చక్రపాణి. వ్యవసాయ అధికారుల సూచనతో మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకంపై దృష్టి సారించి నెలనెలా మంచి ఆదాయం పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.... రెండకారాల్లో సాగు.. గ్రామంలో సోదరుడి మల్బరీ తోట నుంచి చెట్టు కొమ్మలను తెచ్చి రెండెకరాల్లో సాగు ప్రారంభించా. ట్రాక్టర్‌కు రూ.14వేలు, కూలీలకు కలిపి రూ.16వేలు ఖర్చు అయ్యింది. రెండు రోజుల్లో రెండెకరాల్లో సుమారు 11వేల మొక్కలను నాటించా. ఒక్కో మొక్కకు మూడు ఫీట్ల దూరం ఉండేలా ఏర్పాటు చేసుకున్నా.మొక్కల మధ్య పెరిగిన కలుపును ఎప్పటికప్పుడు కూలీలతో తొలగించాం. మొక్కలకు నీరు అందించేందుకు రూ.8వేల వ్యయంతో ప్రభుత్వం సబ్సిడీపై అందించిన స్పింకర్లను ఏర్పాటు చేసుకున్న. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు అందించడంతో మొదటి కోత వచ్చేందుకు మూడు నెలల సమయం పట్టింది. గతేడాది జూన్‌లో మొక్కలు నాటగా సెప్టెంబర్‌లో ఆకులు కోతకు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ప్రతీ నెలరోజులకు ఒకసారి కొమ్మలు, ఆకులు కోతకు వస్తున్నాయి. 150 రింగుల్లో వేసిన పట్టు పురుగులతో నెలకు సుమారు క్వింటాలున్నర పట్టుగూళ్లు వస్తాయి. కిలో రూ.500ల చొప్పున మార్కెట్లో విక్రయిస్తే సుమారు రూ.70 నుంచి 80వేల ఆదాయం వస్తుంది. కూలీలు, రవాణాకు కలిపి రూ.5వేలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి సాగుచేసిన మొక్కలు సుమారు 20ఏళ్ల వరకు ఉపయోగపడతాయి. ఈ సాగులో పెట్టుబడి ఒక్కసారే, ఆదాయం మాత్రం నెలనెలా పొందవచ్చు. పట్టుగూళ్లు.. రూ.8 లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించి, అందులో పట్టు పురుగుల పెంపకం ప్రారంభించా. సిద్దిపేటలోని ఓ డీలర్ నుంచి పట్టు పురుగుల గుడ్ల రింగులను తెప్పించా. 150 రింగులకు సుమారు రూ.1600ల ఖర్చు అయ్యింది. ఒక్కో రింగులో 50చొప్పున గుడ్లు ఉంటాయి. గుడ్లను ప్రత్యేక బాక్సుల్లో పెట్టి నాలుగు రోజులు ఉంచితే గుడ్డు పగిలి పట్టుపురుగులు బయటకు వస్తాయి. ఇలా వచ్చిన పట్టు పురుగులను నెట్ ఏర్పాటు చేసిన బాక్సుల్లో ఉంచాలి. మల్బరీ ఆకులను క్రమం తప్పకుండా అందిస్తూ ఉంటే నెలరోజుల్లో పట్టుపురుగులు పెరిగి, చంద్రికలను(పట్టుగూళ్లు) తయారు చేస్తాయి. క్వింటాలుకు రూ.50వేలపైనే.. 150 రింగుల్లో వేసిన పట్టు పురుగులతో నెలకు సుమారు క్వింటాలున్నర పట్టుగూళ్లు వస్తాయి. కిలో రూ.500ల చొప్పున మార్కెట్లో విక్రయిస్తే సుమారు రూ.70 నుంచి 80వేల ఆదాయం వస్తుంది. కూలీలు, రవాణా కలిపి రూ.5వేలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి సాగుచేసిన మొక్కలు సుమారు 20ఏళ్ల వరకు ఉపయోగపడతాయి. ఈ సాగులో పెట్టుబడి ఒక్కసారే ఉన్నా, ఆదాయం మాత్రం నెలనెలా పొందవచ్చు. ఏడాదిగా సాగు.. వ్యవసాయంలో ఆదాయం తగ్గడంతో పట్టుపురుగుల పెంపకం వైపు దృష్టి సారించా. గతేడాది మల్బరీ, పట్టు పురుగుల పెంపకం చేపడుతున్నా. కుటుంబ సభ్యులతో కలిసి పని చేస్తాం. ఏడాదిలో గరిష్టంగా 10 నుంచి 12 బ్యాచ్‌ల వరకు వేయవచ్చు. నెలకు రూ.60వేలపైనే ఆదాయం సమకూరుతుంది. మొక్కలు కావాల్సిన వారికి ఉచితంగా అందిస్తాం. – చక్రపాణి, రైతు, ముబరాస్‌పూర్ రైతులు దృష్టి సారించాలి ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు రైతులు దృష్టి సారించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలువచ్చే పంటలను సాగుచేయాలి. ప్రత్యామ్నాయ పంటలసాగు కోసం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం, బీసీలకు 50 శాతం ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. – గోవిందరాజులు, మండల వ్యవసాయ అధికారి, దౌల్తాబాద్ చదవండి: JEE Mains 2022 Answer Key: ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం -
సెరికల్చర్ కాదు.. ‘సిరికల్చర్’!
సాక్షి, హైదరాబాద్: పట్టుగూళ్లు పెంచితే సెరికల్చర్.. సాగు చేస్తే లాభాలేలాభాలు.. అప్పుడు దాన్ని సిరికల్చర్ అనొచ్చేమో! ధర రికార్డుస్థాయిలో ఉండటంతోపాటు లాభాలు దండిగా ఉండటంతో రాష్ట్రంలో పట్టుగూళ్ల రైతుల సందడి పెరుగుతోంది. పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచే అవకాశముందని ఉద్యాననిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో ఏడాదిలో 10 నుంచి 11నెలలపాటు సెరికల్చర్‌కు అనుకూల వాతావరణం ఉంటుంది. మనదేశంలో 36 మిలియన్ టన్నుల పట్టు ఉత్పత్తి చేస్తుండగా వినియోగం 68 మిలియన్ టన్నులు ఉంటోంది. దీంతో మల్బరీ సాగుకు అవకాశాలు పెరిగాయి. 2021–22 కేంద్రం బడ్జెట్లో పట్టు దిగుబడిపై వ్యాట్‌ను 7 నుంచి 15 శాతానికి పెంచడంతో చైనా పట్టు దిగుమతులు తగ్గి దేశీయంగా ప్రోత్సహం పెరిగింది. కిలో పట్టు ధరలు రికార్డుస్థాయిలో రూ.730కిపైగా పలుకుతోంది. ఈ నెల రెండున సికింద్రాబాద్ మార్కెట్లో కేజీ 685 పలికింది. రాష్ట్రంలో 12,654 ఎకరాల్లో మల్బరీ సాగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి 3,176 ఎకరాల్లో ఉన్న మల్బరీ సాగు ఇప్పుడు 12,654 ఎకరాలకు విస్తరించింది. రాష్ట్ర అవసరాలు 984 టన్నులు కాగా 306.6 టన్నుల సిల్క్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో 6,500 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో మల్బరీ సాగును వరికి ప్రత్యామ్నాయంగా ప్రోత్సహిస్తే బాగుంటుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. పట్టు ఉత్పత్తి ఇలా... : పట్టుపురుగులు మల్బరీ ఆకులను ఆహారంగా తిని 30 రోజుల్లో నాలుగు దశలను పూర్తి చేసుకుంటాయి. చివరిదశలో తన రక్షణ కోసం గూడును ఏర్పాటు చేసుకుంటాయి. ఈ గూడు నుంచే పట్టుదారం ఉత్పత్తి అవుతుంది. ఈ పట్టుతోనే పట్టు వస్త్రాలను తయారు చేస్తారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన పట్టును గద్వాల, పోచంపల్లి, నారాయణపేట్, కొత్తకోటలోని మగ్గం నేత కార్మికులకు అందిస్తోంది. సెరీకల్చర్‌కు కేంద్ర నిధులు... సిల్క్ సమగ్ర పేరుతో షెడ్డుకు అయ్యే రూ.4 లక్షల్లో కేంద్రం రూ.2 లక్షలు గ్రాంట్ ఇస్తోంది. మల్బరీ మొక్కలను కిసాన్ నర్సరీల ద్వారా అందిస్తోంది. యూనిట్ ధర రూ.1.50 లక్షలుకాగా, 50 శాతం రాయితీ కల్పిస్తోంది. ప్లాంటేషన్‌కు అయ్యే ఖర్చు రూ.50 వేలల్లోనూ 50 శాతం రాయితీ ఇస్తోంది. సెరికల్చర్ పథకాల్లో సబ్సిడీలో కేంద్రంవాటా 65 శాతం, రాష్ట్రం 25 శాతం, 10 శాతం రైతు భరించే విధంగా పథకాలున్నాయి. -
ఏపీ: సెరీ కల్చర్ అభివృద్ధికి సర్కారు చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టు పురుగుల పెంపకాన్ని (సెరీకల్చర్) మరింతగా విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 7,500 ఎకరాల్లో టస్సార్ పట్టు పురుగుల పెంపకం ద్వారా మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. మల్బరీ పట్టు పురుగుల పెంపకంలో రెండో స్థానంలో ఉంది. ముడి పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. తద్వారా మన రాష్ట్రానికి బెస్ట్ బైవోల్టైస్ సెరీకల్చర్ ప్రాక్టీసింగ్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డు లభించింది. మల్బరీ విస్తరణకు ప్రోత్సాహకాలు రాష్ట్రంలో 1,19,050 ఎకరాల్లో 68,921 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. అత్యధికంగా అనంతపురంలో 48,922 ఎకరాలు, చిత్తూరులో 46,400 ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. తూర్పు ఏజెన్సీ పరిధిలోని 7,500 ఎకరాల్లో టస్సార్ సాగు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 59,079 టన్నుల పట్టుగూళ్లు, 8,420 టన్నుల ముడిపట్టు ఉత్పత్తి అవుతోంది. పట్టు పరిశ్రమపై ఆధారపడి 13.09 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,053.70 కోట్ల స్థూల విలువ సాధించిన పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన రెండేళ్లలో 13,500 ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి రాగా.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో మరో 10వేల ఎకరాల్లో మల్బరీ సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.51.920 కోట్ల అంచనాతో కార్యాచరణ సిద్ధం చేశారు. ‘సిల్క్ సమగ్ర’ పథకం కింద రూ.35.47 కోట్లు, స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ (ఎస్డీఎస్) కింద రూ.12.29 కోట్లను ప్రతిపాదించారు. ఇప్పటికే ఎస్డీఎస్ కింద రూ.12.29 కోట్లు విడుదల చేయగా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.19.86 కోట్లు కేటాయింపులు జరిపారు. ఎకరా విస్తీర్ణంలో మల్బరీ మొక్కలు వేసుకునేందుకు రూ.10,500, షెడ్‌కు రూ.3 లక్షలు, పరికరాలకు రూ.57,500, మందుల కోసం రూ.3,750 చొప్పున రైతులకు అందిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న తెల్ల పట్టుగూళ్లకు కిలోకు రూ.50 చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్ కూడా ఇస్తోంది. కొత్తగా మూడు ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు గత ప్రభుత్వ హయాంలో తగిన ప్రోత్సాహం లేక నిస్తేజంగా తయారైన పట్టు పరిశ్రమకు ప్రస్తుత ప్రభుత్వం జవసత్వాలు కల్పిస్తోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలవడంతో మూలనపడ్డ మగ్గాలు సైతం మళ్లీ నేత నేస్తున్నాయి. ప్రభుత్వ చేయూతతో పెద్దఎత్తున పట్టు పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకు హిందూపురం, తాడిపత్రి, కుప్పం, శాంతిపురం, ధర్మవరంలలోనే పట్టు ఆధారిత పరిశ్రమలున్నాయి. గడచిన రెండేళ్లలో రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల పెట్టుబడులతో మదనపల్లి, పెద తిప్పసముద్రం, చేబ్రోలులో కొత్తగా ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ధర్మవరంలో మరో పరిశ్రమ రాబోతుంది. రైతులు ముందుకు రావాలి పట్టు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. మల్బరీ సాగు చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఒక్కసారి మొక్కలు వేస్తే కనీసం 20 ఏళ్ల పాటు ప్రతినెలా ఆదాయం వస్తుంది. తొలి ఏడాది 600 కేజీలు, రెండో ఏడాది 800 కేజీల చొప్పున పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. ఆ తర్వాత క్రమేపి వెయ్యి నుంచి 1,200 కేజీల వరకు పెరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో పట్టుగూళ్లకు మంచి రేటు పలుకుతోంది. సాగుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడ్పాటునిస్తుంది. – సి.అరుణకుమారి, అడిషనల్ డైరెక్టర్, సెరీకల్చర్ -
మల్బరీ సాగులో మహిళా రైతులు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు. మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే మల్బరీ పంటపై దృష్టి సారించారు. పంట కాలం తక్కువ.. లాభం ఎక్కువ.. మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్ నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ అవగాహన పెంచుకుంటే నష్టం రాదు నాకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేస్తున్నా. సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు పట్టు గూళ్ల దిగుబడి పొందవచ్చు. తక్కువ వ్యవధిలో, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అయితే, మల్బరీ పంట సాగుపై అవగాహన పెంచుకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. మా ఊళ్లో చాలా మంది రైతులు మల్బరీ పంటనే సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు. – గోపగాని సరిత, మహిళా రైతు, తుమ్మనపల్లి హేళన చేసిన వారే సాగులోకి వస్తున్నారు నాకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి మల్బరీ సాగుచేస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించుకుని మల్బరీ పంట సాగు మొదలు పెట్టాను. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళనగా చూశారు. పంట చేతికి వచ్చిన తర్వాత లాభాల గురించి తెలుసుకుని వాళ్లు కూడా మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఆహార పంటల కంటే మల్బరీ సాగే ఉత్తమం. – నిమ్మల వనజారెడ్డి, మహిళా రైతు, తుమ్మనపల్లి ఆరేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేపట్టేందుకు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాను. వారు మల్బరీ సాగు విధానం గురించి వివరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నా. మల్బరీ సాగులో ఏమైనా సందేహాలు వస్తే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటున్నా. ఉద్యోగిలా నెల నెలా ఆదాయం పొందుతున్నా. సంతోషంగా ఉంది. – కాసిరెడ్డి కవిత, మహిళా రైతు, తుమ్మనపల్లి -
సేంద్రియ మల్బరీతో లాభాల పట్టు!
ఎదుగూ బొదుగూ లేని కాంట్రాక్టు ఉద్యోగం కన్నా.. లోతైన అవగాహనతో సేంద్రియ సేద్యం చేయటమే ఉత్తమమం. అందులోనూ సాధారణ పంటల కన్నా నెల నెలా ఆదాయాన్నిచ్చే సేంద్రియ మల్బరీ సాగే మేలని ఓ యువ రైతు రుజువు చేశారు. అంతేకాదు, ఉత్తమ రైతుగా పురస్కారాన్ని అందుకోవటం విశేషం. ఆదర్శ రైతు స్ఫూర్తిదాయక గాథ ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం. మామిడి సైదులు తనకున్న నాలుగు ఎకరాల భూమిలో సేంద్రియ మల్బరీ సాగు చేసుకుంటూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాలకు చెందిన సైదులు.. గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో సెరికల్చర్ విభాగంలో ఫీల్డ్ ఆఫీసర్(కాంట్రాక్టు ఉద్యోగి)గా ఆరేళ్లు పనిచేశాడు. ఉద్యోగం పర్మినెంట్ అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో 2006లో ఉద్యోగం మానేసి మల్బరీ రైతుగా మారారు. నల్లగొండ పట్టు పరిశ్రమ శాఖ, గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సహకారం, సలహాలతో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో నాలుగు ఎకరాల మల్బరీ తోట సాగు చేస్తున్నారు. ఆకు నాణ్యత కోసం వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, జీవన ఎరువులు వాడుతున్నారు. సంవత్సరానికి కనీసం 7 పంటలు తీస్తున్నారు. 300 గుడ్లు చాకీ చేసి 45 రోజుల్లో ఒక పంట తీస్తున్నారు. పంటకు అన్ని ఖర్చులూ పోను రూ.75 వేల చొప్పున సంవత్సరానికి రూ.5 లక్షలకు పైగా నికరాదాయం పొందుతున్నారు. వీలైనంత వరకు పనులన్నీ భార్య భర్త ఇద్దరే చేసుకుంటారు. పంట చివరి 7 రోజుల్లో మాత్రం నలుగురు కూలీల సహాయం తీసుకుంటారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పట్టు రైతుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారు. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మండలంలో పలువురు రైతులు పట్టు శాఖ అధికారుల తోడ్పాటుతో సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. పట్టు గూళ్ల ఉత్పత్తే లక్ష్యంగా.. గతంలో జిల్లాలో మల్బరీ రైతులు పట్టు పురుగులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పట్టు గుడ్లను ఉత్పత్తి చేసేవారు. దీనివలన రైతుకు లాభాలు తక్కువగా వస్తున్నాయి. సైదులు పట్టు పురుగుల ఉత్పత్తి కోసం తన ఇంటి ఆవరణలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడలోని టెక్నికల్ సర్వీస్ సెంటర్ సరఫరా చేస్తున్న పట్టు గుడ్లను తీసుకొచ్చి ట్రేలలో గుడ్లను పెట్టి, నల్లటి గుడ్డ కప్పి, గుడ్లు పగిలే దశలో వాటిని బయటకు తీస్తారు. మల్బరీ ఆకును చాకింగ్ మిషన్ ద్వారా కట్ చేసి శైశవ దశలో పురుగులకు మేతగా వేసి పట్టు పురుగులను ఉత్పత్తి చేస్తున్నారు. పలు ప్రాంతాల రైతులకు విక్రయించడం ద్వారా సైదులు అధిక లాభాలు గడిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో మల్బరీ సాగు ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో అధిక లాభాలు సాధించవచ్చని ఉద్యాన అధికారి కృష్ణవేణి తెలిపారు. మల్బరీ రైతులకు షెడ్ నిర్మాణానికి, డ్రిప్‌కు సబ్సిడీ అందిస్తుందన్నారు. ఆసక్తి గల రైతులు మండల అధికారులను సంప్రదించవచ్చన్నారు. – చవగాని నాగరాజుగౌడ్, సాక్షి, పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా పట్టు పురుగుల విక్రయంతో అధిక లాభాలు గత కొన్నేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో లాభసాటిగా మల్బరీ సాగు చేస్తున్నాను. గుడ్లను తీసుకొచ్చి ఇంటి దగ్గరే పట్టు పురుగులు పెంచుతున్నాను. ఇతర ప్రాంతాల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాను. – మామిడి సైదులు (99599 33842), మల్బరీ రైతు, లింగాల, సూర్యాపేట జిల్లా -
పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మల్బరీసాగు, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని పౌర సరఫరాలు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీని పెంచి దేశంలో మల్బరీ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచేలా చేస్తామని చెప్పారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో మల్బరీ సాగు, డ్రిప్ ఇరిగేషన్‌పై 12 జిల్లాల రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం చేసి అప్పులపాలు కాకుండా రైతుబంధు ద్వారా ఆర్థిక సహాయం, రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. పట్టు పురుగుల పెంపకంలో సాంకేతికపరమైన మార్పులు వచ్చాయని హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లిలో రైతు నర్ర స్వామిరెడ్డి రూ.3 లక్షలు ఖర్చు చేసి మల్బరీ సాగులో రూ.10 లక్షల ఆదాయం పొందారని గుర్తు చేశారు. రాష్ట్రంలో తుమ్మనపల్లి మరో అంకాపూర్‌లా ఆదర్శం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ శాతం వ్యవసాయానికే కేటాయించామని తెలిపారు. బిందు సేద్యానికి 100 శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు అమర్చుతున్నామని గ్రీన్ హౌజ్ కల్టివేషన్‌కు 30 లక్షల సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. డ్ రిప్, స్ప్రింక్లర్ల సేద్యానికి రూ.900 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మున్ముందు పట్టు ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండి, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు బొడిగ శోభ, వొడితెల సతీశ్‌కుమార్, హార్టీకల్చర్, సెరీకల్చర్ డైరెక్టర్ ఎల్.వెంకట్రాంరెడ్డి, మదన్మోహన్, హార్టీకల్చర్ డీడీ శ్రీనివాస్, డీఆర్డీవో వెంకటేశ్వర్రావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, 12 జిల్లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో పట్టు!
- బోర్లలో నీళ్లు రాక 10 వేల ఎకరాల్లో ఎండిన మల్బరీ తోటలు - గూళ్లకూ గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులు - 50 శాతం తగ్గిన పట్టుగూళ్ల దిగుబడి...రూ.200 కోట్ల నష్టం అనంతపురం అగ్రికల్చర్ : పెనుకొండ మండలం మహదేవపల్లిలో 45 మంది రైతులు 78 ఎకరాల్లో మల్బరీ సాగు చేసేవారు. నెలకు సరాసరి 3,150 కిలోల పట్టుగూళ్లు పండించేవారు. ఏడాదికి కాస్త అటూఇటుగా రూ.1.10 కోట్ల ఆదాయం పొందేవారు. దీనివల్ల వారి జీవనం సాఫీగా సాగేది. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. వర్షాల్లేక భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయి. ఉన్నఫలంగా 30 బోరుబావులు ఎండిపోయాయి. మల్బరీ విస్తీర్ణం 78 ఎకరాల నుంచి కేవలం ఆరు ఎకరాలకు పడిపోయింది. ఈ ఒక్క గ్రామంలోనే కాదు.. కనగానపల్లి మండలం వేపకుంట, లేపాక్షి మండలం కోడిపల్లి, నల్లమాడ మండలం కుటాలపల్లి, అమడగూరు మండలం కంచరవాండ్లపల్లి, తలమర్లవాండ్లపల్లి, నల్లచెరువు మండలం కడపలవాండ్లపల్లి, గుడిబండ మండలం మోరుబాగల్, బీటీ పల్లి, మడకశిర మండలం ఉప్పార్లపల్లి, దొడ్డేపల్లి, సుంకిరెడ్డిపల్లి... ఇలా అనేక గ్రామాల్లో బోర్లలో నీరు రాక పట్టు (మల్బరీ) సాగు ప్రమాదంలో పడింది. కూరగాయలు, స్వల్పకాలిక పండ్లతోటల మాదిరిగా కాకుండా మల్బరీ సాగు చేసే రైతులు రేషం షెడ్లు, రేరింగ్స్టాండ్, ఇతర సామగ్రి కోసం రూ.లక్షలు ఖర్చు చేసివుంటారు. ఒకసారి పుల్ల నాటుకుంటే పదేళ్ల పాటు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని కోసం ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. ఉన్నఫలంగా తోటలు ఎండిపోతుండడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. 10 వేల ఎకరాలు ఎండుముఖం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పది వేల ఎకరాల్లో మల్బరీ తోటలు ఎండిపోయాయి. పట్టుపరిశ్రమశాఖ తయారు చేసిన అధికారిక నివేదిక ప్రకారమే హిందూపురం డివిజన్లో 856 ఎకరాలు, మడకశిర 506 , పెనుకొండ 683, ధర్మవరం 222, కళ్యాణదుర్గం 172, అనంతపురం డివిజన్లో 72 ఎకరాలు.. ఇలా జిల్లాలో 7,560 ఎకరాల మల్బరీ ఎండిపోయింది. అనధికారిక గణాంకాలు పరిగణనలోకి తీసుకుంటే ఈ విస్తీర్ణం పదివేల ఎకరాలకు పైమాటే. రూ.200 కోట్లకు పైగా నష్టం రాష్ట్రంలో మల్బరీ అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది మన జిల్లాలోనే. ఇప్పుడు దీని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాతాళ గంగమ్మ సగటున 22 మీటర్ల లోతుకు పడిపోవడంతో బోర్ల నుంచి గుక్కెడు నీరు రావడం గగనమైంది. జిల్లాలో 70-80 వేల బోర్లు ఎండిపోయాయి. దీనివల్ల మల్బరీపై ఆధారపడిన 30 వేల మంది రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. జిల్లాలో 29,298 ఎకరాల్లో మల్బరీ తోటలు ఉండగా.. ఇప్పుడు పది వేల ఎకరాల్లో ఎండిపోయాయి. నీరు, పోషకాలు సరిగా లేక ఆకులో నాణ్యత కూడా తగ్గింది. ఫలితంగా ఏడాదికి 5 నుంచి 6 పంటలు రావాల్సివుండగా 3 నుంచి 4 పంటలకు పరిమితమయ్యాయి. పట్టుగూళ్ల దిగుబడులు 50 శాతం తగ్గడంతో రైతులు ఏడాదికి రూ.200 కోట్లకు పైగా నష్టపోతున్నారు. ధరలూ దారుణం పట్టుగూళ్లకు కూడా ధరలు సగానికి పడిపోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. సీబీ (పచ్చరకం) గూళ్లు కిలో రూ.100 నుంచి రూ.120, బైవోల్టీన్ (తెల్లగూళ్లు) కిలో రూ.175 నుంచి రూ.200 వరకు పలుకుతున్నాయి. దీనివల్ల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 2010-11 ఆర్థికసంవత్సరంలో సీబీ గూళ్లు కిలో రూ.350 , బైవోల్టీన్ రూ.400 పైగా పలికాయి. నాలుగేళ్లు ధరలు స్థిరంగా కొనసాగడంతో లాభదాయకంగా ఉంటుందనే ఆలోచనతో అనేకమంది రైతులు మల్బరీ వైపు దృష్టి సారించారు. 2014 ఎన్నికల తర్వాతే పట్టురైతులకు సమస్యలు మొదలయ్యాయి. ఇదే పరిస్థితి మరో ఆరు నెలలు కొనసాగితే పట్టుసాగుకు కేంద్ర బిందువుగా ఉన్న ‘అనంత’ అట్టడుగుస్థాయికి చేరుకునే ప్రమాదముంది. రైతుల పరిస్థితి ఇబ్బందిగానే ఉంది- సి.అరుణకుమారి, జేడీ, పట్టుపరిశ్రమశాఖ జిల్లాలో పట్టు రైతుల పరిస్థితి ఇబ్బందికరంగానే తయారైంది. ఒకపక్క బోరుబావులు ఎండిపోయి తోటలు వదిలేస్తున్నారు. మరోపక్క నిలకడలేని ధరలు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా సీబీ గూళ్లు కిలోకు రూ.10, బైవోల్టిన్ గూళ్లకు రూ.50 ప్రకారం ఇన్సెంటివ్ ఇస్తున్నాం. రాయితీ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో మల్బరీ సాగులో ‘అనంత’ను అగ్రస్థానంలో నిలిపాం. మహదేవపల్లి, వేపకుంట, కోడిపల్లి లాంటి అనేక గ్రామాల్లో ఏళ్ల తరబడి పెంచుకున్న తోటలు వదిలేశారు. జిల్లాలో నెలకొన్న దారుణ పరిస్థితులను ఈనెల 27న జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. మహదేవపురంలో ఎండిన మల్బరీ తోటలను చూపించాం. తక్షణ సాయంగా రూ.44 కోట్లతో నివేదిక సమర్పించాం.