Mumbai Cops
-
డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే.. ముంబై విడిచి పోతా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మాదకద్రవ్యాల వినియోగం తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో 99 శాతం మంది డ్రగ్స్ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు నటి కంగనా రనౌత్. ఈ క్రమంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కంగనా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు. అధ్యాయన్ సుమన్‌తో తనకు సంబంధాలున్నాయని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, అతడిని కూడా బలవంతం చేసినట్లు ఒక ఇంటర్యూలో కంగనా చెప్పారని అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేశారు. ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తారని అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీల్ ప్రభు అడిగిన ప్రశ్నకు తాను సమాధానం చెప్పినట్లు ఆయన తెలిపారు. దాంతో కంగనా దీనిపై స్పందించారు. ఈ క్రమంలో తాను డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతానని సవాలు చేశారు కంగనా రనౌత్. (చదవండి: ‘క్వీన్’కు కేంద్రం రక్షణ! ) I am more than happy to oblige @MumbaiPolice @AnilDeshmukhNCP please do my drug tests investigate my call records if you find any links to drug peddlers ever I will accept my mistake and leave Mumbai forever, looking forward to meet you 🙂 https://t.co/gs3DwcIOvP — Kangana Ranaut (@KanganaTeam) September 8, 2020 డ్రగ్స్ పరీక్షకు తాను సిద్ధమే అన్నారు కంగనా. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్, ముంబై పోలీసుల ఆదేశాలను తాను సంతోషంగా స్వీకరిస్తానన్నారు. తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని, తన ఫోన్ కాల్స్ రికార్డులు పరిశీలించి డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధాలున్నట్లు ఆధారాలు చూపాలన్నారు కంగనా. అలా చేస్తే తన తప్పును ఒప్పుకుని ముంబైని శాశ్వతంగా వదిలిపోతానని చెప్పారు. దీని కోసం మిమ్మల్ని కలిసేందుకు ఎదురు చూస్తున్నానంటూ మంగళవారం ట్వీట్ చేశారు కంగనా. దీన్ని నిరూపిస్తే ముంబైని శాశ్వతంగా వీడుతానని చెప్పారు. -
ఒక్క రోజే 5.63 లక్షల జరిమానా
ముంబై: కొత్త సంవత్సర వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి ముంబై పోలీసులు శుక్రవారం ఒక్క రోజే రూ.5.63 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని పట్టుకోవడం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో బారీ కేడ్లను ఏర్పాటు చేశారు. బ్రీత్ అనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించారు. మొత్తం 705 డ్రంక్ అండ్ డ్రైవ్, 58 రాష్ డ్రైవింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. నిషేధిత పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపినందుకు 1,135 మంది నుంచి ఫైన్ వసూలు చేశారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినందుకు 1,906 మందికి జరిమానా విధించారు. -
గ్యాంగ్‌రేప్ కేసు... హైదరాబాద్ వచ్చిన మోడల్
సామూహిక అత్యాచారానికి గురైన ముంబై మోడల్‌ను విచారణ నిమిత్తం అక్కడి పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ మోడల్ హైదరాబాద్‌కు వచ్చింది. అయితే డిసెంబర్ 31న ఆ హోటల్లో నిర్వహకులు తనపై అత్యాచారం చేశారని ఆ మోడల్ ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ నిమిత్తం ముంబయి పోలీసులు ఆ మోడల్‌ను హైదరాబాద్ తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ ఈవెంట్ అంటూ పిలిచిన దుండగులు మత్తు మందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. పూర్తిగా మామూలు స్థితికి రాని ఆమెను ప్రైవేట్ బస్సులో ముంబై పంపించేశారు.అక్కడకు చేరుకున్న బాధితురాలు జన్‌శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో మంగళవారం మహారాష్ట్రలోని వెర్సోవా ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి బుధవారం అక్కడి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తుతో పాటు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందం మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చింది.