
ఒక్క రోజే 5.63 లక్షల జరిమానా
కొత్త సంవత్సర వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి మంబై పోలీసులు ఒక్క రోజే రూ.5.63 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు.
ముంబై: కొత్త సంవత్సర వేడుకల్లో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారి నుంచి ముంబై పోలీసులు శుక్రవారం ఒక్క రోజే రూ.5.63 లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిని పట్టుకోవడం కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో బారీ కేడ్లను ఏర్పాటు చేశారు.
బ్రీత్ అనలైజర్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిని గుర్తించారు. మొత్తం 705 డ్రంక్ అండ్ డ్రైవ్, 58 రాష్ డ్రైవింగ్ కేసులను పోలీసులు నమోదు చేశారు. నిషేధిత పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపినందుకు 1,135 మంది నుంచి ఫైన్ వసూలు చేశారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపినందుకు 1,906 మందికి జరిమానా విధించారు.