గ్యాంగ్రేప్ కేసు... హైదరాబాద్ వచ్చిన మోడల్ | Dancer's Rape: Mumbai Cops Coming hydrabad due to Probe | Sakshi
Sakshi News home page

గ్యాంగ్రేప్ కేసు... హైదరాబాద్ వచ్చిన మోడల్

Published Fri, Jan 10 2014 2:15 PM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

Dancer's Rape: Mumbai Cops Coming hydrabad due to Probe

సామూహిక అత్యాచారానికి గురైన ముంబై మోడల్ను విచారణ నిమిత్తం అక్కడి పోలీసులు శుక్రవారం హైదరాబాద్కు తీసుకువచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ మోడల్ హైదరాబాద్కు వచ్చింది. అయితే  డిసెంబర్ 31న ఆ హోటల్లో నిర్వహకులు తనపై అత్యాచారం చేశారని ఆ మోడల్ ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ నిమిత్తం ముంబయి పోలీసులు ఆ మోడల్ను హైదరాబాద్ తీసుకువచ్చారు.

వివరాల్లోకి వెళితే డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ ఈవెంట్ అంటూ పిలిచిన దుండగులు మత్తు మందు ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. పూర్తిగా మామూలు స్థితికి రాని ఆమెను ప్రైవేట్ బస్సులో ముంబై పంపించేశారు.అక్కడకు చేరుకున్న బాధితురాలు జన్‌శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో మంగళవారం మహారాష్ట్రలోని వెర్సోవా ఠాణాలో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలికి బుధవారం అక్కడి ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తుతో పాటు నిందితుల్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక పోలీసు బృందం మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement