Mumbai Indians captain
-
ఇషాన్ కిషన్‌తో కలిసి హార్దిక్ పాండ్యా పూజలు (ఫొటోలు)
-
CSK VS MI: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో డకౌటైన హిట్‌మ్యాన్.. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో సునీల్ నరైన్ (15), మన్దీప్ సింగ్ (15), దినేశ్ కార్తీక్ (15) వరుస స్థానాల్లో ఉన్నారు. చదవండి: ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..? ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లో (పంజాబ్) కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన రోహిత్.. మరో చెత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గా (11) అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్.. గౌతమ్ గంభీర్‌తో సమానంగా 10 సందర్భాల్లో డకౌటైన కెప్టెన్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో చెన్నైతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో గ్రీన్ (6) క్లీన్ బౌల్డ్ కాగా.. దీపక్ చాహర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ముంబై 2 వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి ఇషాన్ కిషన్ (7)ను ఔట్ చేసిన చాహర్.. ఐదో బంతికి హిట్‌మ్యాన్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 59/3గా ఉంది. నేహల్ వధేరా (21), సూర్యకుమార్ యాదవ్ (22) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక -
WPL 2023: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా టీమిండియా సారథి
Women Premier League 2023: మహిళా ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ పేరును ప్రకటించింది. టీమిండియా సారథి హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా హర్మన్‌ప్రీత్ భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా ఉండి.. మిథాలీ రాజ్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా టీ20 టోర్నీలో జట్టును సెమీస్ వరకు చేర్చింది. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో 150 టీ20లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. సరికొత్త ఇన్నింగ్స్ ఇరవై ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన హర్మన్‌ప్రీత్.. దాదాపు దశాబ్దకాలంగా అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు వెన్నుముకగా ఉంది. ఆమె అందించిన సేవలకు గానూ అర్జున అవార్డు లభించింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కుటుంబంలో అడుగుపెట్టిన హర్మన్.. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించనుంది. ఇదిలా ఉంటే.. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు హెడ్‌కోచ్‌గా ఉన్న చార్లెట్ ఎడ్వర్డ్‌తో పలు మ్యాచ్‌లలో తలపడ్డ హర్మన్.. మెంటార్ ఝులన్ గోస్వామి ఉన్న జట్టుకు సారథ్యం వహించడం విశేషం. ఇక.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత ముంబైది. గుజరాత్‌తో మ్యాచ్‌తో ఆరంభం ఇప్పుడు ఇద్దరు టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒకే ఫ్రాంఛైజీ జట్లకు సారథులుగా ఉండటం మరో విశేషం. దీంతో ముంబై ఫ్యాన్స్ సంబరాలు రెట్టింపయ్యాయి. తొలి సీజన్లో ముంబై టైటిల్ సాధించాలని అభిమానులు హర్మన్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌తో మార్చి 4న మహిళా ప్రీమియర్ లీగ్‌కు తెరలేవనుంది. ముంబై ఇండియన్స్ మహిళా జట్టు కోచింగ్ స్టాఫ్ హెడ్‌కోచ్- చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్) బౌలింగ్ కోచ్, మెంటార్- ఝులన్ గోస్వామి(ఇండియా) బ్యాటింగ్ కోచ్- దేవికా పల్షికార్(ఇండియా) ఫీల్డింగ్ కోచ్- లిడియా గ్రీన్వే(ఇంగ్లండ్) ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: Yashasvi Jaiswal: అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో..! -
‘గతంలోనూ చాలా మందికి ఇలా జరిగింది’
ఐపీఎల్లో తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంలో విఫలమయ్యామని, అయితే ఇలాంటి వైఫల్యాలు ఎవరికైనా సహజమని ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఎందరో దిగ్గజాలకు ఇలాంటి స్థితి ఎదురైందని, ఆ దశను అధిగమించి వారు ముందుకు సాగారని రోహిత్ గుర్తు చేశాడు. ఏం జరిగినా ఈ జట్టుపై తన అభిమానం తగ్గదని చెప్పిన రోహిత్... కష్టకాలంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐదు సార్లు లీగ్ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓడింది. -
టైటిల్ నిలబెట్టుకుంటాం
అబుదాబి: ఐపీఎల్లో ఈ సీజన్లోనూ దూసుకెళ్తామని, టైటిల్ నిలబెట్టుకుంటామని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ సారి కూడా ఓపెనర్‌గానే బ్యాటింగ్‌కు దిగుతానని చెప్పాడు. ఇక్కడ ఆడటం తమ వాళ్లకు కొత్త కావడంతో పరిస్థితులకు అలవాటు పడటం సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై తలపడుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... ‘గతేడాది మొత్తం నేను ఓపెనర్‌గా ఆడాను. ఇప్పుడూ అదే కొనసాగిస్తాను. ముంబైకే కాదు... టీమిండియాకు ఆడేటపుడు కూడా నేను జట్టు మేనేజ్మెంట్కు స్పష్టంగా చెబుతాను. జట్టు కోసం ఎక్కడైనా ఆడతాను. అయితే అసలు సమస్యే లేనప్పుడు దాని బాగు చేయాలని ప్రయత్నించడంలో అర్థం లేదు’ అని చెప్పాడు. ఇక్కడి పరిస్థితులతో పెను సవాళ్లు తప్పవని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ‘ముఖ్యంగా పిచ్‌ను అర్థం చేసుకుంటేనే మానసికంగా సన్నద్ధం కాగలం. బ్యాటింగ్ అయినా... బౌలింగ్ అయినా... వికెట్ అర్థమైతే అందుకు తగ్గ ప్రణాళికతో అడుగు వేయొచ్చు. గతంలో ఇక్కడి ప్రదర్శనతో ఇప్పుడైతే ఓ అంచనాకు రాలేం’ అని రోహిత్ వివరించాడు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014లో ఇక్కడ జరిగిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్లే–ఆఫ్స్‌కు వెళ్లింది. ఆసియా కప్‌లో టీమిండియాకు ఎదురైన అనుభవాలు తనకు తెలుసని, ఆట మొదలైనప్పుడు ఉండే పిచ్ ముగిసే సమయానికి ఎలా మారుతుందో ఇప్పుడు ఐపీఎల్లో కూడా అలాగే మారొచ్చని చెప్పాడు. కృనాల్ పాండ్యా, రాహుల్ చహర్, బల్వంత్రాయ్, అనుకూల్ రాయ్‌లతో కూడిన స్పిన్ విభాగంపై రోహిత్ ఆశలు పెట్టుకున్నాడు. వీళ్లందరికీ దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవాన్ని గడించారని అది ఇక్కడ అక్కరకు వస్తుందని అన్నాడు. తొలిమ్యాచ్ ప్రత్యర్థి చెన్నై సూపర్‌కింగ్స్‌పై మాట్లాడుతూ మేటి జట్ల మధ్య ఆసక్తికర సమరం జరుగుతుందన్నాడు. లంక స్పీడ్‌స్టర్, సీనియర్ బౌలర్ మలింగ లేకపోవడం తమకు లోటేనని హిట్‌మ్యాన్ చెప్పాడు. ముంబై విజయాల్లో అతని పాత్ర ఎంతో ఉందన్నాడు. మలింగ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే అయినా ఇతర పేసర్లు ప్యాటిన్సన్, ధావల్ కులకర్ణి, మొహసిన్ ఖాన్లు సత్తా చాటుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. కోచ్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ... ‘గాయం నుంచి కోలుకొని సుదీర్ఘ కాలం తర్వాత బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యాపై అనవసర ఒత్తిడి పెంచబోం, విజయవంతమైన ఫినిషర్లుగా మారెందుకు చాలా మందికి ఇప్పుడు అవకాశాలున్నాయి. క్రిస్ లిన్ రూపంలో నాణ్యమైన డాషిం గ్ ఓపెనర్ ఉన్నప్పటికీ ఈ సారి కూడా రోహిత్–డికాక్ జోడీనే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తుంది’ అని స్పష్టం చేశాడు. -
మా వాళ్లతో అదే చెప్పా: రోహిత్ శర్మ
హైదరాబాద్: ఐపీఎల్-10 టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన తమ బౌలర్లపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. తుదిపోరులో తమ టీమ్ అద్భుతంగా ఆడిందని మెచ్చుకున్నాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయని, మ్యాచ్ బాగా జరిగిందని పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఆదివారం రాత్రి ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించి రోహిత్ సేన టైటిల్ కైవసం చేసుకుంది. ‘క్రికెట్లో ఇది గొప్ప మ్యాచ్. అందరూ ఎంజాయ్ చేసివుంటారని భావిస్తున్నాను. ఈ స్కోరును కాపాడుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ నన్ను అడగలేరు. స్వల్ప స్కోరును కాపాడుకోవాలంటే ముందు మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. తక్కువ స్కోరు చేసినా తుదివరకు పోరాడాలని సహచర ఆటగాళ్లకు చెప్పాను. చివరి మూడు ఓవర్లు మిగులుండగా బౌలర్లపై నమ్మకం ఉంచాను. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. బౌలర్లు చెప్పినట్టుగానే ఫీల్డింగ్ పెట్టాను. నా నమ్మకాన్ని వారు నిలబెట్టార’ని మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ అన్నాడు.