photo credit: IPL Twitter
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో డకౌటైన హిట్‌మ్యాన్.. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 16 సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్ల జాబితాలో సునీల్ నరైన్ (15), మన్‌దీప్ సింగ్ (15), దినేశ్ కార్తీక్ (15) వరుస స్థానాల్లో ఉన్నారు.
చదవండి: ఆర్సీబీకి డీకే, రాజస్థాన్‌కు పరాగ్, సన్‌రైజర్స్‌కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
ఈ మ్యాచ్‌కు ముందు మ్యాచ్‌లో (పంజాబ్) కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగిన రోహిత్.. మరో చెత్త రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన కెప్టెన్‌గా (11) అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్.. గౌతమ్ గంభీర్‌తో సమానంగా 10 సందర్భాల్లో డకౌటైన కెప్టెన్‌గా ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్-2023లో చెన్నైతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో గ్రీన్ (6) క్లీన్ బౌల్డ్ కాగా.. దీపక్ చాహర్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ముంబై 2 వికెట్లు కోల్పోయింది. రెండో బంతికి ఇషాన్ కిషన్ (7)ను ఔట్ చేసిన చాహర్.. ఐదో బంతికి హిట్‌మ్యాన్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 59/3గా ఉంది. నేహల్ వధేరా (21), సూర్యకుమార్ యాదవ్ (22) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: DC Vs RCB: విరాట్ సెంచరీ కొట్టు.. ఆర్సీబీని గెలిపించు! అదే దాదాకు నువ్విచ్చే కానుక
Comments
Please login to add a commentAdd a comment