MUSHEERABAD police
-
వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి
సాక్షి, హైదరాబాద్: సమాజంలో మానవత్వం నానాటికీ కానరాకుండా పోతుంది. మానవ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా ఓమహిళ తొమ్మిది నెలల పేగు బంధాన్ని తెంచుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని మూడు సంవత్సరాల కొడుకొని తల్లి హతమార్చింది. ఈ దారుణ ఘటన ముషీరాబాద్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలని పార్మిగుట్టలో నివసాముంటున్న ఓ మహిళ.. నెల రోజుల క్రితం కుర్చీమీద నుంచి కిందపడి తన కుమారుడు చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముషీరాబాద్ పోలీసులుకేసు నమోదు చేశారు. అయితే తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమ విచారణలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి తల్లే హత్య చేయించినట్లు తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్ నిర్ణయం.. -
ఎంఐఎం కార్పొరేటర్‌పై కేటీఆర్ సీరియస్
హైదరాబాద్: భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, వాళ్లతో దురుసుగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ బుధవారం కోరారు. భోలక్‌పూర్ కార్పొరేటర్ ‘నెల రోజులు కనిపించొద్దంటూ..’ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది కూడా. ఈ మేరకు విషయాన్ని ట్విటర్లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2 — KTR (@KTRTRS) April 6, 2022 పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్న కేటీఆర్, తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా ఆ వ్యక్తులను వదలొద్దంటూ డీజీపీకి ఆయన సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి మంగళవారం అంతా ట్విటర్లో వైరల్ కాగా. మొహ్మద్ గౌసుద్దీన్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం! -
ఎన్ఆర్ఐపై పోలీసుల దాష్టీకం
- ప్రవాస భారతీయుడిపై దాడి - డబ్బుల కోసం డిమాండ్ - హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితుడు - విచారణకు ఆదేశం - పోలీసులపై వేటుపడే అవకాశం నాంపల్లి/ముషీరాబాద్: ప్రవాస భారతీయుడిపై ముషీరాబాద్ పోలీసులు దాష్టీకం చేశారు. విచక్షణారహితంగా కొట్టి గాయపరచడంతో బాధితుడు వాసు మల్లాపురం సోమవారం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించి జులై 16లోగా నివేదికను అందజేయాలని హక్కుల కమిషన్.. నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. బాధితుడి కథనం ప్రకారం...మహేంద్ర హిల్స్ కు చెందిన వాసు మల్లాపురం 14 ఏళ్లుగా ఐర్లాండ్‌లో ఉంటున్నారు. వేసవి సెలవులకు నగరానికి వచ్చిన ఆయన ఈనెల 25న ముషీరాబాద్‌కు చెందిన తన స్నేహితులు ప్రీతమ్, నిఖిల్‌లతో కలిసి కోఠిలో ఓ హోటల్లో మద్యం తాగాడు. ఆ తర్వాత వారిని వదిలేందుకు ముషీరాబాద్ అనూషా అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన అతను కారును పక్కన ఆపి స్నేహితులతో మాట్లాడుతుండగా అక్కడికి చేరుకున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది అర్ధరాత్రి రోడ్డుపై ఏమి చేస్తున్నారంటూ తమపై దాడి చేసినట్లు తెలిపాడు. దీనిపై ప్రశ్నించడంతో పోలీసులకే ఎదురు చెప్తారా తమను స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టినట్లు తెలిపా రు. అన ంతరం సీఐ దగ్గరకు తీసుకెళ్లగా అతను తమను దారుణంగా అవమానించడమేగాక, తమ ఫోన్లు లాక్కున్నారని, రూ. రూ.5 లక్షలు ఇస్తే వదిలి వేస్తానని, లేనిచో పాస్‌పోర్టులు సీజ్ చేస్తానని చెప్పాడన్నారు. లేని పక్షంలో పరారీలో ఉన్నాడంటూ మళ్లీ లోపల వేసి బొక్కలు ఇరగ్గొడతానని హెచ్చరించాడన్నారు. అంతేగాకుంగా తన స్నేహితుడిపై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారని వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆతను కోరాడు. ఘటనపై డీసీపీ విచారణ కాగా ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఉన్నతాధికారుల ఆదేశంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ బిట్టు మోహన్‌కుమార్, సెక్టార్ ఎస్సైలు సంపత్, భాస్కర్‌రావులను డీసీపీ కార్యాలయాలని పిలిపించారు. సమస్య హెచ్ఆర్సీ వరకు వెళ్లినా ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒక్కరిపై మాత్రమే కేసు నమోదు చేసి మిగతా ముగ్గుర్నీ ఎందుకు వదిలి పెట్టారని ప్రశ్నించిన ట్లు తెలిసింది. ఈ ఘటనకు బాధ్యులైన కానిస్టేబుళ్లు, ఎస్సైపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదేనా భద్రత హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రతకు సెక్షన్-8 అమలు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నా వద్దనుకున్నాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నా సిబ్బందిలో మార్పురావడం లేదు. తప్పు చేయని వ్యక్తులపై పోలీసులు దాడి చేయడం దారుణం. వాసు మల్లాపురంపై జరిగిన దాడి హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్థితికి అద్దంపడుతోంది. - ఎస్.చంద్రశే ఖర్ ( గ్రీన్ ఫీల్డ్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు) -
భార్యే చంపించింది
ఆస్తి కోసం ప్రియుడితో కలిసి సుపారీ హత్య ఐదుగురి అరెస్టు ముషీరాబాద్: గాంధీనగర్‌లో గత డి సెంబర్ 27న జరిగిన సుశీల్ చక్రవర్తి హత్య కేసును ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. భర్త ఆస్తిపై కన్నేసిన భార్యే ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించిందని నిర్థారించారు. ఆమెతో పాటు మరో నలుగురిని మంగళవారం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం... గాంధీనగర్‌లోని నారాయణ ఎన్‌క్లేవ్‌లో ఉండే మారిశెట్టి సుశీల్ చక్రవర్తి (41) ఒంటరిగా ఉంటున్నాడు. ఇతనికి మౌలాలి అంబిక అపార్ట్మెంట్లో ఉండే జయరాజ కుసుమకుమారితో 1996లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కాగా, 2012లో భర్త ప్రవర్తనతో విసుగు చెందానని, అతని మానసిక ప్రవర్తన సరిగా లేదని పేర్కొంటూ కుమారి భర్త దగ్గర నుంచి ఇద్దరు పిల్లలును తీసుకొని మౌలాలిలోని తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. గాంధీనగర్‌లో భర్త దగ్గర ఉన్న సమయంలోనే అదే భవనంలో కిరాయికి ఉంటున్న లంక నరేష్కుమార్ అలియాస్ బబ్లూతో(26)తో ఈమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కృష్ణపాలెంకు చెందిన నరేష్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. తల్లిగారి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా కుమారి ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. వీరిద్దరూ భర్త సుశీల్ చక్రవర్తి అడ్డు తొలగించాలని, ఆపై అతని ఆస్తి కాజేయాలని నిర్ణయించుకున్నారు. నరేష్ మాల్లాపూర్‌లో ఉండే ఓరుగంటి బాల్‌రాజ్(24), పూసల రాజు(22), షేక్ గౌష్(30)లను సంప్రదించాడు. సుశీల్‌ను హత్య చేస్తే రూ. 2 లక్షల సుపారీ ఇస్తానని ఒప్పుకున్నాడు. డిసెంబర్ 16న కుమారి, ప్రియుడు నరేష్‌తో పాటు సుపారీ మాట్లాడుకున్న ముగ్గురూ మౌలాలిలోని ఒక రూమ్‌లో కలుసుకున్నారు. కుమారి తన భర్తను ఎలా హత్య చేయాలో వారికి వివరించారు. 18న నరేష్కుమార్, పూస రాజు కలిసి సుశీల్ ఇంటికి వచ్చి రెక్కీ నిర్వహించారు. 19న మరోసారి కిరాయి హంతకుడు బాల్‌రాజ్‌ను తీసుకువచ్చి ఇంటిని చూపించారు. 20వ తేదీన నలుగురు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో స్కూడ్రైవర్, సుత్తి, ఇతర మారాణాయుధాలు కొనుక్కొని, మద్యం తాగి సుశీల్ చక్రవర్తి ఇంట్లోకి ప్రవేశించారు. అయితే, ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇద్దరు ఇంట్లోనే ఉండి, మరో ఇద్దరు బయట కాపలా ఉన్నారు. సాయంత్రం 5.30కి సుశీల్ ఇంట్లోకి రాగానే అతిదారుణంగా చంపేశారు. కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు భార్య కుమారిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించగా ప్రియుడితో కలిసి సుపారీ హత్య చేయించినట్టు ఒప్పుకుంది. దీంతో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.