MW electricity
-
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
మరో మైలురాయిని దాటిన సింగరేణి
సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పాదనలో 200 మెగావాట్ల లక్ష్యాన్ని దాటడం ద్వారా సింగరేణి సంస్థ మరో రికార్డును అందుకుంది. బుధవారం కొత్తగూడెంలో ప్రారంభించిన 37 మెగావాట్ల యూనిట్‌తో ఆ సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి 219 మెగావాట్లకు చేరింది. సింగరేణి ఆధ్వర్యంలో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 13 ప్లాంట్లను సంస్థ పరిధిలోని 8 ఏరియాల్లో నెలకొల్పాలని నిర్ణయించారు. మూడు దశల్లో ఈ పాంట్ల ఏర్పాటు కోసం పలు కాంట్రాక్టు సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పింది. మొదటిదశలో భాగంగా 129 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు ప్లాంట్లను బీహెచ్ఈఎల్ చేపట్టింది. ఆర్జీ–3లో 40, ఇల్లెందులో 39, మణుగూరులో 30, ఎనీ్టపీసీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాలు పూర్తయి ఇప్పటికే విద్యుత్ ఉత్పాదన చేస్తున్నారు. ఆర్జీ–3 ఏరియాలోని మరో 10 మెగావాట్ల ప్లాంటు వచ్చే నెలలో పూర్తి కానుంది. ఇక, రెండో దశలో భాగంగా కొత్తగూడెంలో 37, మందమర్రి ఏ బ్లాక్‌లో 28, బి బ్లాక్‌లో 15, భూపాలపల్లిలో 10 మెగావాట్ల ప్లాంట్లు కూడా ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు కొత్తగూడెం ప్లాంటు కూడా ప్రారంభం కావడంతో సింగరేణి సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 219 మెగావాట్లకు చేరింది. ఇక, మూడోదశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాట్లను అదానీ, నోవాస్‌గ్రీన్ సంస్థలకు సింగరేణి అప్పగించింది. ఇందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని జలాశయంపై నీటితో తేలియాడే 15 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను నోవాస్‌గ్రీన్ ప్రారంభించింది. ఆర్జీ–3 ఓపెన్‌కాస్ట్ డంప్‌పై 22, డోర్లీ ఓపెన్‌కాస్ట్ డంప్‌పై 10 మెగావాట్లు, కొత్తగూడెం, చెన్నూరు ఏరియాల్లో నేలపై రెండు ప్లాంట్ల (34 మెగావాట్లు)ను నిర్మిస్తున్నారు. వీటి పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసి ఉత్పాదన ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికే 122.3 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి వాస్తవానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏ ప్రభుత్వరంగ సంస్థ కూడా ఇప్పటివరకు సోలార్ విద్యుదుత్పత్తి చేయడం లేదు. థర్మల్‌తో పాటు సోలార్ విధానంలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది సింగరేణి సంస్థ మాత్రమే. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే గ్రిడ్‌కు అనుసంధానమైన సోలార్ ప్లాంట్ల ద్వారా సెప్టెంబర్ 21 నాటికి 122.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. ఈ విద్యుత్‌ను ట్రాన్స్‌కో లైన్లకు అనుసంధానం చేసి తనకు అవసరమైన మేర వినియోగించుకోవడంతో సంస్థకు రూ.75 కోట్ల మేర ఆదా అయింది. మొత్తం సంస్థ నిర్దేశించుకున్న 300 మెగావాట్ల లక్ష్యం పూర్తయితే ప్రతియేటా రూ.120 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. చదవండి: Dr Jnanesh Thacker: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు -
విద్యుత్ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ వినతి రోజుకు 1,500 మెగా వాట్ల విద్యుత్ అవసరమని వివరణ లోడ్‌షెడ్డింగ్ సమస్య పరిష్కారానికి గాను రోజుకు 1,500 మెగావాట్ల విద్యుత్‌ను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేయాల్సిందిగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు సరఫరా తదితర అంశాలపై చర్చించేందుకు గాను గురువారమిక్కడి విధానసౌధలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డి.కె.శివకుమార్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను పీయూష్‌గోయల్ దృష్టికి డి.కె.శివకుమార్ తీసుకువచ్చారు. లోడ్‌షెడ్డింగ్‌ను నివారించేందుకు గాను రోజుకు 1,500 మెగావాట్ల అదనపు విద్యుత్‌ను కేంద్ర గ్రిడ్‌నుంచి అందజేయాల్సిందిగా కోరారు. ఇదే సందర్భంలో విద్యుత్ ఉత్పాదనలో స్వావలంభన సాధించేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటకకు బొగ్గు సరఫరా సైతం పెంచాలని కేంద్రానికి విన్నవించారు. ఇక విద్యుత్ సరఫరా కోసం కొత్తలైన్లను ఏర్పాటు చేసే క్రమంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను జాతీయ స్థాయిలో కొత్త విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 24గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గాను రాష్ట్రానికి రూ.3,500కోట్లను కేటాయించాలని, సౌర విద్యుత్ పార్క్‌ల ఏర్పాటుకు రాయితీలను మరింత పెంచాలని కోరారు. వీటన్నింటిని సావధానంగా విన్న కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.