MyGov
-
ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీకు 50 వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశం అందిస్తుంది. 50 వేల రూపాయలను గెలుచుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోటీని నిర్వహిస్తుంది. దీనిలో గెలచిన వారికి మొదటి బహుమతి కింద రూ.50 వేల అందజేస్తారు. ఇందులో పాల్గొనడానికి మీరు ఎక్కడికీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుంచే ఇందులో పాల్గొనవచ్చు. ఈ పోటీలో భాగంగా మీరు వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ పథకం లోగోను తయారు చేయాలి. మీరు డిజైనింగ్‌లో నిపుణులైతే, లాక్డౌన్లో ఇది మీకు మంచి ఆదాయ వనరుగా మారుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మై గోవ్ ఇండియా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఇవ్వబడింది. ఇందుకోసం, మొదట మీరు భారత ప్రభుత్వ ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన లోగో డిజైన్ పోటీలో భాగం కావాలి. మీరు 31 మే 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో గెలిచిన మొదటి వ్యక్తికి 50 వేల రూపాయల నగదుతో పాటు ఈ-సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఇక మిగత ముగ్గురికి ఈ-సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. Put on your creative cap! Design a logo for the One Nation One Ration Card plan and stand a chance to win a cash prize of Rs.50,000. Visit: https://t.co/puosLH2Bqx today! @fooddeptgoi @UNWFP_India pic.twitter.com/RFbk0pW1ge — MyGovIndia (@mygovindia) April 29, 2021 ఈ పోటీలో పాల్గొనడానికి, మీరు మొదట myGov.in పోర్టల్‌కు వెళ్లాలి. ఇక్కడ మీరు పోటీకి వెళ్లి లాగిన్ టు పార్టిసిపేట్ టాబ్ పై క్లిక్ చేయాలి. దీని తరువాత, రిజిస్ట్రేషన్ వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ తరువాత, మీరు మీ ఎంట్రీని సమర్పించాలి. లోగో డిజైన్ పోటీలో ఏ వయసు వారు అయినా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు గరిష్టంగా మూడు ఎంట్రీలను నమోదు చేయవచ్చు. లోగో ఫార్మాట్ JPEG, BMP లేదా TIFFలో అధిక రిజల్యూషన్ (600 dpi) చిత్రంగా ఉండాలి. లోగో గురించి 100 పదాలలో సమాచారం కలిగి ఉండటం చాలా ముఖ్యం. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
కరోనా టీకా కేంద్రాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకోండిలా?
మే 1, 2021 నుంచి భారత ప్రభుత్వం 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్ టీకాలను వేయడానికి అనుమతించింది. అప్పటికే 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి టీకా వేస్తున్నారు. టీకాలు వేసుకునేందుకు ప్రజలకు సహాయపడటానికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ కంపెనీలు తమ సెర్చ్ ఇంజన్లలో టీకా కేంద్రాల గురించి సమాచారాన్ని చూపుతున్నాయి. నేడు, మరొక టెక్ కంపెనీ రేసులోకి వచ్చింది. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇప్పుడు మీ సమీపంలో ఉన్న టీకా కేంద్రాన్ని కనుగొనడానికి సహాయం చేయనుంది. ఈ సేవలను అందించడానికి, వాట్సాప్ ఇప్పటికే మెసేజింగ్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్‌ను ఉపయోగిస్తోంది. వాట్సాప్ ను ఉపయోగించి మీ సమీపంలో ఉన్న టీకాల కేంద్రాన్ని కనుగొనడానికి క్రింద ప్రక్రియలను అనుసరించండి. Find your nearest vaccination center right here, through the MyGov Corona Helpdesk Chatbot! Simply type ‘Namaste’ at 9013151515 on WhatsApp or visit https://t.co/D5cznbq8B5. Prepare, don't panic! #LargestVaccineDrive #IndiaFightsCorona pic.twitter.com/qbfFlr5G0T — MyGovIndia (@mygovindia) May 1, 2021 వాట్సాప్ తో సమీప కోవిడ్ టీకా కేంద్రాన్ని ఎలా కనుగొనాలి? మీ స్మార్ట్‌ఫోన్‌లో +919013151515 నంబర్‌ను సేవ్ చేయండి. ఇది భారత ప్రభుత్వానికి చెందిన మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు చెందినది. వాట్సాప్‌కు ఓపెన్ చేసి మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ ఖాతాను తెరవండి. వాట్సాప్‌లోని మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు “Namaste” పంపండి. ఇప్పుడు చాట్‌బాట్ కేంద్రం అందించే సేవల జాబితాను మీకు చూపుతుంది. ఈ సేవల జాబితా నుంచి ఒక ఎంపికను ఎన్నుకోమని అడుగుతుంది. మీరు “COVID టీకా - కేంద్రాలు మరియు ప్రామాణిక సమాచారం” గల మొదటి సేవను ఎంచుకోవాలి. ఇప్పుడు, “COVID టీకా - కేంద్రాలు మరియు ప్రామాణిక సమాచారం” ఎంచుకోవడానికి మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు “1” పంపండి. ఇప్పుడు మీకు మరొక జాబితాను చూపుతుంది. మొదటి సేవకు “COVID టీకా - కేంద్రాల సంబంధిత సమాచారం” అని పేరు కనబడుతుంది, దాన్ని ఎంచుకోవాలి. “COVID టీకా - కేంద్రాల సంబంధిత సమాచారం” ఎంచుకోవడానికి “1” ని మరోసారి మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు పంపండి. వాట్సాప్ చాట్‌బాట్ ఇప్పుడు మీ ప్రాంతం పిన్ కోడ్‌ను నమోదు చేయమని అడుగుతుంది. మీ పిన్ కోడ్‌ను మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్‌కు పంపండి. ఉదాహరణకు, మీ పిన్ కోడ్ 500089 అయితే, “500089” ను వాట్సాప్ చాట్‌బాట్‌కు పంపండి. మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ ఇప్పుడు మీ ప్రాంతంలో ఏదైనా ఉంటే ఆ టీకా కేంద్రాల జాబితాను మీకు చూపిస్తుంది. దానితో పాటు, వాట్సాప్‌లోని మైగోవ్ కరోనా హెల్ప్‌డెస్క్ మీరు టీకా కోసం మీరే నమోదు చేసుకునే లింక్‌ను మీకు పంపుతుంది. దీని సహాయంతో కోవిడ్-19 టీకా కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవచ్చు. చదవండి: వాటిని కొనేవారు లేక వెలవెలబోతున్న షాప్స్ -
నారీశక్తికి తిరుగులేదు!
న్యూఢిల్లీ: దేశాన్ని నడిపిస్తోంది నారీ శక్తేనని.. భారత్‌లో చోటుచేసుకుంటున్న సానుకూల మార్పుల్లో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిం చారు. మనోబలముంటే సాధించలేనిదేదీ లేదని మహిళలు నిరూపిస్తున్నారని.. వివిధ రంగాల్లో వీరి ప్రగతే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ ఏడాది తొలి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి మోదీ రేడియోలో ప్రసంగించా రు. వైదిక యుగం నుంచీ భారత మహిళలు కుటుంబం, సమాజాన్ని ఏకం చేయడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. పద్మ అవార్డుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం వల్లే సామాన్యులకు, ప్రజాసేవ చేస్తున్న వారికి గుర్తింపు దక్కిందన్నారు. నిస్వార్థంగా సేవచేస్తున్న వారున్న సమాజంలో ఉండటం మన అదృష్టమన్నారు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకుంటూ ముందుకెళ్లడమే భారత సంస్కృతి గొప్పదనమన్నారు. ముందుండి నడుపుతున్న మహిళలు ‘నారీశక్తి కుటుంబాన్ని, సమాజాన్ని ఏకం చేస్తుంది. వైదిక కాలం నుంచీ ఇది నిరూపితమైంది. మహిళలే మనకు స్ఫూర్తి. దేశానికి కొత్త వెలుగులు తెచ్చేదీ వారే’ అని గార్గి, మైత్రేయి, మీరాబాయి, అహల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి తదితరుల పేర్లను ప్రస్తావించారు. ‘ఫిబ్రవరి 1.. నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలిచిన వ్యోమగామి కల్పనా చావ్లా వర్ధంతి. ఆమె మనతో లేకపోవటం బాధాకరం. ఆమె జీవితం, సాధించిన విజయాలు ప్రపంచంలోని యువతులకు, ప్రత్యేకంగా భారతీయులకు ఆదర్శం. నారీశక్తికి పరిమితుల్లేవని కల్పనా చావ్లా నిరూపించారు. భారత మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దేశం గర్వపడేలా చేస్తున్నారు’ అని మోదీ ప్రశంసించారు. ప్రాచీన భారత సమాజంలోనూ మహిళలు సాధించిన విజయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయన్నారు. 10 మంది కుమారులతో కలిగే పుణ్యం.. ఒక కూతురితో సమానమని పేర్కొన్నారు. ఇదే భారత సమాజం మహిళలకు ఇచ్చే గౌరవమన్నారు. ఓ పౌరుడు మహిళాశక్తి గురించి ‘మైగవ్’ యాప్‌కు పంపిన లేఖను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సుఖోయ్–30 యుద్ధ విమానంలో ప్రయాణించడాన్ని ప్రస్తావిస్తూ.. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లడంతోపాటు ముందుండి నడిపిస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలన్నారు.రిపబ్లిక్‌డే ఉత్సవాల్లో మహిళా బీఎస్ఎఫ్ జవాన్లు చేసిన విన్యాసాలు స్వదేశీ, విదేశీ అతిథులను ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న మహిళలతో (ఆయా రంగాల్లో మొదటి స్థానంలో ఉన్న మహిళలతో ఇటీవలే ఈ సమావేశం జరిగింది) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమావేశమవటాన్ని మోదీ అభినందించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మా వో ప్రాబల్య ప్రాంతాల్లో ఆదివాసీ మహిళలు ఈ–రిక్షాలు నడపటాన్ని ప్రస్తావించారు. సిఫారసుల్లేవ్.. పద్మ అవార్డు విజేతల ఎంపికలో అనుసరించిన పారదర్శక విధానం వల్లే సామాన్యులకు సరైన గౌరవం దక్కిందని మోదీ పేర్కొన్నారు. పురస్కారాన్ని అందుకోనున్న వారంతా పేర్లతో కాకుండా వారు చేస్తున్న సేవల ద్వారా జాబితాలో చోటు సంపాదించారన్నారు. ‘నగరాల్లో నివసించని వారు.. రోజూ పేపర్లు, టీవీల్లో కనిపించని వారు ఈసారి పద్మ అవార్డు లు అందుకోబోతున్నారు. దీనికి కారణం ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ ద్వారా పారదర్శకత పెరగటమే. అందుకే పద్మ అవార్డుల ఎంపికలో సానుకూల మార్పు వచ్చింది’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘విజేతలను చూస్తే గర్వం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం అదృష్టం. ఇలాంటి వారు సిఫారసుల్లేకుండానే గుర్తింపు పొందటం గొప్ప విషయం’ అని చెప్పారు. అవినీతిపై ‘యువ’పోరాటం యువత సహకరించాలి: ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీలో మోదీ న్యూఢిల్లీ: అవినీతిపై అవిశ్రాంత పోరు కొనసాగిస్తున్న తమ ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని మోదీ దేశ యువతను కోరారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో అవినీతి పరులెవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు జైళ్లలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఎన్సీసీ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘అవినీతి వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ధనికులు, సమాజంలో గొప్ప పేరున్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రజలు భావించేవారు. డబ్బున్నవాళ్లను వదిలేస్తారనే భావనా ఉండేది. కానీ ఇప్పుడలా లేదు. తప్పు చేసిన ముగ్గురు మాజీ సీఎంలు జైలు కెళ్లటమే ఇందుకు ఉదాహరణ. అవినీతి చెదలను అంతం చేయడం ద్వారానే పేదలకు మేలు జరుగుతుంది’ అని ఎన్సీసీ క్యాడెట్లకు తెలిపారు. బిహార్ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా, హరియాణా మాజీ సీఎం ఓపీ చౌతాలా అవినీతి ఆరోపణలపై జైలు కెళ్లిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. లీకేజీ అరికట్టడం ద్వారానే..: భారత యువత అవినీతిని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్న మోదీ.. నల్లధనం, అవినీతిపై పోరాటం దీర్ఘకాలం జరగాలన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా అవినీతిని తగ్గించొచ్చని.. ‘భీమ్’ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడంలో ఎన్సీసీ క్యాడెట్లు, యువకులు సాయం చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న లీకేజీని అరికట్టడం ద్వారా అసలైన లబ్ధిదారులకు మేలు చేకూర్చడం తద్వారా దేశాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఉన్నతస్థాయికి ఎన్సీసీ: 2023లో 75 ఏళ్లు పూర్తిచేసుకోనున్న ఎన్సీసీని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. బాల్యంలో తను కూడా ఎన్సీసీ క్యాడెట్‌గా ఉన్నానని.. క్యాంప్‌ల ద్వారా స్ఫూర్తి పొందానని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో ఎన్సీసీ పనితీరుపై సమీక్ష జరుపుకుని ముందుకెళ్లాలన్నారు. -
'స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపండి'
న్యూఢిల్లీ: ప్రభుత్వం పారదర్శకంగా పని చేసేందుకు సామాజిక మాధ్యమాలలో మంత్రులు, ప్రభుత్వాధికారులు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలపాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ఫేస్బుక్, ట్వీటర్ వంటి మాధ్యమాల్లో అధికారులు స్వేచ్ఛగా భావాలు వ్యక్తపరిచేలా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) డ్రాఫ్ట్ రూల్స్‌ను ప్రతిపాదించిన నేపథ్యంలో జరిగిన ‘మైగవ్’ యాప్ రెండో వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పారదర్శక ప్రభుత్వంలో ప్రభుత్వాధికారులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చడంలో తప్పులేదన్నారు. ప్రభుత్వ తుది నిర్ణయాల్లో అందరూ ఒకే అంశానికి కట్టుబడి ఉండాలని, ఒకే నిర్ణయాన్ని తెలపాలని జైట్లీ అన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో ఉపయోగం ఉందని, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అనేక వైపుల నుంచి విమర్శలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు, సూచనలు వస్తుంటాయన్నారు. పంటబీమా లాంటి ప్రభుత్వ పథకాల ప్రచారానికి ఏ మాధ్యమాన్ని ప్రభుత్వం వదులుకోకూడదని, మాధ్యమాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం పొందవచ్చన్నారు. ఇటీవల జీఎస్టీ, దివాలా చట్టాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని.. ఈ నిర్ణయం వెనక ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా పాత్ర ఉందన్నారు. -
‘మైగవ్’లోకి 15 కోట్ల మంది!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మైగవ్’ ప్లాట్‌ఫాం ప్రజలకు ఎంతో చేరువవుతుందని, భవిష్యత్‌లో ఇందులో 15 కోట్ల మంది చేరే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తై సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘డిజిటల్ ఇండియాలో మైగవ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర బడ్జెట్ నుంచి నెట్ న్యూట్రాలిటీ, స్మార్ట్ సిటీస్ తదితర అన్ని అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటానికి, వారితో మమేకం అవడానికి ఇదొక ముందడుగు’ అని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇందులో 35 లక్షల మంది చేరినట్లు తెలిపారు. మన దేశంలో మొబైల్ ఫోన్ యూజర్లు 103 కోట్ల మంది ఉన్నందున ‘మై గవ్’లో 10-15 కోట్ల మంది చేరటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. సామాన్యలు సాధించిన విజయాలను ఈ పోర్టల్ ద్వారా అందరికీ తెలియజేయొచ్చని, టెక్నాలజీ సాయంతో భారత్ ముఖ చిత్రాన్ని మార్చొచ్చన్నారు. ఇదే మైగవ్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.