MyJio app
-
ఒక్క రూపాయి ప్లాన్‌పై జియో యూటర్న్! కారణం ఏంటంటే..
కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే సంచలనానికి తెర లేపింది రిలయన్స్ జియో. అయితే ఒక్క రోజులోనే ఉస్సూరుమనిపిస్తూ ఆ ఆఫర్‌ను సవరించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మంగళవారం రాత్రి దాటాక మైజియో మొబైల్ యాప్‌లో గప్‌చుప్‌గా వాల్యూ ప్లాన్ కింద ఈ ఆఫర్‌ను చేర్చింది జియో. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీతో అందించింది. అయితే 24 గంటల తర్వాత ఆ ప్లాన్ మాయమైంది. దాని ప్లేస్‌లో 1రూ. రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అదీ ఒక్కరోజూ వాలిడిటీతో సవరించింది. దీంతో చాలామంది రిలయన్స్ జియో ప్రకటన వార్తలను ఫేక్‌గా భావించారు. అయితే జియో ఈ ప్యాక్‌ను ఆఫర్ చేసిన విషయం వందకు వంద శాతం వాస్తవం. ప్యాక్ ఎందుకు సవరించారనే దానిపై రిలయన్స్ జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తోటి టెలికామ్ సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలే జియో వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ(జియో)తో సహా టారిఫ్‌లను పెంచేశాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకున్నాయి కూడా. అయితే ఏ టెలికాం సంస్థ కూడా ఇంత చీప్‌గా డేటా ప్యాక్‌ను ఆఫర్ చేయట్లేదన్న విషయాన్ని సైతం టెలికాం రెగ్యులేటరీ బాడీ ‘ట్రాయ్’ జియో మేనేజ్మెంట్ వద్ద లేవనెత్తినట్లు ట్రాయ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో జియో తన చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్‌ను సైలెంట్‌గా మార్చేసింది. అయితే ఆ సమయానికి ఎవరైతే 1రూ. 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్ చేశారో వాళ్లకు మాత్రం ప్లాన్‌ను వర్తింపజేస్తూ జియో ఊరట ఇచ్చింది. చదవండి: జియో యూజర్లకు 20 శాతం క్యాష్‌బ్యాక్! ఎలాగంటే.. -
జియో యూజర్లకు ‘బర్త్‌డే’ గిఫ్ట్
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో పుట్టిన రోజు కానుకను ప్రకటించింది. రెండో వార్షికోత్సవ సెలబ్రేషన్స్‌లో భాగంగా నెలకు 100 రూపాయలకే 42 జీబీ హైస్పీడ్ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు, జియో యాప్స్‌ను సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 21 వరకు వాలిడ్‌లో ఉండనున్నట్టు తెలిపింది. మైజియో యాప్ ద్వారా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ 84 రోజులకు అందిస్తున్న రూ.399 ప్లాన్ ద్వారా పొందాల్సి ఉంది. రూ.399 ప్లాన్‌ను రూ.100 డిస్కౌంట్‌తో కేవలం రూ.299కే అందిస్తుంది. దీంతో నెలకు ఈ రీఛార్జ్ ప్లాన్ ధర 100 రూపాయలే పడుతుంది. రూ.299తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 126 జీబీ డేటా, ఎస్ఎంఎస్ వినియోగించుకోవచ్చు. అంటే నెలకు సగటున 42 జీబీ డేటాను వస్తోంది. రూ.50ను జియో ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌గా అందిస్తుండగా.. మరో రూ.50 క్యాష్‌బ్యాక్‌ను మైజియోపై ఫోన్‌పే ద్వారా అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం తన ప్రైమ్ సబ్స్క్రైబర్లకు, ఫోన్‌పే ద్వారా రీఛార్జ్ చేసుకుంటేనే లభిస్తుంది. ఎలా ఈ ఆఫర్ పొందాలి? మొదట మైజియో యాప్‌లోకి లాగిన్ కావాలి. ‘బయ్’ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి, రూ.399 రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. పేమెంట్ మోడ్ పేజీలో, అందుబాటులో ఉన్న వాలెట్ ఆప్షన్ల జాబితా నుంచి ఫోన్‌పేను ఎంపిక చేసుకోవాలి. మీ ఫోన్‌పే అకౌంట్లోకి సైన్-ఇన్ అయి, వన్-టైమ్ పాస్‌వర్డ్‌తో ఫోన్‌పే అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలి. ‘పే బై ఫోన్‌పే’ను క్లిక్చేయాలి. -
జియో ప్రైమ్ రెన్యూవల్ ఆప్షన్ కనిపించడం లేదా?
జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ గడువు ముగిసిపోయింది. ఇప్పటికే జియో ప్రైమ్ మెంబర్లుగా ఉన్న వారికి మరో ఏడాది పాటు ఈ సర్వీసులను ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. అయితే ఈ రెన్యూవల్ ప్రక్రియ ఆటోమేటిక్‌గా యూజర్లకు క్రెడిట్ అవడం లేదు. జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను మరో ఏడాది పాటు పొడిగించుకోవడానికి యూజర్ అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మైజియో యాప్‌లో ఒక మెసేజ్ వస్తోంది. కానీ చాలా మంది యూజర్లకు ఈ మెసేజ్ రావడం లేదని తెలుస్తోంది. దీంతో యూజర్లు ఈ ఉచిత రెవెన్యూల విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ ఇబ్బందుల నుంచి బయటపడి, మరో ఏడాది పాటు ప్రైమ్ మెంబర్‌షిప్‌ను యాక్టివేట్ చేసుకునే మార్గమేమిటో ఓ సారి చూద్దాం... మీరు రూ.99 సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసిన జియో యూజర్ అయినప్పటికీ ప్రైమ్‌ను పొడిగించుకోవడానికి మెసేజ్ రాకపోతే, ముందుగా జియో యాప్‌ను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 15 నిమిషాల పాటు వీడియోలను స్ట్రీమ్ చేయాలి. ఆ తర్వాత మరోసారి జియో యాప్‌ను తిరిగి స్టార్ట్ చేయాలి. ఏ నెంబర్‌కు అయితే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొడిగించాలనుకుంటున్నారో ఆ నెంబర్‌ను వాడుతూ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో జియో యాప్‌లో బ్యానర్ పేజీలో జియో ప్రైమ్ మెంబర్షిప్ రెన్యూవల్ ఆప్షన్ కనిపిస్తోంది. ఆ ఆప్షన్‌పై యూజర్లు అప్లయ్ చేసుకోవాలి. స్టాండర్డ్ రెన్యూవల్ ప్రాసెస్‌ను యూజర్లు ఫాలో అవ్వాలి. బ్యానర్లో గెట్ నౌ అనే బటన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ బటన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత మరో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ను పొడిగిస్తున్నట్టు ఒక మెసేజ్ వస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రర్ నెంబర్లు కూడా వస్తాయి. ఆ నెంబర్లలో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొడిగించాలనుకున్న నెంబర్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో ఈ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ పూర్తైపోతోంది. -
రేపటితో 'జియో ప్రైమ్' ఆఫర్ క్లోజ్
హైదరాబాద్ : రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్ రేపటితో(మార్చి 31) ముగియనుంది. ఉచిత కాల్స్ ఉచిత డేటాతో కూడిన హ్యపీ న్యూఇయర్ ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో జియో ప్రైమ్‌కు అప్ గ్రేడ్ అవ్వాలని కంపెనీ ఇది వరకే వినియోగదారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కంపెనీకి ఉన్న 10 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లలో దాదాపు 5 కోట్ల మంది ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే వీరందరూ రూ.99లతో రీఛార్జ్ చేసుకున్నారు. ఇంకా ఒక్క రోజులోనే ఈ ఆఫర్ ముగుస్తుండటంతో జియో సిమ్ కోసం క్యూలు కట్టిన మాదిరిగా ప్రస్తుతం ప్రైమ్ రీఛార్జ్ కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద ప్రస్తుతం జియో సిమ్ కలిగి ఉన్న వారు myJio యాప్ ద్వారా రూ.99 చెల్లించి ప్రస్తుతం అనుభవిస్తున్న సేవలను మరో ఏడాది పాటు కొనసాగించుకోవచ్చు. ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న యూజర్లు తర్వాత అందుబాటులో ఉండే డేటా ఫ్యాక్స్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాయిస్ కాల్స్ ఉచితం. ప్రైమ్ యూజర్లకు నాన్ ప్రైమ్ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందుతారని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోజనాల కింద టెలికాం రంగంలో ఎన్నడూ లేనట్టుగా ప్రతి రోజూ 1జీబీ డేటాను కేవలం 10 రూపాయలకే అందించనుంది. వినియోగదారుల తమకు అనువైన రీఛార్జ్ ప్యాకేజీని ఎంచుకోవడానికి తమ మొబైల్ లోని myJio యాప్ ని కానీ, కంపెనీ వెబ్ సైట్ www.jio.com కానీ చూడవచ్చని రిలయన్స్ జియో చెప్పింది. రూ.99 అంతకంటే ఎక్కువ ప్లాన్లను జియో మనీ వ్యాలెట్, myJio యాప్, www.jio.com వెబ్సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. మార్కెట్లో అన్ని రీఛార్జ్ స్టోర్లలలో కూడా జియో ప్రైమ్ వివరాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది. -
జియో సిమ్ కావాలంటే ఇలా చేయండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో 4జీ సేవలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వాయిస్ కాలింగ్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతోపాటు అత్యంత చౌక రేట్లకు డేటా ప్లాన్లను ప్రకటించడంతో జియో సిమ్ కార్డుల కోసం వినియోగదారులు పోటీ పడుతున్నారు. ప్రివ్యూ సేవల్లో భాగంగా డిసెంబర్ 31 వరకూ జియో వాయిస్, డేటా, యాప్స్ ఇతరత్రా సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. దీంతో రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ ముందు జనం బారులు తీరి కన్పిస్తున్నారు. జియో సిమ్ కార్డు కావాలంటే ఈ డాక్యుమెంట్లు కావాలి. జియో సిమ్‌లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు, మొబైల్ ఫోన్ షాప్‌లలో లభిస్తాయి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ పట్టుకెళ్లాలి ఒకవేళ ఆధార్ కార్డు తీసుకున్న రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో దరఖాస్తు చేస్తే యాక్టివేషన్ కు ఎక్కువ సమయం పడుతుంది రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి మై జియో యాప్ నుంచి ఆఫర్ కోడ్ ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు జియో పోస్ట్ పెయిడ్ సిమ్ కావాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ బిల్లు సమర్పించాలి అయితే పోస్ట్ పెయిడ్ బిల్లు మూడు నెలలలోపుది అయ్యుండాలి. బిల్లుపై వినియోగదారుడి అడ్రస్ స్పష్టంగా కనబడేట్టు ఉండాలి