nagari mla
-
ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్: మంత్రి రోజా
సాక్షి, గుంటూరు: లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా పవన్ కల్యాణ్ దిగజారి పోతున్నాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువు ఒక్కటే ముఖ్యం కాదని.. క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు మంత్రి రోజా. క్రిీడల వల్ల ఆరోగ్యం, ఆనందం వస్తుందన్నారు. ఎన్ని కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు, ఎంత మంది నిందించినా విజయం ద్వారా సమాధానం చెప్పాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనటం ద్వారా దేశం తరుపున ఆడే గొప్ప అవకాశం లభిస్తుందని, అందుకోసం కృష్టి చేయాలని చెప్పారు. ‘నేను ఎన్నో అవమానాలు ఎదురైన వెనుదిరగకుండా ముందుకు వెళ్ళాను. ఆట ఏది అయిన మన లక్ష్యం సెక్సెస్‌పై మాత్రమే ఉండాలి. సీఎం వైఎస్ జగన్ చూసినన్ని అవమానాలు ఎవరు చూసి ఉండరు. కానీ 151 సీట్లల్లో విజయంతో అందరికి సమాధానం చెప్పారు. లక్ష్యంతో ముందుకు వెళ్తున్న వ్యక్తి జగన్ అయితే లక్ష్యం లేకుండా దిగజారి పోతున్న వ్యక్తి పవన్ కల్యాణ్. హ్యాండ్ బాల్ ఆడే 22 మంది మెరికలాంటి యువకులకు శాప్ తరుపున అన్నివిధాల శిక్షణ ఇస్తున్నాము. శాప్‌కి సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు. ’ అని తెలిపారు మంత్రి రోజా. క్రీడల్లో కష్టపడుతున్న ఆటగాళ్లకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు మంత్రి రోజా. రాబోయే సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ‘జగనన్న క్రీడా సంబరాలు’ పేరుతో రూ.50 లక్షల నగదు బహుమతితో క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర క్రీడాకారులు పట్టుదలతో నేషనల్ నుంచి ఒలింపిక్స్ వరకు వెళ్లాలని, క్రీడల్లో కష్టపడితే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి తెలిపారు. ఇదీ చదవండి: నిపుణులు ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదు: స్పీకర్ తమ్మినేని -
ఇంద్రభవనం లాంటి నటి రోజా ఇంటిని చూశారా?
MLA RK Roja Nagari Home Tour Video Goes Viral: ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే, మరోపక్క బుల్లితెర హోస్ట్‌గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఈమధ్య సినిమాలకు కాస్త విరామం ఇచ్చినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమం కోసం రోజా తన హెమ్ టూర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు యూట్యూబ్ వేదికగా తమ ఇంటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం రోజా తన హోం టూర్‌ని మాత్రం ఏకంగా టీవీలోనే విడుదల చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. నగరిలో ఇంద్ర భవనం లాంటి తన సొంతింటిని ఎమ్మెల్యే రోజా ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా అనంతరం పూజాగది, బెడ్ రూమ్, హాల్, పిల్లల రూమ్స్ సహా కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎంతో విశాలవంతమైన, ఇంద్రభవనం లాంటి రోజా ఇంటిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చదవండి: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన షణ్ముక్.. ఆమెతో కలిసి గృహప్రవేశం -
హీరోయిన్గా ఉన్నప్పుడే చెన్నైలో ఇల్లు కట్టుకున్నా: ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: తనపై అసత్య ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా గాలి భానుప్రకాష్‌పై మండిపడ్డారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో తనపై గాలి భానుప్రకాష్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని ప్రబుద్ధుడు ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిపరుడైన భానుకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు. తాను నంబర్‌వన్ హీరోయిన్గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీలోకి రాకముందు హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని ఇల్లు కట్టుకుట్టున్నట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కటీ తన సొంత డబ్బుతో కట్టిందేనన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. నీ కారణంగానే ముద్దుకృష్ణమ మృతి చెందారట! ఈయన కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని ఆయన తల్లి, తమ్ముడు అసహ్యించుకుంటున్నారని, ముందు వారి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకోవాలన్నారు. తన సొంత ఇంటిలోనే అతనికి మంచి పేరులేదని, ఇంట గెలవలేని ఈయన రచ్చ ఎలా గెలుస్తాడన్నారు. రాజీనామా వార్త అవాస్తవం తాను రాజీనామా చేస్తున్నట్లు సోషల్‌మీడియా, మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని అసత్య ప్రచారాలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారన్నారు. తానెందుకు పార్టీ నుంచి వెళతానని ప్రశ్నించారు. తప్పుచేసినవారు వెళ్లాలన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. -
‘దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు’
సాక్షి, అమరావతి: పబ్లిసిటీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారతారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ది పొందడానికే ఆయన విశాఖపట్నం వెళ్లారని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తుంటే దిక్కుతోచని చంద్రబాబు విద్వేష రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. (చంద్రబాబును అడుగుపెట్టనివ్వమంటున్న ఉత్తరాంధ్ర వాసులు) ‘వైజాగ్ వాళ్లు ఎవరూ రాజధాని కోరుకోవడం లేదన్న చంద్రబాబును ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి తలెత్తింది. భజన చానళ్లలో తను చెప్పిందే ప్రచారం చేసుకుంటూ తను చెప్పిందే వేదమన్నట్టు చెప్పుకుంటూ ఇన్నాళ్లు ముందుకెళ్లారు. కానీ ఈరోజు పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఆరోజు విశాఖకు వెళితే టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. ఎవరు అడిగారు ప్రత్యేక హోదా అని హేళన చేశారు. ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారన్న విషయాన్ని గుర్తించి ప్రత్యేకహోదాపై తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారన్న దానికి ఈరోజు ఉత్తరాంధ్రలో చంద్రబాబు తిరగలేని పరిస్థితి వచ్చింది. రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తుతున్నారు. ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించి చిచ్చు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. ఆయన జనచైతన్య యాత్ర చేసుకుంటే ఎవరూ అడ్డుపడరు. కానీ ప్రజలకు సమాధానం చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు తెలుసుకోవాలి. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారనడానికి ఇది నిదర్శనం. అమరావతిలోని 29 గ్రామాల గురించే ఆలోచిస్తున్నారు కానీ, 13 జిల్లాల అభివృద్ధి గురించి ఆయనకు పట్టడం లేదు. సొంత లాభం గురించి ఆలోచిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ప్రజలు గమనించారు కాబట్టే ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రజలే స్వచ్ఛందంగా ఆయనను తరిమికొట్టే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకుని అధికార వికేంద్రీకరణను స్వాగతించాలి. టీడీపీ బతికి ఉందని చెప్పుకోవడానికే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. గతంలోగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రజలు చైతన్యవంతులై చంద్రబాబు డ్రామాలను గమనిస్తున్నారు. కేవలం రెచ్చగొట్టడానికే ఆయన విశాఖకు వచ్చారు తప్పా మరోటి కాదు. ప్రజలకు సమాధానం చెబితేనే ఆయన ముందుకు వెళ్లగలుగుతార’ని ఎమ్మెల్యే రోజా అన్నారు. (చదవండి: పెల్లుబికిన ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..) -
మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా..
సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్తో తమ పార్టీ చర్చలు జరిపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. వైఎస్ జగన్, కేటీఆర్ చర్చలు జరిపితే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆమె ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్ ఏది చేసినా బురద చల్లమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు. ‘కేటీఆర్‌తో వైఎస్ జగన్ మాట్లాడమే తప్పు అంటున్నారు టీడీపీ నాయకులు. ఇద్దరు యంగ్ డైనమిక్ నాయకులు కలిస్తే ఎందుకు వణికిపోతున్నారు? అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చంద్రబాబు పిలవడమే కాకుండా రాయిమీద ఆయన పేరు చెక్కించారు. టీడీపీ నేతలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు.. గాడిదలు కాస్తున్నారా? కేసీఆర్ మెప్పు కోసం చంద్రబాబు 36 వంటకాలు చేయించి దగ్గరుండి వడ్డించారు. అప్పుడేమైంది మీ బుద్ధి? కేసీఆర్‌కు దేవినేని ఉమా విజయవాడలో సన్మానం చేశారు. పరిటాల సునీత కొడుకు పెళ్లిలో కేసీఆర్ మెప్పు కోసం టీడీపీ నేతలు చేసిన ప్రదక్షిణలను అందరూ చూశారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని వేషాలైనా వేస్తారు. హైదరాబాద్‌లో ఉండేందుకు పదేళ్లు గడువున్నా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని విజయవాడకు చంద్రబాబు పారిపోయి వచ్చారని అందరికీ తెలుసు. ఎంతసేపూ ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని చంద్రబాబు ఆలోచిస్తుంటారు. మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్ సింగిల్‌గానే ఎన్నికలకు వస్తారు. రాష్ట్రానికి మంచి జరిగే విషయమైతే ఎవరితోనైనా జగన్ సంప్రదింపులు జరుపుతారు. జగన్ విశ్వసనీయతపై అందరికీ నమ్మకముంది. ఏపీకి నష్టం కలిగించిన కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేద’ని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. -
గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావ్
పుత్తూరు: ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు. జత కట్టడం మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం నీ నైజం’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆరు వందల అబద్ధపు హామీలు, పచ్చ మీడియా అండదండలతో గద్దెనెక్కిన చంద్రబాబును రాష్ట్ర ప్రజానీకం నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్సీపీకి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. టీడీపీ, పవన్ అసలు విడిపోతే కదా పొత్తు గురించి మాట్లాడేందుకని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేని ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని స్పష్టం చేశారు. 40 ఏళ్లు అనుభవం ఉన్న చంద్రబాబుకు సొంతంగా పార్టీ పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి గత ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 5 లక్షలు మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమికొట్టడం ఖాయమన్నారు. పార్టీలన్నీ విడివిడిగా వచ్చినా, ఒక్కటై వచ్చినా రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వ్యాఖ్యానించారు. -
‘ఆరోగ్యశ్రీని దూరం చేస్తే ఊరుకోం’
తిరుపతి: ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్నది కపట ప్రేమేనని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరిట ఉన్న పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, ఇప్పుడు ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. పేదలకు ఆరోగ్యశ్రీని దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. -
సుప్రీం కోర్టులో రోజా పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: నగరి నుంచి తన ఎన్నికకు సంబంధించి హైకోర్టులో జరుగుతున్న విచారణపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రోజా ఎన్నికను రద్దు చేయాలంటూ రాయుడు అనే వ్యక్తి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీన్ని తిరస్కరించాలంటూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా రాయుడు దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు రోజా వేసిన పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. దీంతో రోజా హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాయుడి పిటిషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. -
నగరిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంబరాలు
చిత్తూరు : ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గమంతటా నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి... మిఠాయిలు పంచుకున్నారు. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రజాసమస్యల మీద పోరాటం కొనసాగిస్తా: రోజా
ప్రజాసమస్యల మీద తన పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, తన నియోజకవర్గ ప్రజలందరిదీనని ఆమె అన్నారు. తన హక్కుల గురించి ఆలోచించిన హైకోర్టు, తాను అసెంబ్లీకి వెళ్లేవిధంగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు కలగజేసుకుని న్యాయం చేస్తాయన్న విషయం మరోసారి రుజువైందని, న్యాయ వ్యవస్థపై తన నమ్మకం రెట్టింపు అయిందని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆమె తమ న్యాయవాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక ముందు కూడా తాను ప్రజల సమస్యల మీద గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తానని రోజా చెప్పారు. తాను 1999లో రాజకీయాల్లోకి వచ్చానని, ఆరోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఏదైనా ప్రజాసమస్యల మీద పోరాడుతూనే ఉన్నానని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కూడా పోరాటం చేస్తానని చెప్పారు. తన పోరాటం ఎప్పుడూ అంశాల వారీగానే ఉంటుందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ రాగానే అసెంబ్లీకి వెళ్తానని, జరిగిన అన్ని విషయాల మీద వివరణ ఇస్తానని ఆమె తెలిపారు. తాను తప్పు చేయనప్పుడు హాజరు కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజ్యాంగం ఉల్లంఘించినవారికి సమాధానం తనకు చాలా సంతోషంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి తగిన సమాధానం చెప్పినట్లయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. అయితే కోర్టు ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే పెద్దగా చెప్పనని, ప్రజలకు రాజ్యాంగంపై విశ్వాసం ఉందని.. అది మరోసారి నిలబడిందని ఆమె అన్నారు. సరైన వేదికపై ఎమ్మెల్యేకున్న హక్కులను న్యాయస్థానం పునరుద్ధరించిందని, పౌరుల హక్కులను రాజ్యాంగమే కాపాడగలదని చెప్పారు. రోజా ఈరోజే అసెంబ్లీకి వెళ్లచ్చని, అసెంబ్లీ కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు వెళ్తున్నాయని ఆమె తెలిపారు. -
ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఏర్పడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. రోజా తరఫున సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపంచారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, నిబంధనల ప్రకారం కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెన్షన్ విధించే అధికారం స్పీకర్‌కు ఉందని, అదికాదని ఏడాదిపాటు విధించడానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారం లేదని రోజా అన్నారు. ఈ అంశంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొలుత దాన్ని విచారించడానికి కూడా హైకోర్టులో ఆమోదం లభించలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. దాంతో హైకోర్టులో బుధవారం ఈ అంశంపై వాడివేడి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తన మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. -
ఆస్పత్రి నుంచి రోజా డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి రోజా డిశ్చార్జ్
తిరుపతి: టీడీపీ నాయకులు కుట్రపన్ని పోలీసులతో కుమ్మక్కై తనపై కేసు పెట్టారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై అక్రమంగా కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నుంచి ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేశారు. పుత్తూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేసిన రోజా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వైఎస్సార్సీపీ నేతలు హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. -
రోజాపై టీడీపీ సభ్యుల ఎదురుదాడి
చిత్తూరు: అసెంబ్లీ అయినా.. జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుదాడే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పట్ల టీడీపీ నాయకులు ఇలాగే ప్రవర్తించారు. శనివారం జరిగిన పూత్తూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్యే రోజా ప్రశ్నించగా, టీడీపీ సభ్యులు సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగారు. -
విఐపి రిపోర్టర్ - నగిరి ఎమ్మెల్యే రోజా
-
నేతన్నకు గిట్టుబాటెక్కడ?
VIPరిపోర్టర్ ఆర్.కె. రోజా,నగరి ఎమ్మెల్యే ‘పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు’ నగరి నియోజకవర్గంలో నేత కార్మికులు, చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.ఒకప్పుడు దర్జాగా బతికిన నేతన్న.. ఇప్పుడు ముడిసరుకుల ధర పెరగడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో డీలాపడిపోయాడు. పెట్టుబడిలేక.. ప్రభుత్వాలు ఆదుకోక కూలీగా మారిపోయాడు. చెరకు రైతుల పరిస్థితీ అంతే. పది మందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత పిడికెడు మెతుకుల కోసం వెంపర్లాడుతున్నాడు. ఒక పక్క వర్షాభావం.. మరో పక్క గిట్టుబాటు ధరలేక అల్లాడాల్సి వస్తోంది. వీటిని పరిష్కరించి.. తమ బతుకులు కుదురుకునేదెప్పుడోనని కుమిలిపోతున్నారు. వీరి కష్టాలు.. కన్నీళ్లు తెలుసుకునేందుకు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే.రోజా ‘సాక్షి’ తరపున విలేకరిగా మారారు. నియోజకవర్గంలోని చింతలపట్టెడ, కొత్తపేట, ఏకాంబరకుప్పం, గొల్లపల్లె, తడుకు గ్రామాల్లోని రైతులు, నేతన్నల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్కే రోజా: నమస్తే అన్నా.. నేను ఎమ్మెల్యే రోజాని. ‘సాక్షి’ తరపున విలేకరిగా వచ్చా. ఏం బాగున్నారా.. చేనేతకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? ఉదయన్ (నేతన్న): సుమారు 30 ఏళ్లుగా మగ్గం నేస్తా ఉండా. ఎవరూ మాకు చేసిందేమీ లేదు. ఉచితంగా కరెంటు ఇయ్యడం లేదు. తమిళనాడులో ఇచ్చే విధంగా రెండు నెలలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తే బాగుంటుంది. అట్లా ఇస్తేనన్నా కరెంటు బిల్లు కట్టే కష్టమన్నా తగ్గుతుంది. ప్రభుత్వం వారు పట్టించుకోవడంలేదు మేడం.. ఆర్కేరోజా: ప్రభుత్వం మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏం చేస్తే సమస్య తీరుతుంది? జగన్నాథం (నేతన్న): పెభుత్వం వాళ్లు మమ్మల్ని మరమగ్గ కార్మికులమని గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తే మేలు. తమిళనాడులాగా కుటుంబానికి ఒక కార్డు ఇయ్యాల. ఆ కార్డుల ఆధారంగా పింఛన్లు ఇయ్యాల. ఆ కార్డులు గవర్నమెంటు అధికారులే ఇంటింటికీ తెచ్చి ఇయ్యాల. గత పెభుత్వం నేత రుణాలు రద్దు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకూ రూపాయి కూడా రద్దు కాలేదు. బ్యాంకులో కొత్త అప్పులు పుట్టడంలేదు. ఏం చేసేదో అర్థం కావడం లేదు. ఆర్కే రోజా: నూలు అందడంలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా? మీ ప్రాంతంలో ఈటీపీ (రసాయ న నీటి శుద్ధీకరణ ప్లాంటు) కట్టారు కదా? అది మీకు ప్రయోజనకరమేనా? నీలమేఘం (మాస్టర్ వీవర్): వ్యవసాయదారుడు ఎంత ముఖ్యమో నేత కార్మికుడు కూడా అంతే ముఖ్యం. అయితే వ్యవసాయానికి విత్తనాలు సబ్సిడీ పై అందించే ప్రభుత్వం మాకు నూలును మాత్రం ఆ రకంగా అందించడం లేదు. ఈటీపీ ప్లాంటు కట్టడం మంచిదే. అయితే దాన్ని తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాను. డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే నీళ్ల కారణంగా నీటి కాలుష్యం అవుతోంది. ఈ నీటిని ప్లాంటులో శుభ్రపరుస్తారు కాబట్టి ఆ సమస్య తీరుతుంది. అయితే డైయింగ్ యూనిట్లకు మీటర్లు ఏర్పాటుచేసి నీటిని తెప్పించి ట్రయల్ రన్ చేస్తామని చెప్పిన అధికారులు ఆ పనులను నానుస్తున్నారు. ఆర్కేరోజా: మహిళా నేత కార్మికుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకసదుపాయాలేమైనా కల్పిస్తోందా? శారద (నేత కార్మికురాలు): అట్టాంటిదే మీ లేదమ్మా. మాకేం ప్రత్యేక సదుపాయాలులేవు. తమిళనాడులో అయితే చాలా చేస్తా ఉండారు. మా అక్క సొరకాయపేటలో ఉం ది. అక్కడ మగ్గం నడిపే ఆడోళ్లకి గర్భం వస్తే ప్రభుత్వమే నెలనెలా డబ్బు ఇస్తుంది. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఎంతకష్టమైనా భార్యాభర్తలిద్దరూ భరించాల్సిందే. ఆర్కేరోజా: పట్టువస్త్రాల తయారీలో లాభాలు ఉన్నాయా? సొంతంగా తయారు చేస్తున్నారా, కూలీకి నేసి ఇస్తున్నారా? ఆలూరు నరసింహులు, సుబ్రమణ్యం (చేనేత కార్మికులు): పట్టువస్త్రాల తయారీకి ఆర్డర్లు తగ్గాయి. ముడిసరకుల ధర పెనుభారంగా మారింది. లాభాలు అనే మాట మరిచిపోయాం. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ముడి సరకులు కొనుగోలు చెయ్యలేక అవస్థలు పడుతున్నాం. ఈ కారణంగా చీర ధర పెరుగుతోంది. అమ్మకాలు తగ్గాయి. సొంతంగా తయారుచేయలేక.. ముడిసరకులు ఇచ్చేవారికి కూలికి నేసి ఇస్తున్నాం. ఆర్కేరోజా: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేతన్నలకు పని కల్పించడానికి జనతా వస్త్రాల తయారీ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అలా పనికల్పిస్తోందా? హరిహరన్ (నేతన్న): ఎన్టీఆర్ కల్పించిన సదుపాయం ఇప్పుడు లేదు. పనిలేని సమయాల్లో నేతకార్మికులు చాలా కష్టపడుతున్నారు. నలుగురూ పనిచేసినా ఇల్లు గడవని పరిస్థితి ఉంది. తమిళనాడులో పనిలేని సమయాల్లో పనికల్పించడం కోసం ప్రభుత్వమే చీరలు, పంచెల ఆర్డర్లు ఇస్తోంది. చేనేత, మరమగ్గ కార్మికులు అనే భేదాభిప్రాయం లేకుం డా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సీఎంలుగా పనిచేసినా ఇక్కడి నేతకార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం మా దౌర్భాగ్యం. దయనీయంగా చెరకు రైతు ఆర్కేరోజా: ప్రస్తుతం చెరకు పంట సీజన్ నడుస్తోంది కదా? మీ పరిస్థితి ఎలావుంది. పాత బకాయిలను ఫ్యాక్టరీలు చెల్లించాయా? రామూర్తిరెడ్డి (చెరకు రైతు): చెరకు రైతులకు బకాయిలు ఇంకా ఇవ్వలేదు. జిల్లా వాసి చంద్రబాబు సీఎం ఉన్నారు. ఏం ప్రయోజనం.. ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు లక్షలకొద్దీ బకాయిలు నిలిచిపోయాయి. నాకు నాలుగు లక్షలదాకా రావాలి. ఇలా ఉంటే పంట సాగు ఎలా చెయ్యగలం. మేం పండించి ఇచ్చిన పంటను తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మాకు డబ్బులు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్యహత్యలు చేసుకోవాల్సిందే. ఆర్కేరోజా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఏ మేరకు అందుతోంది? 9 గంటల కోతలేని విద్యుత్ అందిస్తున్నారా? శ్రీనివాసులు రెడ్డి (రైతు): అబ్బే లేదమ్మా. రోజుకి 6 గంటలు కూడా సక్రంగా ఇవ్వడం లేదు. అది కూడా అర్ధ రాత్రి ఇస్తున్నారు. కయ్యల్లో నీరు కట్టడానికి నానా తిప్పలు పడుతున్నాం. కూలోళ్లు కూడా రావడం లేదు. దీన్ని వదిలేసి వేరే పని చేసుకుందామనుకున్నా కొత్తగా ఏ పనీ రాకపోయే. మా పరిస్థితి చెప్పుకుంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. ఆర్కేరోజా: చెరకురైతు పట్ల ప్రభుత్వ నిర్లిప్తతపై మీరేమంటారు? రవిశేఖర్‌రాజు (రైతు): గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంలు అయ్యారు. వీరిద్దరూ జిల్లా వాసులే. అయినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎలాంటి కృషీ చేయలేదు. రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోతు న్నా యాజమాన్యాలతో చర్చించలేదు. బకాయిలు అందే విధంగా ఎవ్వరూ చొరవ తీసుకోవడంలేదు. ఇది చాలా బాధకలిగిస్తోంది. మనస్సు కుంగదీస్తోం ది. ఇప్పుడు మళ్లీ క్రషింగ్ మొదలైంది. చెరకు ఏ వి ధంగా వారికి తోలాలని ఆలోచనలో పడ్డాం. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చిస్తామంటున్నారు. ఆ చర్చలేమైనా ఫలితాన్ని ఇస్తాయో లేదో.. చూడాల్సి ఉంది. లేకుంటే ధర్నాలకు దిగడం తప్ప మరోదారి లేదు. చెరకు రైతుల గోడు నగరి నియోజకవర్గంలో చెరకు రైతులెక్కువ. ఇక్కడ సుమారు 6 వేల హెక్టార్ల వరకు చెరకు పండిస్తారు. గానుగాడలేని వారు సమీపంలోని ఎస్వీ షుగర్స్, ప్రుడెన్షియల్, సాగర్ షుగర్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. కానీ ప్రభుత్వాలు చెరకు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. దీనికితోడు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏళ్లతరబడి బకాయిలు చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నేతన్నల ఆక్రందన నగరి నియోజకవర్గం నేత కార్మికులకు పెట్టింది పేరు. ఇక్కడి వస్త్రాలు దేశ విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. జిల్లాలో 25 వేల మరమగ్గాలుంటే అందులో నగరి నియోజకవర్గంలోనే 530 క్లస్టర్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై 24 వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదికి 2000 మిలియన్ మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీరికి నేతపని తప్ప మరేపనులూ తెలి యవు. మగ్గమాడితేగాని డొక్కలేవని పరిస్థితి. పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం రైతులకు అన్ని వసతులు కల్పిస్తోంది. కానీ ఇక్కడి పాలకులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. ఆర్.కె.రోజా హామీలు మీ గ్రామానికి విలేకరిగా వచ్చా. సమస్యలు అడిగి తెలుసుకున్నాను. నేతన్నలు తమిళనాడు తరహాలో తమకు ఎలాంటి సదుపాయాలూ లేవని, ఈ కారణంగా వృత్తిలో ముందడుగు వేయలేక పోతున్నామని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు తమకు బకాయిలు చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని చెరకు రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతా. రైతులకు, నేతన్నలకు అండగా ఉంటా. ప్రెజెంటేషన్: మైనంపాటి అన్నయ్య,కోనేరి చంద్రమోహన్ -
ప్రజాసమస్యలపై అధికారులను నిలదీయండి
పుత్తూరు : ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులను నిలదీయండి. మీరెవరికీ భయపడవద్దు. అండగా ఉంటాను.. న్యాయం కోసం పోరాటం చేస్తాన’ని నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. మంగళవారం ఆమె స్థానిక పీఆర్ అతిథి గృహ ఆవరణలో పుత్తూరు పట్టణ, మండల వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నా చేతిలో ఓడిన ఆయన అధికారులపై పెత్తనం చేయడం ఏమిట’ని ప్రశ్నించారు. ఆయన చేసిన అభివృద్ధిలో ఓవర్‌బ్రిడ్జి, అండర్‌బ్రిడ్జి, సమ్మర్స్టోరేజీలే అని, ఇవి కూడ కమీషన్ల కోసం నిర్మించారే తప్ప వేరేది లేదన్నారు. ప్రజావసరాలకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఇందుకు ఉదాహరణ పుత్తూరు ప్రభుత్వాస్పత్రేనన్నారు. ఇక్కడ మహిళా మెడికల్ ఆఫీసర్‌ను టీడీపీ నాయకులు అంతు చూస్తామంటూ బెదిరించడం వెనుక ఆయన(మాజీ ఎమ్మెల్యే) పాత్ర లేకపోలేదన్నారు. ఆమె సెలవు పెట్టి, ఆపై బదిలీ చేయించుకుని వెళ్లిందనే విషయాన్ని గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్నారు. అధికారులైనా మేల్కొండని, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోవడానికి ప్రొటోకాల్‌ను ఉల్లంఘించరాదని హితవు పలికారు. ఆయన అధికారులను బెదరించుకోవడం తప్ప చేసేదేమీలేదన్నారు. వైఎస్ఆర్సీపీ కమీటీల ఏర్పాటుతో పాటు ఆయా మండలాల్లో ఏ సమస్య వచ్చినా ముందుండి మాట్లాడటానికి మరో కమిటిని నియమిస్తామన్నారు. కాగా పార్టీకి సంబంధించి నియోజకవర్గ కార్యదర్శిగా రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా బాబురావుగౌడ్ పేర్లు ప్రకటించారు. సమావేశ అనంతరం ప్రజలు రోజాకు వినతిపత్రాలు సమర్పించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ముందుగా పుత్తూరుకు చెందిన నాయకులు కౌన్సిలర్ ఏలుమలై(అమ్ములు), సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రవిశేఖర్‌రాజు, డీసీసీబీ డెరైక్టర్ దిలీప్‌రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ప్రతాప్, మాజీ కౌన్సిలర్ సి.నారాయణబాబు, మాజీ సర్పంచ్ సంపత్ పలు ప్రజా సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు. -
సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి
తిరుపతి సిటీ: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికే దక్కాలని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని మహారాజపురంలో సంక్షేమపథకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు వృద్ధాప్య పింఛన్లు అర్హులకు దక్కనీయకుండా అయినవారికి కట్టబెడుతున్నారని ఆమె తెలిపారు. ఈ విషయంలో అధికారులు నాయకులతో లాలూచీపడినట్లు స్పష్టమైతే కఠినంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. విజయపురం మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీల భర్తలు అధికారులను లొంగదీసుకుని సంక్షేమ పథకాలను నచ్చినవారికి అందిస్తున్నారని తనకు ఫిర్యాదులు అందాయని వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రతి మండలంలోను ఇదే పరిస్థితి ఉన్నట్టు బాధితులు తన దృష్టికి తెచ్చారని అన్నారు. అధికారులు విధులను సక్రమంగా నిర్వహించాలని లేనిపక్షంలో ఆందోళనకైనా దిగుతామని ఆమె హెచ్చరించారు. -
అందరికి.. మంచి జరగాలని కోరుకున్నా: రోజా
తిరుమల : చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజా సోమవారం తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోజాకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఏటా కార్తీక మాసంలో తిరుమల వచ్చి వెంకన్నను దర్శించుకోవటం ఆనవాయితీ అని చెప్పారు. అందులో భాగంగానే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు రోజా తెలిపారు. -
కౌన్సిలర్‌పై దాడిని అడ్డుకున్న రోజా
చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని టీడీపీకి చెందిన పట్టణ కౌన్సిలర్లు ఉన్నతాధికారులను పట్టుబడ్టారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. దాంతో ఇరు పార్టీల కౌన్సిలర్ల మధ్య నెలకొన్న గోడవ తీవ్రస్థాయికి చేరింది. ఆ క్రమంలో ఇటీవల టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కౌన్సిలర్ హరిహరన్పై దాడి చేసేందుకు టీడీపీ కౌన్సిలర్లు యత్నించారు. ఆ సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే రోజా అడ్డుకున్నారు. దాంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇరుపార్టీల మధ్య వాగ్వివాదాలతో సమావేశం అర్థాంతరంగా సమావేశం ఆగిపోయింది. ఆగ్రహాం చెందిన టీడీపీ కౌన్సిలర్లు కార్యాలయం వెలుపల నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నుంచి ఎమ్మెల్యేను బయటకు రాకుండా కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యే రోజాను అక్కడి నుంచి పంపివేశారు.