
ఆర్కే రోజా(ఫైల్ ఫోటో)
తిరుపతి: టీడీపీ నాయకులు కుట్రపన్ని పోలీసులతో కుమ్మక్కై తనపై కేసు పెట్టారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై అక్రమంగా కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నుంచి ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేశారు.
పుత్తూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేసిన రోజా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు.