నూతన ఫారెస్ట్రేంజ్గా ‘నాగిరెడ్డిపేట్’
నాగిరెడ్డిపేట్ : జిల్లాల పునర్విభజన పక్రియలో భాగంగా నూతనంగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్ను ఫారెస్ట్ రేంజ్‌గా ఏర్పాటు చేయనున్నట్లు కామారెడ్డి డీఎఫ్‌వో జోజి తెలిపారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేట్‌లో కొన్నేళ్లుగా వృథాగా మారిన అటవీశాఖ కార్యాలయ భవనాన్ని, స్థలాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అటవీశాఖ స్థలంలో పెరిగిన చెట్లను వెంటనే తొలగింపజేయాలని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రాధాకృష్ణను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అటవీశాఖలో నాగిరెడ్డిపేటలో ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ క్రమంలో తమ శాఖకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. కాగా నూతనంగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట్తో పాటు ఎల్లారెడ్డి, కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్‌లు ఉండనున్నాయని ఆయన చెప్పారు. ఇది వరకు ఉన్న గాంధారి రేంజ్ బాన్సువాడ డివిజన్‌లోకి మారబోతుందన్నారు. అంతకు ముందు నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం, బంజెర తండాల్లో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్లలో మొక్కలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎల్లారెడ్డి, ఎఫ్ఆర్వోతో పాటు డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేశ్ ఉన్నారు.