nagula chavithi festival
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే..
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. మనం కూడా పాములమే..హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజాలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని. ఈ రోజు(నవండర్ 5 ) చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.నాగుల విశిష్టత..కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. నాగుల ప్రాణాలను రక్షించిన ఆస్తికుడుపాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుడుని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాలనాటిది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
Nagula Chavithi 2023 Photos: తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో నాగుల చవితి పూజలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు (ఫొటోలు)
-
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..? కారణం ఇదే..
Nagula Chavithi 2022: కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలుగు రాష్ట్రాల్లో లో ఘనంగా నాగుల చవితి
-
ఘనంగా నాగుల చవితి వేడుకలు
-
నాగదేవతా.. పాహిమాం..!
పిఠాపురం:కార్తిక శుద్ధ చవితి నాడు నాగులచవితి పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం హిందూవుల ఆనవాయితీ. ఈ రోజున పాము పుట్టల వద్ద పూజలు చేసి, పాలు పోసి నాగదేవత కరుణ కోసం వేడుకుంటారు. ఈ వేడుకలో పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ సకుటుంబంగా పాల్గొంటారు. పొలాల్లోని పాము పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేస్తారు. సోమవారం నాగులచవితి పర్వదినం కావడంతో పుట్టల్లో పాలు పోసేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. ఇదీ సంప్రదాయం చవితి రోజున ఉదయాన్నే పుణ్యస్నానాలు చేసి పొలాల్లోని పాముల పుట్టల వద్దకు వెళతారు. ముగ్గులు పెట్టి ఆవుపాలు, కోడిగుడ్లు, బుర్రగుంజు, చిమ్మిలి, చలివిడి, వరినూక పుట్టలో వేసి నాగదేవతకు పూజలు చేస్తారు. చిన్నాపెద్దా కొత్త దుస్తులు ధరించి బాణసంచా కాలుస్తారు. సంతానలబ్ధి, క్షేమం, వివాహప్రాప్తి కోరుతూ మొక్కుకుంటారు. పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కుటుంబ సమేతంగా మధ్యాహ్నం వరకు పుట్టల వద్ద గడిపే రైతులు పంటలు బాగుండాలని, పొలాల్లో తిరిగేటప్పుడు తమకు హాని తలపెట్టవద్దని నాగేంద్రుడిని వేడుకుంటారు. ఇదే మాసంలో 15 రోజుల తర్వాత వచ్చే కార్తిక బహుళ చవితి రోజు కూడా కొందరు ఇదే సంప్రదాయం పాటిస్తారని, దీనిని పౌర్ణమి చవితిగా పిలుస్తారని పురోహితులు తెలిపారు. శివుడికి ప్రీతికరమైన మాసం కార్తికంలో శివుడి కంఠాభరణం సర్పాన్ని పూజించడం శుభదాయకమని పేర్కొన్నారు. నాగులచవితి రోజు చేసే పూజలు రాహు, కుజ దోషాలను తొలగిస్తాయని అంటారు. చెవిటి వారు పుట్టమట్టిని చెవికి ధరిస్తే వినికిడి లోపం పోతుందని నమ్ముతారు.