naimisha engagement
-
ఏసీబీ కనుసన్నల్లో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
* ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రుల హాజరు * మీడియాకు అనుమతి నిరాకరణ * బెయిల్ గడువు ముగిసిన అనంతరం జైలుకు రేవంత్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు గురువారం 12 గంటలపాటు బెయిల్‌పై బయటకు వచ్చి తన కుమార్తె నైమిషరెడ్డి నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమం ఏసీబీ అధికారులు, పోలీసుల కనుసన్నల్లోనే జరిగింది. మీడియాను కార్యక్రమానికి హాజరు కానీయలేదు. కేవలం కెమెరాలను మాత్రమే కాసేపు అనుమతించి బయటకు పంపారు. ఉదయం 6 గంటలకు చర్లపల్లి జైలు నుంచి బయటకు వచ్చిన రేవంత్... పోలీస్ ఎస్కార్ట్ అనుసరించగా పార్టీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం 8 గంటలకు భార్య గీత, కుమార్తెతో కలసి నిశ్చితార్థ వేదికకు చేరుకొని 10 గంటల వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నిశ్చితార్థానికి హాజరైన అతిథులను పలకరిస్తూ గడిపారు. నిశ్చితార్థానికి హాజరైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు, లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ.. రేవంత్‌రెడ్డి దంపతులు, నిశ్చితార్థం జరుగుతున్న నైమిష, సత్యనారాయణరెడ్డిలతో ఆత్మీయంగా గడిపారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేక్, గాంధీ, సండ్ర వెంకట వీరయ్య, బి.కె. పార్థసారథి, కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, దానం నాగేందర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సినీనటి కవిత తదితరులు హాజరై రేవంత్ కుమార్తెను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేసిన రేవంత్... 3 గంటలకు తిరిగి నివాసానికి చేరుకున్నారు. గంటసేపు కుటుంబ సభ్యులతో గడిపిన రేవంత్‌రెడ్డి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బెయిల్ గడువు ఉండటంతో ఆలోపే తిరిగి చర్లపల్లి జైలుకు వెళ్లారు. -
రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
-
'బాస్' పక్కన రేవంత్
హైదరాబాద్ : ఎట్టకేలకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి 'బాస్' పక్కన కూర్చున్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టయి తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డి తొలిసారిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. తన కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన చంద్రబాబు పక్కన రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అయితే వాళ్లిద్దరూ చిరునవ్వు నవ్వడమే తప్ప...పలకరించుకోలేదు. కాగా రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు ఈ సందర్భంగా ఆయనకు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బెయిల్ మీద బయట ఉన్న సమయంలో మీడియాతోనూ, రాజకీయ నాయకులతోనూ రేవంత్ కలవకూడదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని, దర్యాప్తుకు ఆటంకం కలిగించరాదని సూచించింది. విచారణకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయరాదని స్పష్టం చేసింది. దాంతో కోర్టు నిబంధనల ప్రకారం రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి వచ్చిన అతిథులను పలకరించలేకపోయారు. మరోవైపు సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు నిఘా కొనసాగింది. రేవంత్ కదలికలపై వారు దృష్టి పెట్టారు. బెయిల్ మంజూరు చేస్తాం, కానీ రేవంత్ కదలికలపై నిఘాకు అనుమతించాలన్న ఏసీబీ విజ్ఞప్తిని కోర్టు ఆమోదించిన విషయం తెలిసందే. -
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుమార్తె నైమిశ నిశ్చితార్థం గురువారం నిఘా నీడలో జరిగింది. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేవంత్ ఏకైక కూతురు నైమిశరెడ్డి నిశ్చితార్థం సత్యనారాయణరెడ్డితో జరిగింది. భీమవరానికి చెందిన వెంకట్‌రెడ్డి, లక్ష్మీపార్వతి కుమారుడు సత్యనారాయణ ఫారెన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. రేవంత్ కూతురు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, లోకేష్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలు, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తదితరులు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. మరోవైపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం చర్లపల్లి జైలు నుంచి రేవంత్ నేరుగా ఇంటికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి భార్య, కుమార్తెతో కలిసి... నేరుగా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మొత్తం నిఘా నీడలోకి వెళ్లింది. సివిల్ డ్రెస్‌లో ఏసీబీ అధికారులు రేవంత్‌ను పరిశీలించారు. బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు నిశ్చితార్థం వేడుకలో నేతలెవరితోనూ మాట్లాడవద్దని రేవంత్ ని ఆదేశించిన విషయం తెలిసిందే. -
నిఘా నీడలో రేవంత్ కుమార్తె నిశ్చితార్థం