NALLAPAREDDY prasannakumarreddy
-
రౌడీని స్పీకర్‌ను చేసిన ఘనత చంద్రబాబుది
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : మాజీ సీఎం చంద్రబాబుది రౌడీ రాజకీయమని, ఓటమిని జీర్ణించుకోలేక టెర్రరిస్ట్‌గా మారారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబుతో కలిసి బుచ్చిరెడ్డిపాళెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడి పాలనలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాద్, చింతమనేని ప్రభాకర్, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి యథేచ్ఛగా భూదందాలు, రౌడీయిజం సాగించారని ఆరోపించారు. తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేయడంపై రాష్ట్రమంతా నిరసన తెలిపినా చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోడెల శివప్రసాద్ వంటి రౌడీని శాసనసభకు స్పీకర్‌గా పెట్టిన ఘనత చంద్రబాబుదన్నారు. శాసనసభ ఫర్నిచర్‌ను దొంగిలించి తన ఇంట్లో పెట్టుకున్న ఘనుడు కోడెల శివప్రసాద్ అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వందరోజుల పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం జీర్ణించుకోలేక శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు అన్ని జిల్లాల్లో వివాదాలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో గందరగోళం సృష్టించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. కులాల మధ్య చిచ్చురేపుతూ ఐదేళ్ల పాటు రౌడీయిజం చెలాయించాడన్నారు. టీడీపీ పాలనలో నరకయాతన అనుభవించిన ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన సాగిస్తున్నాడన్నారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పారదర్శకపాలన అందిస్తున్నాడన్నారు. వందరోజుల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారన్నారు. వలంటీర్ వ్యవస్థ మొదలు సచివాలయ ఉద్యోగాల వరకు ఎందరికో ఉపాధి కల్పించారన్నారు. అటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు నీకెక్కడిది చంద్రబాబూ అంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు. రూ.68.81 లక్షలతోకాలువల అభివృద్ధి పనులు బుచ్చిరెడ్డిపాళెంలో కాలువల అభివృద్ధి పనులకు కలెక్టర్ రూ.68.81లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే రూ.50లక్షలు విడుదల చేశారని చెప్పారు. మొత్తం రూ.1.20కోట్లతో కాలువ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. గుడపల్లి కాలువ వద్ద కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు రూ.68.81లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం దళితవాడలో రూ.11.20లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం, రూ.14.50లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, రూ.53లక్షలతో నిర్మించిన ఐసీడీఎస్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జునరావు, ఎంపీడీఓ నరసింహారావు, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసులురెడ్డి, ఇరిగేషన్ డీఈ మధు, ఏఈ వినయ్, ఎంఈఓ దిలీప్‌కుమార్, సీఐ సురేష్‌బాబు, ఎస్సై బలరాంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు ఇప్పగుంట విజయ్‌భాస్కర్ రెడ్డి, నాయకులు చీమల రమేష్‌బాబు, కలువ బాలశంకర్ రెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, టంగుటూరు మల్లికార్జున్‌రెడ్డి, తిరువాయిపాటి నందకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఒక నాయకుడు పోతే వంద మంది వస్తారు
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వాకాడు : పార్టీ నుంచి ఒక నాయకుడు పోతే వందమంది నాయకులు పుడతారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. వాకాడులోని పార్టీ సీజీసీ సభ్యులు డాక్టర్ నేదుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం వాకాడు, చిట్టమూరు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రసన్న సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గూడురు ఎమ్మెల్యే సునీల్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లడం దారుణమన్నారు. ఎమ్మెల్యే వెళ్లినంత మాత్రన పాపారెడ్డిజ్‌కుమార్‌రెడ్డి పార్టీని వీడటం సరికాదన్నారు. నాయకులు పార్టీ వీడినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. కార్యకర్తలకు, నాయకులకు తమ పార్టీలో కొదవలేదన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్ట్టి టీడీపీలో చేర్చుకున్నా జగన్‌న్ను ఏం చేయలేరన్నారు. అధికార పార్టీని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదన్నారు. త్వరలోనే నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. వారం రోజుల్లో బయటపెడతా చిల్లకూరు మండలంలో పార్టీని వీడి టీడీపీలో చేరిన ఓ నాయకుడు 590 ఎకరాలు ఆక్రమించి సిలికా వ్యాపారం చేస్తూ అక్రమంగా కోట్లు గడిస్తున్నారన్నారు. వారం రోజుల్లో పూర్తి ఆధారాలతో ఆ నాయకుడు బండారం బయటపెడతామన్నారు. సీఎం చంద్రబాబుకు నిజయితీ ఉంటే ప్రభుత్వ భూముల్లో అక్రమంగా సిలికా వ్యాపారం చేస్తున్న ఆ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. వైఎస్ జగన్ మహాశక్తి ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కె.నందగోపాల్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి పోకల దుష్యంతయ్య శెట్టి, జిల్లా అధికార ప్రతినిధి చలపతిరావు పాల్గొన్నారు. విజయసాయిరెడ్డికి సముచితస్థానం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంపికచేయడం సముచితమని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. మాట మీద నిలబడతారు, నమ్ముకున్న వారికి ద్రోహం చేయరనేందుకు నిదర్శనం ఒక్క వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబమేనన్నారు. పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినందుకు జగన్మోహన్రెడ్డికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నాయన్నారు. -
చంద్రబాబు దళిత ద్రోహి
► ఉచితంగా భూములిస్తామని దళితులు, గిరిజనులకు మొండిచేయి ► వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కొడవలూరు: సీఎం చంద్రబాబు నాయుడు దళిత ద్రోహని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం జరిగిన పార్టీ గ్రామ కమిటీ సమావేశంలో మాట్లాడారు. భూమి లేని షెడ్యూల్ కులాల వారికి భూమి కొనుగోలు పథకం ద్వారాభూములు ఇస్తానని ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పారని, ఎన్నికల్లో గట్టెక్కాక ఆ భూమి ధర రూ.5 లక్షలకు మించకూడదని కొర్రీ పెట్టారన్నారు. ప్రస్తుతం భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, రూ.ఐదు లక్షలకు ఎకరా భూమి ఎక్కడా రాదన్నారు. డబ్బుతో ముడిపెట్టకుండా భూమిలేని దళితులకు కొనుగోలు చేసి ఎకరా వంతున ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువత పరిశ్రమలు పెట్టుకునేందుకు రూ.5 కోట్ల వడ్డీ లేని రుణమిస్తానన్న బాబు ఈ రెండేళ్లలో ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాధారణంగా మంజూరు చేసే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ దళిత యువకులు కార్పొరేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. ఇది దళిత యువతను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.38 వేల మందికి రూ.171 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా, ఈ ఫిబ్రవరి 17 నాటికి కేవలం 2,717 మందికి రూ.16 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 2,400 మందికి రూ.12 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 360 మందికి రూ.2.72 కోట్లు ఇచ్చారన్నారు. గిరిజనులకూ ద్రోహం: గిరిజనులకు సైతం ద్రోహం చేశారన్నారు. భూమిలేని గిరిజన కుటుంబాలకు ట్రైకార్ సంస్థ రెండెకరాల భూమిని కొనుగోలు చేయించి ఇస్తానని చెప్పారని, ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. గిరిజన యువతులకు వివాహం కుదిరితే రూ.50 వేలు ఇస్తానని చెప్పిన హామీ అమలు కాలేదన్నారు. ప్రతి జిల్లాలో గిరిజన భవన్, గిరిజన యువతకు రూ.5 లక్షల పూచీకత్తు లేని రుణం, రాష్ట్రంలో ప్రత్యేక గిరిజన యూనివర్శిటీ, గిరిజన పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య, ఆలయాల పూజారులకు రూ.5 వేల గౌరవ వేతనం హామీలు గాల్లో కలిసాయన్నారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లక్షా 41 వేల మందికి రూ.206 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2,670 మందికి రూ.24 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, జిల్లా కార్యదర్శి నాపా వెంకటేశ్వర్లునాయుడు, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, సర్పంచ్ నాగిరెడ్డి రమేష్ పాల్గొన్నారు. -
'చినబాబు, పెదబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు'
నెల్లూరు: విద్యుత్ ప్లాంట్ల కోసం కృషి చేసిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ను టీడీపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సూచించారు. చినబాబు నారా లోకేష్.. పెదబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో పచ్చ చొక్కాల వారికే సంక్షేమ పథకాలు అందుతాయని మాజీ మంత్రి ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్తే సంతలో పశువుల్లా బేరమాడుతున్నారని కేసీఆర్‌ను దుమ్మెత్తిపోసిన సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఏపీలో చేసిన దానికి ఏమి సమాధానం చెప్తారని ఇటీవల సూటిగా ప్రశ్నవేస్తే సీఎం వద్ద సమాధానమే లేకపోయింది. -
జగన్ దీక్షకు తరలిరండి
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 3, 4వ తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టనున్న నిరాహారదీక్షకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవర్చేకపోగా, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ వ స్తోందన్నారు. విచ్చలవిడిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగ భృతి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి ప్రధాన విషయాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు శ్రీకారం చుట్టడం హేయమైన చర్యన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. దీక్షకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, మండల , గ్రామ స్థాయిల్లోని పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తరలిరావాలని కోరారు.