Nanayya
-
విజ్ఞాన సర్వస్వం.. మహాభారతం
నన్నయ భట్టారక జయంతి సభలో వక్తలు రాజమహేంద్రవరం కల్చరల్ : మహాభారతం విజ్ఞాన సరస్వస్వమని ప్రముఖ సాహితీవేత్త, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు అన్నారు. సాహితీ శరత్ కౌముది ఉత్సవాల్లో భాగంగా మహాకవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి స్థాపించిన శరన్మండలి ఆధ్వర్యాన.. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన నన్నయ భట్టారక జయంతి సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆయన నన్నయ కవిత్వంపై ప్రసంగించారు. ‘‘కాంతాసమ్మితంగా భారత రచన సాగింది, భార్య.. భర్తకు నచ్చజెప్పినట్టుగా అటు వ్యాసుడు, ఇటు కవిత్రయం మనకు భారతాన్ని అందించారు. భారతం నీతిశాస్త్రం, మహాకావ్యం, ఇతిహాసం, బహుపురాణ సముచ్ఛయం, ధర్మశాస్త్రం. ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి ఆ దృష్టిలోనే గోచరిస్తుంది. మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులేనిది మరెక్కడా ఉండదు’’ అని అన్నారు. దీని ఆంధ్రీకరణలో మానవజాతికి నన్నయ అద్భుతమైన నీతులు అందించాడని చెప్పారు. ‘‘మనం చేసే పనులను ఎవరూ చూడట్లేదని అనుకోవద్దు. మనం చేసే ప్రతి పనినీ సూర్యచంద్రులు, పంచభూతాలు, యముడు, ఉభయ సంధ్యలు, మనస్సు, ధర్మదేవతలు గమనిస్తూనే ఉంటారని శకుంతల పాత్ర ద్వారా నన్నయ తెలియచేసాడు’’ అన్నారు. జన్మనిచ్చినవాడు, అన్నం పెట్టినవాడు, భయాన్ని తొలగించేవాడు స్త్రీకి గురువులైతే, వీరితోపాటు విద్య నేర్పినవాడు, ఉపనయనం చేసినవాడు పురుషుడికి గురువులని వివరించారు. ‘జగద్ధితంబుగ¯ŒS’ భారతాంధ్రీకరణ చేసినట్టు నన్నయ చెప్పుకున్నాడని, దీని అర్థం జగత్తు హితం కోసమే ఈ రచన చేసినట్టని అన్నారు. ‘శారద రాత్రులు..’ నన్నయ చివరి పద్యంగా భావించాలని రాఘవేంద్రరావు చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు మాట్లాడుతూ, భారతాంధ్రీకరణను రాజరాజుకు నన్నయ అంకితమిచ్చినట్టు ఆంధ్రభారతంలో ఎక్కడా లేదన్నారు. చిలకమర్తి ఫౌండేష¯ŒS వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ మాట్లాడుతూ, రుషులు ద్రష్టలు, స్రష్టలు అని చెప్పారు. భవిష్యత్తును చూడగలిగినవాడు ద్రష్ట అయితే, కలకాలం నిలిచిపోయే పాత్రలను సృష్టించినవాడు స్రష్ట అని వివరించారు. తొలుత కళాశాల ప్రాంగణంలోని ప్రకాశం, నన్నయ భట్టారకుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి తనయులు మధునామూర్తి, సుబ్రహ్మణ్యం, మేనల్లుడు కామరాజు, సోదరుని కుమారుడు సత్యనారాయణమూర్తి, ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ, కళాశాల కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్, డాక్టర్ బీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పద్యం జాషువాకు మాతృభాష
సంస్మరణ సభలో ప్రముఖుల నివాళులు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘మనిషి జీవించిన కాలంకన్నా, మరణించిన తరువాత జీవించిన కాలం ఎక్కువ ఉండాలి. జాషువా ఈ కోవకు చెందిన కవి’’ అని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తలారి వాసు అన్నారు. భారతీయ సాహిత్య పరిషత్, నగర శాఖ ఆధ్వర్యాన ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో వేమూరి విశ్వనాథం జయంతి సందర్భంగా గురువారం జరిగిన జాషువా సంస్మరణ సభలో వాసు ప్రసంగించారు. ‘రాజు జీవించు రాతి విగ్రహములందు – సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అని జాషువా అన్నారని గుర్తు చేశారు. ‘‘పద్యం జాషువాకు మాతృభాష. కష్టాలు, కన్నీళ్ళు ఆయనకు కళ్లజోడు’’ అని అన్నారు. ‘‘గాడుపు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని జాషువా అన్నారన్నారు. ‘‘కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి, పంజరాన కట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగు లేదు, విశ్వనరుడ నేను’’ అంటూ కవికి కులం ఉండదన్న విషయాన్ని జాషువా చెప్పారని వివరించారు. జాషువా రచించిన ‘గబ్బిలం’ ఆంధ్రుల చరిత్రేనని వాసు అన్నారు. శతావధానధురీణ డాక్టర్ అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు ప్రసంగిస్తూ, జాషువా కవిత్వం కరుణ రసాత్మకమైనదని అన్నారు. ధనవంతుడిని, అందగాడిని కాదని, నీతివంతుడిని, గుణవంతుడిని జాషువా కథానాయకుడిని చేశారన్నారు. తొలుత జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. çసభకు చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాథ్ అధ్యక్షత వహించారు. ప్రధాన వక్త తలారి వాసును నిర్వాహకులు సత్కరించారు. ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు, కరస్పాండెంట్ అసదుల్లా అహమ్మద్ పాల్గొన్నారు. అలరించిన ఛలోక్తులు తలారి వాసు తన ప్రసంగం ఆద్యంతం ఛలోక్తులతో విద్యార్థులను ఆకట్టుకున్నారు. ‘క’ష్టజీ‘వి’కి అటు ఇటు ‘కవి’.. ‘క’నిపిస్తే, ‘వి’సిగించేవాడు ‘కవి’.. వర్షంలో తాను సభకు రావడాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ ప్రపంచంలో మన మెడలు వంచగలవాడు ఆటోవాడు ఒక్కడే’ అని చమత్కరించారు. ‘‘బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆటోను ఆపాడు, బిలబిలా 24 మంది ప్రయాణికులు దిగారు’’ అంటూ మరో చమత్కార బాణం వదిలారు. -
నాణయ్య రాజీనామా!
బెంగళూరు : అత్యాచారాల నిరోధానికి అవసరమైన సలహాలు, సూచనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ‘అత్యాచార నిరోధక కమిటీ’కి అధ్యక్షుడైన ఎం.సి.నాణయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన లేఖను ఆయన ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్‌కు పంపారు. రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా అందులో విన్నవించారు. -
కాస్త టైమివ్వండి
అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం చేపట్టాల్సిన విధివిధానాలపై నివేదిక ఇచ్చేందుకు సమయం కోరిన కమిటీ న్యాయవాదులు, విశ్రాంత పోలీస్ అధికారులతో చర్చలు పూర్తి వివరాలు వెల్లడించిన కమిటీ అధ్యక్షుడు నాణయ్య బెంగళూరు : రాష్ట్రంలో అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వం చేపట్టాల్సిన విధివిధానాలపై సూచలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదిక ఇవ్వడానికి మరో మూడు నెలల సమయం కోరింది. ఈ మేరకు అత్యాచార నిరోధక కమిటీ అధ్యక్షుడు నాణయ్య తెలిపారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. కమిటీ ఇప్పటి వరకూ న్యాయవాదులు, విశ్రాంత పోలీసు అధికారులతో సహా వివిధ వర్గాలకు చెందిన ఎంతోమంది నిపుణులతో ప్రత్యేకంగా భేటీ అయ్యిందన్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుని నివేదిక తయారుచేస్తున్నట్లు చెప్పారు. నిర్భయ ఘటనకు సంబంధించి బీబీసీ చానల్ డాక్యుమెంటరీ తయారు చేసి ప్రసారం చేయడం వెనుక సదుద్దేశ్యం ఏదీ లేదన్నారు. ‘ఇంగ్లాండ్‌లో రోజుకు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నా బీబీసీ చానల్ అక్కడ డాక్యుమెంటరీను ఎందుకు రూపొందించడం లేదు’ అని ప్రశ్నించారు. దేశంలో మూడు కోట్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ సందర్భంగా నాణయ్య గుర్తు చేశారు. సాక్ష్యాలు లేకుండా ఈ కేసుల్లో వాదోపవాదాలు జరపడం కాని, తీర్పును ఇవ్వడం కాని ప్రస్తుత భారత దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను అనుసరించి జరగదన్నారు. అయితే జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఆత్మసాక్షిగా కొన్ని కేసుల్లో తీర్పు చెబుతున్నారని, అలాంటి పరిస్థితి మనదేశంలో రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.