Nandinagar
-
కేటీఆర్ ఇంటివద్ద అర్ధరాత్రి హై టెన్షన్
-
సొంతింటికి వెళ్లి వచ్చిన సీఎం కేసీఆర్
బంజారాహిల్స్ (హైదరాబాద్): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి శోభతో కలిసి సోమవారం బంజారాహిల్స్ రోడ్ నెం.14 నందినగర్‌లోని తన సొంత ఇంటికి వచ్చారు. కొంత కాలంగా ఈ ఇంటిలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించేందుకు వచ్చారు. పావుగంట పాటు సీఎం కేసీఆర్ పనులను చూసి పలుచోట్ల మార్పులు, చేర్పులు సూచించారు. ఇదిలా ఉండగా ఆయన మనవడు హిమాన్షు ఉదయం ఈ ఇంటికి వచ్చి గంటపాటు ఉండి వెళ్లారు. -
స్వగృహంలో కేసీఆర్ పెళ్లిరోజు వేడుక
హైదరాబాద్: తమ పెళ్లి రోజును పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గురువారం బంజారాహిల్స్ నందినగర్‌లోని తమ స్వగృహానికి వచ్చారు. ఉదయం 12 గంటలకు కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి ఇక్కడికి వచ్చి సాయంత్రం వరకు గడిపారు. ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు విచ్చేశారు. పెళ్లి రోజు విందు భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. తన బంధుమిత్రులతో కేసీఆర్ ఈ వేడుకలను జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తన స్వగృహానికి రావడంతో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.