nandyala hospital
-
కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ధీటుగా.. నంద్యాల సర్వజన ప్రభుత్వాసుపత్రి (ఫొటోలు)
-
ఒకేసారి రెండు పాములు.. విద్యార్థినిని కాటేసి..
నంద్యాల (నందవరం): ఒకేసారి రెండు పాములు కాటేసి ఓ విద్యార్ధిని ప్రాణాలు తీశాయి. నందవరం మండలం నదికైరవాడి గ్రామం యానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చాకలి నాగరాజు, నరసమ్మ దంపతుల మూడవ కుమార్తె మల్లేశ్వరి (15)మంత్రాలయంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుంది. గత మంగళవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి రేకుల కొట్టంలో పడుకుంది. సుమారు 11 గంటల సమయంలో తన చేతికి, కాలికి ఏదో కరిచిందని మల్లేశ్వరి నిద్రలేచి తండ్రికి చెప్పింది. అతను లైట్లు వేసి చూడగా మల్లేశ్వరి చేతి వద్ద ఓ పాము, కాలు వద్ద మరో పాము కనపడ్డాయి. వాటిని చంపి వెంటనే కుమార్తెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుతున్న కూతురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
‘నంద్యాల వైద్య కళాశాల’పై ప్రభుత్వానికి వెసులుబాటు
సాక్షి, అమరావతి: నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ)కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దరఖాస్తు సమర్పణకు వచ్చే నెల 7వ తేదీ గడువు కావడం, ఇప్పుడు దరఖాస్తు చేయకపోతే ఒక సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉండటంతో హైకోర్టు ఈ వెసులుబాటు కల్పించింది. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుపై యథాతథస్థితి కొనసాగించాలంటూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూన్ 20న చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరాథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కలెక్టర్ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు తమకు గడువు కావాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఎన్ఎంసీకి వచ్చే నెల 7వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉందన్నారు. లేకపోతే ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. అందువల్ల ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్ఎంసీకి ఇచ్చే దరఖాస్తులో పేర్కొనవచ్చని స్పష్టం చేసింది. కళాశాల నిర్మాణంపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. -
కరోనా చికిత్సలో అందరి చూపు ఏపీ వైపు
కర్నూలు: ఆదోని, నంద్యాల ఆస్పత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారు అని పేర్కొన్నారు. కోవిడ్ కట్టడి కోసం సోమవారం కర్నూలులో జిల్లా అధికారులతో మంత్రి సమీక్షచేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారని చెప్పారు. కరోనాతో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమీక్ష సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. ఇలా.. ‘కరోనా నివారణ కు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో వివరాలు సేకరించాం. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుంటాం. ఆదోని, నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నాం. అతి త్వరలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాను అందజేశాం. వారితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా టీకా వేయిస్తాం. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు భరోసా కల్పించేందుకు ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని వివరించారు. ‘రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్, బెడ్స్ ఇంజెక్షన్లపై అధికారులు సమన్వయంతో తో పని చేస్తున్నారు. ప్రభుత్వ అందిస్తున్న సదుపాయాలకు ప్రజలు సహకరించాలి. కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రులను సంప్రదించి చికిత్స పొందాలి. లేదంటే ప్రమాదమే. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా చికిత్సకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందరూ ఏపీ వైపు చూస్తున్నారు. కొవిడ్ కేర్ సెంటర్లో ప్రతి ఒక్కరూ కి చికిత్సతోపాటు భోజనం, మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం అన్ని కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముందులు, ఆక్సిజన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు అందిస్తోంది. ఎక్కువగా రికవరిగా పొందిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే’ అని మంత్రి బుగ్గన తెలిపారు. -
40 మంది చిన్నారులు.. మృత్యు లారీ
ఆళ్లగడ్డ/శిరివెళ్ల: వాళ్లంతా పది, పదిహేనేళ్లలోపు చిన్నారులు. దేవుడిపై ఎనలేని భక్తితో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ప్రార్థన కోసం బయలుదేరారు. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిలో నలుగుర్ని పరలోకాలకు తీసుకుపోయింది. ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద కర్నూలు–కడప జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పొగమంచు కమ్ముకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివరాల్లోకి వెళితే... యర్రగుంట్ల దళితవాడలో ఈ నెల 1వ తేదీన క్రిస్మస్ ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. భక్తులతో కలిసి 30 మందికి పైగా చిన్నారులు ప్రతిరోజు తెల్లవారుజామున వీధుల్లో తిరుగుతూ ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వేకువజామున 4 గంటలకు ఆ ప్రాంతంలోని చర్చి ఆవరణ నుంచి బయలుదేరారు. మరో కాలనీకి వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కడప వైపునకు వేగంగా వెళ్తున్న డీసీఎం లారీ వారి మీదుగా దూసుకెళ్లింది. దీంతో గుంపుగా వెళ్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. సమీపంలోని వారు గమనించి అక్కడికి చేరుకునేలోపు చిన్నారులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. ప్రమాదంలో స్థానిక విమల ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఉప్పలపాటి వెంకటరమణ కూతురు ఝాన్సీ (15) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శిరివెళ్ల ఏపీ మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న దాసరి సురేష్ కుమార్తె సుస్మిత (15), అదే స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సయ్యగాళ్ల బాలుగ్రం కుమారుడు వంశీ (12), మండల పరిషత్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న దాసరి బాలుగ్రం కుమారుడు హర్షవర్దన్ (8) నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలు ప్రమాదంలో తోట సువర్ణ, సుంకేసుల చెన్నమ్మ, సాయగాళ్ల మైథిలి, మేకల మద్దిలేటమ్మ, బాలబోయిన స్పందన, దాసరి చెన్నకేశవులు, కొత్తమాసి విజయకుమార్, మట్టల లక్ష్మిభార్గవ్, దాసరి నరసింహ, బేతి అరవింద్, దాసరి లక్ష్మి, ప్రవల్లిక తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో సాయగాళ్ల మైథిలి, బాలబోయిన స్పందన, తోట సువర్ణ, దాసరి నరసింహ, మేకల మద్దిలేటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీని ఆపకుండా వెళ్లిపోతుండగా.. కొందరు యువకులు వెంబడించి ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో అడ్డుకుని డ్రైవర్‌ను పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ ఖాజామొహిద్దీన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, డీఎస్పీ రాజేంద్ర ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాస్టర్ రాకపోయినా బయలుదేరి.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత ఏడాది నూతన చర్చి నిర్మించి.. క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా రెండు వారాల నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి పాస్టర్ సొంత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో కాలనీలోని కొందరు యువకులు రాత్రి చర్చిలోనే బస చేశారు. తెల్లవారుజామున పాస్టర్ లేకపోయినా వారే ప్రార్థనలు ప్రారంభించి ముందుకు సాగుతుండగా కాలనీలోని సుమారు 40 మంది చిన్నారులు కూడా హుషారుగా వారితో బయలుదేరారు. ప్రమాదంలో మృత్యువాత పడిన చిన్నారులు, క్షతగాత్రులందరిదీ ఒకే వాడ. అంతా కలిసిమెలిసి ఆటపాటలతో సందడి చేసే చిన్నారుల్లో నలుగురు మరణించారని, మరికొందరు గాయపడ్డారని తెలిసి గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. అవ్వ కళ్లముందే మనుమరాలు మృతి చాగలమర్రి మండలం డి.వనిపెంట గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటరమణ కుమార్తె ఝాన్సీ చిన్నతనం నుంచీ యర్రగుంట్లలో అవ్వతాతల ఉంటూ చదువుకుంటోంది. రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. బాలికకు తోడుగా వెళ్లిన అవ్వ సువర్ణ తీవ్ర గాయాలపాలైంది. యర్రగుంట్ల గ్రామానికే చెందిన సయ్యగాళ్ల బాలుగ్రం కుమారుడు వంశీ మరణించగా.. కుమార్తె మైథిలి రెండు కాళ్లు పోగొట్టుకుని మృత్యువుతో పోరాడుతోంది. ఎప్పుడూ ప్రార్థనకు వెళ్లని చిన్నారి సుస్మిత తోటి పిల్లలతో సరదాగా వెళ్లి మృత్యువాత పడటాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. -
నేతల మేత.. నాణ్యతలో కోత
సాక్షి, బొమ్మలసత్రం(నంద్యాల ): టీడీపీ నేతల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అభివృద్ధి పేరుతో నిధులను అడ్డంగా కొల్లగొడుతున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. చివరకు పేదల వైద్యానికి ఉద్దేశించిన వాటినీ వదలడం లేదు. ‘పనులు ఎలాగైనా చేసుకోండి.. మా కమీషన్లు మాకు ఇవ్వాల్సిందే’ అంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఫలితంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ప్రతిరోజూ 1,200 మంది దాకా ఔట్ పేషెంట్లు (ఓపీ) ఉంటారు. ప్రస్తుతం ఓపీ విభాగానికి ప్రత్యేక భవనం లేదు. ఆసుపత్రిలోనే ఓ మూలన కౌంటర్లు ఏర్పాటు చేసి..చీటీలు ఇస్తున్నారు. ప్రజలు ఎండలోను, చెట్ల కింద వేచివుండి ఓపీ చీటీలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీ విభాగం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ ద్వారా రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు గతేడాది జులైలో శంకుస్థాపన చేశారు. 20 శాతం కమీషన్లు! పేద రోగుల శ్రేయస్సు దృష్ట్యా భవన నిర్మాణాన్ని అత్యంత నాణ్యతగా చేపట్టాల్సి ఉంది. అయితే..అధికార పార్టీ నేతల కక్కుర్తితో పనులు నాణ్యతగా జరగడం లేదు. ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 20 శాతం మేర కమీషన్లు దండుకున్నట్లు సమాచారం. ఆసుపత్రికి చెందిన ఓ ఇంజినీర్ మధ్యవర్తిగా వ్యవహరించి కాంట్రాక్టర్ నుంచి ముడుపులు ఇప్పించినట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లలో 20 శాతం అంటే రూ.కోటి ముడుపులు ముట్టజెప్పిన సదరు కాంట్రాక్టర్ పనులను ఎలా పూర్తి చేయాలో దిక్కుతోచని స్థితిలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే పాడవుతోంది! నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో 2016లో మాతాశిశు వైద్యశాల భవనాలను రూ.15 కోట్లతో నిర్మించారు. అప్పుడు కూడా నేతల కమీషన్లు, అధికారుల స్వార్థం కారణంగా పనుల నాణ్యతకు పాతరేశారు. స్వయాన సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ భవనం మూడేళ్లు కూడా గడవకముందే దెబ్బతింటుండడం గమనార్హం. భవనం చుట్టూ భూమి కుంగిపోయి.. టైల్స్ విరిగిపోతున్నాయి. దాదాపు అడుగు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. బిల్డింగ్ గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార పార్టీ నేతలు దోచుకోవడం శోచనీయం. మాతాశిశు వైద్యశాల భవనం నిర్మించి మూడేళ్లు పూర్తి కాక ముందే బీటలు వారింది. ఇది చాలదని ఓపీ బిల్డింగ్ పనుల్లోనూ చేయి పెట్టారు. ప్రభుత్వాసుపత్రిలో చేస్తున్న పనుల నాణ్యతపై ఉన్నతస్థాయి అధికారులు విచారణ చేపట్టాలి. – ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నేత, నంద్యాల నాసిరకంగా నిర్మిస్తున్నారు మాతాశిశు వైద్యశాల నిర్మించి మూడేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే భవనం చుట్టూ మట్టి దిగబడి పోయి టైల్స్ ఊడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. నూతనంగా నిర్మిస్తున్న ఓపీ బిల్డింగ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాసిరకం సిమెంటు , ఇసుక, కంకర వేసి పిల్లర్లు నిర్మిస్తున్నా.. కాంట్రాక్టర్‌ను అధికారులు ప్రశ్నించటంలేదు. – సద్దాం హుస్సేన్, సీపీఎం మండల కార్యదర్శి, నంద్యాల -
పమ్మరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
పాణ్యం(కర్నూలు): పాణ్యం మండలం పమ్మరాజుపల్లి గ్రామంలో ఆదివారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కండ ఊడేలా నలుగురిని కరిచింది. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.