Narad Rai
-
మరణం అనివార్యమేగా!: నారద్ రాయ్
న్యూఢిల్లీ: మరణం అనివార్యమైనదని, అది నిరాకరించలేనిదని ఉత్తరప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి నారద్ రాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముజఫర్‌నగర్ బాధితుల సహాయక శిబిరాల్లో చిన్నారుల మరణాలపై యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతుండగా, నారద్ రాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముజఫర్‌నగర్ శిబిరాల్లో చిన్నారుల మరణాలపై ప్రశ్నించగా, ‘చిన్నారులు, పెద్దలు, వృద్ధుల మరణాలు అనివార్యమైనవి. శిబిరాల్లో ఉంటున్న వారు మాత్రమే మరణిస్తున్నారనేమీ లేదు. భవంతుల్లోని వారూ మరణిస్తారు. మా ఇళ్లలో ఉంటున్న చిన్నారులు మరణించరనేమీ లేదు... మరణాలు అన్ని చోట్లా సంభవిస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణల బాధితులు తలదాచుకుంటున్న సహాయక శిబిరాల్లో గడచిన రెండు నెలల వ్యవధిలోనే 34 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఇదిలా ఉండగా, శిబిరాల్లో ఉంటున్న వారెవరూ చలికి తాళలేక మరణించడం లేదని, అదే నిజమైతే సైబీరియాలో ఎవరూ బతికి ఉండేవారే కాదని యూపీ ప్రభుత్వాధికారి ఏకే గుప్తా వ్యాఖ్యానించారు. -
సచిన్.. మా పార్టీలోకి రండి: ఎస్పీ
బలియా: విశ్వక్రీడా వేదిక నుంచి తాజాగా నిష్ర్కమించిన క్రికెట్ ‘దేవుడు’ సచిన్ టెండూల్కర్‌ను రాజకీయ రంగం ఆహ్వానిస్తోంది! ‘సచిన్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తే మా పార్టీ సమాజ్‌వాదీలో చేరాలని కోరతా’ అని ఉత్తర్‌ప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి నారద్ రాయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ వాడుకుని వదిలేసే పార్టీలేనని, వాటిపట్ల సచిన్ జాగ్రత్తగా ఉండాలని కూడా రాయ్ సూచించారు. ఈ మేరకు రాయ్ ఆదివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడారు. సచిన్‌కు భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. -
సర్వం కోల్పోయాను..నన్ను ఆదుకోండి: మాజీ కోచ్ మీనాక్షి
ముంబై: విధి వక్రిస్తే ఎంతటి వారైనా కూలబడక తప్పదు. కాలం కలిసిరాక పోతే ఎవరు ముందైనా అర్రులు చాస్తూ చేతులు కట్టుకు నిలబడాల్సిందే. ఇటువంటి విషాద గాథే మన మీనాక్షి విషయంలో జరిగింది. ఇంతకీ ఆమె ఎవరో అనామకురాలు మాత్రం కాదు. ఒకప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్ గా పని చేసి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె ప్రస్తుత పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 2011లో అకస్మికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్తను కోల్పోవడమే కాకుండా, తన కాలికి కూడా తీవ్రంగా గాయకావడంతో ఉన్నతమైన ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. ఉన్న తన సొంత ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బులు కూడా ఆమె వైద్య ఖర్చులకే సరిపోవడంతో ప్రస్తుతం పదేళ్ల కుమారుడితో 'ఒంటరి' గా పోరాడుతోంది. ఈ విషయాన్నిఆమె క్రీడల మంత్రి నారద్ రాయ్ దృష్టికి తీసుకు వచ్చింది. సెప్టెంబర్ 18వ తేదీన మంత్రిని కలిసిన ఆమె తన ప్రస్తుతం పడుతున్న కష్టాలను కన్నీళ్ల రూపంలో వెళ్లగక్కింది.' నేను సర్వం కోల్పాయను. నా వద్ద తాకట్ట్టు పెట్టడానికి తల తప్ప ఇంకా ఏమీలేదు. నాకు ఉద్యోగం కల్పిస్తే, పదేళ్ల బాబుతో జీవితాన్ని గడపడానికి దారి చూపించిన వారవుతారు' అని అభ్యర్థించింది. క్రీడాశాఖా మంత్రి ఉద్యోగ భరోసా కల్పిస్తానని హామీ ఇచ్చారని, ఒకవేళ ఎస్ఏఐలో రెండోసారి కోచింగ్ బాధ్యతలు అప్పగిస్తే.. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని పేర్కొంది.