Narayanpur projects
-
సాగర్ రైతుల ఆశలు సజీవం..
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ప్రవాహాలు వస్తున్నాయి, ఇది నిండితే ఇక వచ్చేదంతా సాగర్‌కే కావడంతో వానాకాలం సాగుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే కనీస నీటిమట్టాలకు పైన 42 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. వానాకాలం నీటి విడుదలకు మరో 20 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా మరింత నీరు చేరుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. శ్రీశైలం నిండితే దిగువకే నీరంతా.. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండగా దిగువకు వచ్చే నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకే. దీంతో శ్రీశైలంలోనూ మట్టాలు గణనీయంగా పెరు గుతున్నాయి. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వ సా మర్థ్యానికిగాను 93 టీఎంసీల మేర నీరు చేరింది. మరో 122 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండ లా మారనుంది. ప్రవాహాలు ఇదేవిధంగా కొనసాగితే మరో 10, 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశముంది. అదే జరిగితే ఆగస్టు రెండోవారం నుంచి శ్రీశైలం నుంచి వచ్చే వరదంతా దిగువ సాగర్‌కే. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీల నిల్వ సామర్థ్యా నికిగాను 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇం దులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 42 టీఎంసీల మేర ఉంది. మరో 45 టీఎంసీల నీరు చేరే వరకు... ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగర్ కింద 6.40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఇటీవల జరిగిన ఇరిగేషన్ శాఖ శివమ్ కమిటీ భేటీలో అధికారులు నిర్ణయించారు. దీనికి 60 టీఎంసీల నీరు అవసరమని అంచనా కట్టారు. సాగర్‌పై ఆధారపడ్డ ఏఎంఆర్పీ కింద, హైదరాబాద్ జంటనగరాలకు, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకు కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 25 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుత లభ్యత కేవలం 17 టీఎంసీలే ఉంటుంది. ఈ నీరు సాగు అవసరాలను తీర్చే అవకాశంలేనందున మరో 45 టీఎంసీల నీరు చేరే వరకు వేచిచూడాల్సి ఉంది. అయితే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌లోకి 25 వేల నుంచి 29 వేల క్యూ సెక్కుల మేర నీటి విడుదల కొనసాగుతోంది. దీనికితోడు, ఆగస్టు రెండోవారం నుంచి ప్రవాహాలు పెరగనుండటంతో నిల్వలు పెరిగే అవకాశం ఉంద ని అంటున్నారు. గత ఏడాది మాదిరిగానే ఆగస్టు 13 నుంచి సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, పూర్తి ఆయకట్టుకు నీరందుతుందని నీటి పారుదల వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది మాదిరిగా ఆగస్టు 13 నుంచి నవంబర్ వరకు ఆరు నుంచి ఏడు తడులకు నీరందే అవకాశముందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
కృష్ణమ్మ కళకళ.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద
కర్నూలు సిటీ/రాయచూరు రూరల్/హొసపేటె/ధవళేశ్వరం: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఆల్మట్టి డ్యామ్‌కు ఎగువ నుంచి 45,534 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు 43,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా నారాయణపూర్ డ్యామ్ వైపు ఉరకలేస్తోంది. నారాయణపూర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 33.03 టీఎంసీలు కాగా ఇప్పటికే 29.05 టీఎంసీల నీరు చేరింది. దీంతో డ్యామ్‌లోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లో వరద పరవళ్లు: కర్ణాటక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఒక్కరోజే 40 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరడంతో డ్యామ్‌లో జలకళ ఉట్టిపడుతోంది. మరో రెండు రోజుల్లో నీటినిల్వ 40 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.897 టీఎంసీల నీరు ఉన్నట్టు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 12న కర్ణాటక మునిరాబాద్‌లో నిర్వహించిన ఐసీసీ (ఇరిగేషన్ కన్సల్టెన్సీ కమిటీ) సమావేశంలో ఈ నెల 18 నుంచి ఎల్ఎల్సీ, హెచ్చెల్సీ కాల్వలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక అధికారులు నిర్ణయించారు. ఎల్ఎల్సీ కాల్వలో రాంసాగరం వద్ద జరుగుతున్న పనుల వల్ల నీటిని విడుదల చేయవద్దని ఏపీ ఇంజనీర్లు కోరడం, ఏపీ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడంతో నీటి విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. మరింత పెరిగిన గోదావరి వరద: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద జలాలు బ్యారేజ్‌కు వచ్చి చేరుతున్నాయి. శుక్రవారం సాయంత్రం బ్యారేజ్ వద్ద 9.95 అడుగులకు నీటిమట్టం చేరింది. 1,37,390 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. -
రెండ్రోజుల్లో రాష్ట్రానికి ‘కృష్ణా’..
- ఆల్మట్టి, నారాయణపూర్‌కు జలకళ సాక్షి, హైదరాబాద్: ఎగువ కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పరీవాహకంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి మరో 30 టీఎంసీలు చేరితే ఒకట్రెండు రోజుల్లో దిగువకు కృష్ణా పరవళ్లు మొదలుకున్నాయి. గతేడాది కర్ణాటక నుంచి తెలంగాణకు ఆగస్టు రెండో వారం తర్వాత ఇన్‌ఫ్లోలు మొదలుకాగా ఈ ఏడాది ఈ నెలాఖరుకే మొదలయ్యే అవకాశాలు ఉండటం రాష్ట్రానికి పెద్ద ఊరటనిచ్చే అంశమని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. తుంగభద్రకు భారీగా ఇన్‌ఫ్లో ఉండటం సైతం రాష్ట్రానికి పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో పది రోజుల వ్యవధిలోనే రెండు జలాశయాల్లోకి 90 టీఎంసీల నీరు చేరింది. ఆదివారం ఆల్మట్టిలోకి 1.88 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు కొనసాగాయి. నీటిని విడుదల చేస్తుండటంతో అటు నారాయణపూర్ కళకళలాడుతోంది. ఈ ప్రాజెక్టు సైతం రెండ్రోజుల్లో నిండనుంది. నారాయణపూర్‌లో ఆశించిన నీరు చేరిన వెంటనే దిగువ జూరాలకు కర్ణాటక నీటిని విడుదల చేసే అవకాశాలున్నాయి. ఎగువ ప్రాజెక్టుల్లో భారీగా నీరు చేరడం, ఒకట్రెండు రోజుల్లో దిగువకు నీరొచ్చే అవకాశాలుండ టం రాష్ట్ర రైతాంగంలో ఆశలు రేపుతోంది. కృష్ణా బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల్లో నీటిమట్టాల వివరాలు ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో కృష్ణా బేసిన్ (టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కుల్లో) ఆల్మట్టి 129.7 112.59 1,88,632 తుంగభద్ర 100.86 37.47 10,204 నారాయణపూర్ 37.646 24.34 1,11,784 జూరాల 11.94 3.58 0 శ్రీశైలం 215.8 23.72 40 నాగార్జునసాగర్ 312.04 121.5 400