Narcotics smuggling
-
గసగసాల సాగును కనిపెట్టేందుకు డ్రోన్లు
సాక్షి, అమరావతి/మదనపల్లె టౌన్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో నిషేధిత ఓపిఎం పాపీ సీడ్స్ (గసగసాల) సాగును గుర్తించేందుకు ప్రత్యేక బలగాలు డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. మాదక ద్రవ్యాల్లో వినియోగించే నిషేధిత గసగసాల సాగును మదనపల్లి మండలం మాలేపాడులో గుర్తించిన నేపథ్యంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ), స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్), పోలీస్ శాఖకు చెందిన 100 మందికి పైగా సిబ్బంది మంగళవారం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. పొలాలు, మామిడి తోటలు, సమీప అడవుల్లో డ్రోన్ కెమెరాల సాయంతో గసగసాల పంటల స్థావరాలను గుర్తించడానికి కూంబింగ్ నిర్వహించారు. నిషేధిత పంటను సాగు చేసిన నాగరాజు ఫోన్ కాల్స్ ఆధారంగా డ్రగ్స్ ముఠాను కనుగొనేందుకు ముగ్గురు సీఐలతో కూడిన బృందం వేట ప్రారంభించింది. మహా నగరాలకు ప్రత్యేక బృందాలు ఈ పంటలను సాగు చేసిన రైతులతో పాటు వారికి విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యాపారులు, తెరవెనుక పాత్ర పోషిస్తున్న మాఫియా ముఠా పాత్రపై ఎస్ఈబీ బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ముంబైలోని డ్రగ్స్ మాఫియా వివరాలను ఇప్పటికే సేకరించారు. వారిని పట్టుకోవడానికి ఎస్ఈబీ డీఎస్పీ నేతృత్వంలో ఓ బృందం బెంగళూరు, మరో బృందం చెన్నై, ఇంకో బృందం ముంబై మహా నగరాలకు సోమవారం రాత్రే వెళ్లినట్టు సమాచారం. రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఈబీ సీఐ కేవీఎస్ ఫణీంద్ర, ఎస్ఐలు శ్రీధర్, దిలీప్‌కుమార్ మాలేపాడులో ఇంకా ఎవరైనా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారా అనే దిశగా అన్వేషణ ప్రారంభించారు. మదనపల్లె, చౌడేపల్లె మండలాల్లో 2014 జనవరిలో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసులో పాత ముద్దాయిల కదలికలపైనా ఆరా తీస్తున్నారు. -
ఎవరీ పనిలేని దేవుడు?
సాక్షి, ముంబై: ఎవరీ పనిలేని దేవుడు? అంటూ వ్యాఖ్యలు చేసి ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం ఒక కార్యక్రమంలో ఆయన బైబిల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బైబిల్ రచనపై మాట్లాడుతూ.. దేవుడు ఈవ్, ఆడంను ఎందుకు సృష్టించాలి. వారు సన్మార్గంలో నడవక మనందరికీ ఎందుకు జన్మనివ్వాలి? వారి పిల్లలమైన మనం ఇలా ఎందుకుండాలి? అని అన్నారు. మనం సృష్టించిన ప్రతి వస్తువు ఏదో ఒక సందర్భంలో దాని స్వభావానికి భిన్నంగా పని చేయొచ్చు కదా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లో నార్కోటిక్స్ డ్రగ్స్ మాఫియాను అరికట్టే క్రమంలో దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ ఎందరో చావులకు కారణమయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమాయకులను పొట్టనబెట్టుకున్నారంటూ క్యాథలిక్ క్రైస్తవ మత పెద్దలు కూడా ఆయనపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన మత పెద్దలను విమర్శించే క్రమంలో.. డ్యూటర్ట్ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. క్యాథలిక్ క్రైస్తవంపై, బైబిల్‌పై, దేవుడిపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తి దేశానికి అధ్యక్షుడుగా ఉండరాదంటూ బిషప్ పోబ్లో విర్జిలో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా డ్యూటర్ట్ పనిరాడంటూ ఫేస్బుక్లో కామెంట్ చేశారు. దేశంలో దాదాపు 80 శాతం ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల మత విశ్వాసాల పట్ల అధ్యక్షుడి తీరు సరిగా లేదని సోషల్ మీడియాలో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. -
రూ.15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాలతో ఓ జింబాబ్వే దేశీయురాలు ఢిల్లీ ఎయిర్ట్‌పోర్టులో పట్టుబడింది. పట్టుబడిన డ్రగ్స్‌విలువ రూ.15 కోట్లు ఉంటుందని, ఆమె గోవా మీదుగా ఫిలిఫ్పైన్స్‌లోని మనీలాకు అక్రమంగా సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తూ పట్టుబడిందని భద్రతా అధికారులు తెలిపారు. ఓ విదేశీయురాలి వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల నుంచి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు సమాచారం రావడంతో ఈ విషయం పడింది. జింబాబ్వేకు చెందిన బెట్టీ రేమ్ అనే మహిళ ఏప్రిల్ 2న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గోవాకు వెళ్లడానికి విమానం ఎక్కేందుకు డిపార్చర్ టెర్మినల్ చేరుకుంది. మూడో నెంబర్ గేటు వద్దకు రాగానే భద్రతా అధికారులకు అనుమానం వచ్చి ఆమెను ఆపేశారు. ఆమె వెంట తెచ్చుకున్న బ్యాగ్‌ను చెక్ చేసేందుకు ఎక్స్-బిస్ మెషిన్ ద్వారా పంపించగా అనుమానాస్పదంగా బ్యాగ్‌లో ఓ పదార్థం కనిపించింది. దీంతో అధికారులు బ్యాగును తెరిచి చూడగా 3 కిలోల బరువున్న ప్యాకెట్ ఉంది. పరిశీలించి చూడగా పాపులర్ పార్టీ డ్రగ్ మెతమ్‌ఫెటమైన్‌గా తేల్చారు. ఈ డ్రగ్‌ను ఐస్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు విచారణ నిమిత్తం అప్పగించారు. ఈ డ్రగ్స్‌ను ఓ ఆఫ్రికన్ నుంచి తీసుకున్నట్లు విచారణలో తెలిపింది. ఆమె జింబాబ్వే నుంచి ముంబాయికి మార్చి 20న వచ్చింది. అంతకుముందు గతేడాది నవంబర్‌లో కూడా భారత్‌ను సందర్శించింది. మెతమ్‌ఫెటమైన్ అనే డ్రగ్‌ను ఎపిడ్రిన్ అనే డ్రగ్ నుంచి తయారు చేస్తారు. దీనికి ఇండియాతో పాటు పలుదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. -
ఉమ్మడిగా ‘ఉగ్ర’ పోరాటం
బిమ్స్టెక్ సదస్సులో తీర్మానం అందరికీ ఒకేరకం సవాళ్లు: మన్మోహన్ నేప్యీదే: ఉగ్రవాదం, సీమాంతర నేరాలు, మాదకద్రవ్యాల రవాణాపై సమష్టిగా పోరాడాలని బిమ్స్టెక్ దేశాలు తీర్మానించాయి. వాణిజ్యం, ఎనర్జీ, వాతావరణ విషయాల్లో అనుసంధానానికి, సహకారానికి అంగీకరించాయి. మంగళవారం మయన్మార్ రాజధాని నేప్యీదేలో ముగిసిన 3వ బిమ్స్టెక్ (బహుళ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారానికి బంగాళాఖాత తీర దేశాల ప్రయత్నం) సదస్సులో ఈ మేరకు ఏడుగురు దేశాధినేతలు ప్రకటన చేశారు. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దానిలో ఒకటి ఢాకాలో బిమ్స్టెక్కు స్థిరమైన సచివాలయ నిర్మాణం, రెండోది వాతావరణానికి సంబంధించి ఒక కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయడం, మూడోది ఈ దేశాల కల్చరల్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏర్పాటు. శ్రీలంకకు చెందిన సుమిత్ నకందల బిమ్స్టెక్ తొలి సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. అంతకుముందు సదస్సులో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. బంగాళాఖాత తీర దేశాల్లో టైజం విజృంభించే అవకాశం ఉందని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశాల మధ్య సహకారం అవసరమన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి టైజం వరకూ ఈ దేశాలు ఏక రీతిలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యం, భద్రత, అభివృద్ధి సాధించాలంటే అంతా కలసి పనిచేయాలని ఉద్బోధించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో సమావేశమైన మన్మోహన్.. భారత జాలర్లలను మానవతా దృక్పథంతో చూడాలని కోరారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రజాస్వామ్య పోరాటానికి ప్రతీక అంగ్‌సాన్ సూచీని మన్మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. మయన్మార్ పర్యటన ముగించుకుని మన్మోహన్ మంగళవారం రాత్రికి ఢిల్లీకి చేరుకున్నారు.