Naushad Forbes
-
100 సంస్థలను ప్రైవేటు పరం చేయండి
► కేంద్రానికి సీఐఐ విజ్ఞప్తి ► పీపీపీపై 50 రైల్వే స్టేషన్ల నిర్మాణానికి వినతి న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ సమర్పిస్తున్న నేపథ్యంలో– పారిశ్రామిక సంస్థ సీఐఐ తన కోర్కెల చిట్టాను ఆయన ముందు ఉంచింది. ఎయిర్ ఇండియా, అశోకా హోటెల్స్ సహా 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం, 2017 ముగిసే నాటికి ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) 50 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించటం ఇందులో కొన్ని. సీసీఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ తెలిపిన సమాచారాన్ని బట్టి మరిన్ని ఈ పారిశ్రామిక సమాఖ్య కోర్కెలను చూస్తే– ♦ పీపీపీతో ముడివడి ఉన్న అన్ని పెండింగ్ వివాదాల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుంది. దీనితో పెట్టుబడులు పెరిగి, ఆర్థిక వృద్ధి మెరుగుపడుతుంది. ♦ 2015 డిసెంబర్లో ఫైనాన్షియల్ కార్యదర్శి విజయ్ కేల్కర్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసిన విధంగా వివిధ రంగాల్లో పీపీపీ ప్రాజెక్టుల పరిశీలనకు స్వతంత్ర రెగ్యులేటర్లను ఏర్పాటు చేయాలి. తద్వారా సత్వర నిర్ణయాలకు మార్గం సుగమం చేయాలి. ♦ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నష్టదాయక కంపెనీలనే కాకుండా, లాభదాయక కంపెనీలను సైతం ప్రైవేటు పరం చేయాలి. -
ఈ ఏడాది 8% వృద్ధి ఆశిస్తున్నాం..
సీఐఐ ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ వృద్ధి 8%నికి చేరుతుందని ఆశిస్తున్నట్టు సీఐఐ తెలిపింది. ఈసారి సాధారణ రుతుపవనాలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఈ స్థాయి వృద్ధి సాధ్యమేనని సీఐఐ ప్రెసిడెంట్ నౌషద్ ఫోర్బ్స్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఏపీ, గుజరాత్‌లు కార్మిక చట్టాల సంస్కరణలు చేపట్టాయి. తమిళనాడు, రాజస్తాన్‌లు భూ చట్టాలను సంస్కరించాయి. మిగిలిన రాష్ట్రాలు వీటిని అనుసరించాల్సి ఉంది. జీఎస్టీ అమలుకై ప్రతిపక్ష పార్టీలతో చర్చిస్తున్నాం. జీఎస్టీ అమలైతే దేశంలో ఒక్కో కుటుంబానికి ఏటా రూ.8,000 అదనపు ఆదాయం సమకూరుతుంది’ అని అన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగిందని, ఈ క్రమంలో 2016-17లో పరిశ్రమ వృద్ధి 5-6% ఉండొచ్చని చెప్పారు. స్టార్టప్ సెంటర్లు: సీఐఐ జాతీయ స్టార్టప్ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తోంది. రూరల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఇది ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రపంచ స్థాయి యూనివర్సిటీతోపాటు 100 ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ సెంటర్ నెలకొల్పనుంది. పీపీపీ విధానంలో ఇవి రానున్నాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. తెలంగాణలోనూ స్టార్టప్ సెంటర్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.