Nava Bharat
-
లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ప్రముఖ వార్తా చానల్ టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగనుందని, కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం ఖాయమని సర్వే తేల్చింది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 స్థానాలు రావచ్చని పేర్కొంది. కాంగ్రెస్ కూటమికి 106 నుంచి 144 వరకు, ఇతరులకు 66 నుంచి 96 దాకా సీట్లు లభిస్తాయని తెలిపింది. బీజేపీ కూటమికి 38.2 శాతం, కాంగ్రెస్ కూటమికి 28.7, ఇతరులకు 33.1 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ నిస్సందేహంగా 300 పై చిలుకు స్థానాలు గెలుస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది, కష్టమని 26 శాతం, ఎన్నికల నాటికే దీనిపై స్పష్టత వస్తుందని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. 13 శాతం ఏమీ చెప్పలేమన్నారు. మోదీ 2.0 పాలన తీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని ఏకంగా 51 శాతం మంది చెప్పారు! చాలావరకు సంతృప్తికరమేనని 16 శాతం, ఓ మాదిరిగా ఉందని 12 శాతం చెప్పగా, బాలేదని 21 శాతం బదులిచ్చారు. మోదీ సర్కారు అతి పెద్ద వైఫల్యం ద్రవ్యోల్బణమని 34 శాతం, నిరుద్యోగమని 46 శాతం మంది పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తేలేకపోవడమని 13 శాతం, చైనా దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యమని 7 శాతం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడ్డాయా అన్న ప్రశ్నకు 41 శాతం మంది లేదని బదులిచ్చారు. చాలాసార్లు అలా అన్పించిందని 21 శాతం, అది విపక్షాల దృక్కోణమని 14 శాతం, ఏమీ చెప్పలేదని 24 శాతం అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు 20 నుంచి 22 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. ‘ప్రధాని’గా మోదీకి పోటీయే లేదు అత్యంత శక్తిమంతుడైన ప్రధాని అభ్యర్థిగా మోదీకి 64 శాతం మంది ఓటేశారు. రాహుల్‌కు 13, కేజ్రీవాల్‌కు 12, నితీశ్‌కు 6, కేసీఆర్‌కు 5 శాతం ఓట్లొచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో విపక్షాల సారథిగా రాహుల్‌కు 29 శాతం, కేజ్రీవాల్‌కు 19, మమతకు 13, నితీశ్‌కు 8, కేసీఆర్‌కు 7 శాతం ఓట్లొచ్చాయి. 2024 ఎన్నికలకు ముందే విపక్షాలు ఒక్కటవుతాయని 31 శాతం, లేదని 26 శాతం, ఎన్నికల అనంతర పొత్తులుండొచ్చని 26 శాతం అన్నారు. రాహుల్‌పై వేటు కాంగ్రెస్‌కు లాభించదు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు కాంగ్రెస్‌కు ఎన్నికల్లో పెద్దగా లాభించదని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. అది కేవలం న్యాయపరమైన అంశమని వారన్నారు. ఈ అంశానికి జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతేమీ ఉండదని మరో 11 శాతం మంది అన్నారు. 23 శాతం మంది ఇది రాహుల్‌కు సానుభూతి తెస్తుందని చెప్పగా 27 శాతం ఏమీ చెప్పలేమన్నారు. దొంగలందరికీ ఇంటిపేరు మోదీయే ఎందుకు ఉంటుందంటూ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, తర్వాత 24 గంటల్లోపే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, ఇది కక్షసాధింపని కాంగ్రెస్, విపక్షాలు దుయ్యబట్టడం తెలిసిందే. ఇదీ చదవండి : పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1.. గుజరాత్ అధిగమించి సత్తా! ఇదీ చదవండి : బాబు దయనీయ స్థితికి అద్దం పడుతున్న ఉపన్యాసాలు! -
ఇండియా@75: సబ్ కా ప్రయాస్
భారత 75వ స్వాతంత్య్ర దినాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవాలన్న నవ భారత నిర్మాణ సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ, సరికొత్త కార్యక్రమాలు, పథకాలతో దేశ వర్తమాన, భవిష్యత్తు ప్రణాళికలను రూపుదిద్దింది. తద్వారా దేశం శతాబ్ది (100వ) స్వాతంత్య్ర వేడుకల్ని నిర్వహించుకునే నాటికి ప్రతి ఒక్కరి కృషితో స్వయం సమృద్ధ భారత స్వప్నం సాకారమౌతుంది. అయితే, స్వాతంత్య్ర పునాదులపై ప్రత్యక్షం కాబోయే ఈ బృహత్ నిర్మాణం ఒక్కటే మన జాతి గమ్యం కాదు. నవ భారతావని రూపు దిద్దుకోవడానికి ఇది ఆరంభం మాత్రమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను ప్రజల భాగస్వా మ్యంతో ఒక సంకల్పం స్థాయికి చేర్చడం ద్వారా దేశ ప్రగతిని ముందు తీసుకెళుతున్నారు. మన సుసంపన్న వారసత్వం మనకో సరికొత్త గుర్తింపు దిశగా బాటలు వేస్తుండగా, ‘సబ్ కా ప్రయాస్’ తారక మంత్రంతో స్వర్ణ భారతావని నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారు. నాటి స్వాతంత్య్ర సమరంలో సామాన్య ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉండేది. చరఖా, ఉప్పు వంటివి స్వాతంత్య్ర ఉద్యమంతో ప్రజల్ని మమేకం చేయడానికి శక్తిమంతమైన చిహ్నాలుగా నిలబడ్డాయి. అదే తరహాలో ఈనాటి 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని అమృత మహోత్సవంగా సంకేత పరుస్తూ కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులందరికీ ఇందులో భాగస్వామ్యాన్ని పంచింది. 2022 స్వాతంత్య్ర దినోత్సవానికి 75 వారాల ముందుగా దండియాత్ర ఉద్యమ ఘటనతో మొదలైన ఈ అమృత మహోత్సవం భారతదేశ చరిత్రలో సుసంపన్నమైనదిగా, చిరస్థాయిగా ఉండిపోతుంది. (చదవండి: ఉద్యమ స్ఫూర్తి.. కడప కీర్తి) -
విధులను పాటించాలి
న్యూడిల్లీ: విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ యువతకు సందేశమిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వమే భారత్ గొప్పదనం. భారత్‌లోని ప్రాంతాలుగానీ, ప్రజలుగానీ తాము వివక్షకు గురయ్యామన్న భావన రాకుండా మనమే చూసుకోవాలి. గత 70 ఏళ్లుగా ప్రపంచం ముందు మనం గొప్పగా నిలబడ్డాం. విధులు సక్రమంగా పాటించడం ద్వారా దీన్ని నిలుపుకోగలం. ఇదే గణతంత్ర దినోత్సవ పరేడ్ వెనుక ఉన్న అసలు లక్ష్యం’ అంటూ ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. రాజ్‌పాత్‌లో జరుగుతున్న కార్యక్రమం భారత శక్తిని ప్రపంచానికి చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విలువలు, ఆలోచనలు కలిగిన నవభారత్ను నిర్మించేందుకు శ్రమించాలని యువతకు సందేశం ఇచ్చారు. మీ నుంచి స్ఫూర్తి పొందుతాను.. ‘వివిధ రంగాల్లో మీరు సాధించిన విజయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన విజయాలు అమోఘం’ అంటూ ప్రధాని మోదీ.. ‘ప్రధానమంత్రి బాల్ పురస్కార్’ అవార్డు పొందిన పిల్లలతో ముచ్చటించారు. శుక్రవారం మోదీ తన నివాసంలో అవార్డు పొందిన పిల్లలను కలిశారు. ‘మీరు చేసిన పనుల గురించి వింటున్న సమయంలో, మీతో మాట్లాడుతున్న సమయంలో.. నేను కూడా స్ఫూర్తిని, శక్తిని పొందుతాను’ అని వ్యాఖ్యానించారు. -
మోదీ మాటలూ నీటిమూటలే..
గత సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానపు మాట లనూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తప్పుతూ వస్తున్నారు. నవభారత్‌లో లక్షలాది మంది నిరుద్యోగ సోదరులు ఉన్నారని వారందరికీ ఉద్యోగ భృతి కల్పిస్తామని ఆనాడు నిరుద్యోగులం దరికీ మోదీ మాట ఇచ్చారు. ప్రధానిగా ఎన్నికై నాలుగేళ్లు దాటినా, నేటికీ నిరుద్యోగ సమస్య తీరలేదు. గత పాలకులను ఊరకే విమర్శిస్తూ కాలం గడపటం తప్ప తానేం చేశాననే ఆత్మ పరిశీలన మోదీ చేసుకోవడం లేదు. మాయమాటలతో దేశ ప్రజలను మోసగించడం ఎల్లకాలం కుదరదని నేతలు గ్రహించాలి. రంగినేని జగదీశ్వరుడు, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ -
కార్మికుల ఓట్లే ‘కీ’లకం
కొత్తగూడెం(ఖమ్మం), న్యూస్‌లైన్ : సింగరేణి బొగ్గు గనులతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కార్మికులు.. రాజకీయ నేతల తలరాతలు మార్చుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని పోటీ చేస్తున్న అభ్యర్థులు కార్మికుల ఓట్లపైనే ఎక్కువగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనకు పూర్వం.. కొత్తగూడెం నియోజకవర్గం లో చండ్రుగొండ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతుల ఓట్లు ఉండేవి. అయితే పునర్విభజన అనంతరం కొత్తగూడెం, పాల్వంచ మండలాలతో కలిపి కొత్తగూడెం నియోజకవర్గంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికులు, పాల్వంచలోని కేటీపీఎస్, నవభారత్, స్పాంజ్ఐరన్ పరిశ్రమల కార్మికులు ఎన్నికల్లో కీలకంగా మారారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 2,18,146 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగూడెంలో 1,37,859 మంది, పాల్వంచలో 80,287 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సింగరేణి సంస్థ పరిధిలో ప్రస్తుతం 5వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరితోపాటు సింగరేణి ప్రధాన కార్యాలయంలో రెండు వేల మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి కుటుంబాల్లో ఉన్న ఓట్లు మొత్తం కలిపి సుమారు 30వేల వరకు ఉంటాయి. కాగా, సింగరేణి సంస్థలో అవుట్సోర్సింగ్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సుమారు మూడువేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కొత్తగూడెంలో భూగర్భ కార్మికులకు సంబంధించి సుమారు 40వేల మంది ఉన్నారు. పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో ఐదువేల మంది ఉద్యోగులుండగా, ఇందులో 1,500 మంది వరకు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. వీరి కుటుంబాల తో కలిపి సుమారు 20వేల వరకు కేటీపీఎస్ కార్మికుల ఓట్లు ఉన్నాయి. అలాగే నవభారత్ పరిశ్రమలో సుమారు 1,500 మంది, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో 350 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కుటుంబాలతో కలిపి సుమారు ఐదువేల వరకు ఓట్లు ఉంటాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు 65 నుంచి 70 వేల వరకు ఉండడంతో ఇక్కడి నుంచి బరిలోకి దిగే నేతల రాతలు మార్చడంలో కార్మికులు కీలకంగా మారారు.