
గత సార్వత్రిక ఎన్నికల్లో దేశప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానపు మాట లనూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ తప్పుతూ వస్తున్నారు. నవభారత్‌లో లక్షలాది మంది నిరుద్యోగ సోదరులు ఉన్నారని వారందరికీ ఉద్యోగ భృతి కల్పిస్తామని ఆనాడు నిరుద్యోగులం దరికీ మోదీ మాట ఇచ్చారు. ప్రధానిగా ఎన్నికై నాలుగేళ్లు దాటినా, నేటికీ నిరుద్యోగ సమస్య తీరలేదు. గత పాలకులను ఊరకే విమర్శిస్తూ కాలం గడపటం తప్ప తానేం చేశాననే ఆత్మ పరిశీలన మోదీ చేసుకోవడం లేదు. మాయమాటలతో దేశ ప్రజలను మోసగించడం ఎల్లకాలం కుదరదని నేతలు గ్రహించాలి.
రంగినేని జగదీశ్వరుడు,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్