NDA Sankharavam
-
పిచ్చి కూతలు కూస్తే ఊరుకోం: పవన్ కల్యాణ్
* ప్రాంతీయతను రెచ్చగొడితే సహించం * కేసీఆర్‌కు పవన్ కల్యాణ్ హెచ్చరిక * మోడీ ప్రధాని కావాలన్నది ప్రతి భారతీయుడి ఆకాంక్ష * తెలంగాణ అంటే తనకు ప్రేమ, ఇష్టమని పేర్కొన్న పవన్ సాక్షి, హైదరాబాద్, నిజామాబాద్: దేశ సమగ్రతకు భంగం కలిగించే ఏ పార్టీనైనా.. ప్రాంతీయతను రెచ్చగొడితే ఏ నాయకుణ్నయినా సహించేది లేదంటూ జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మాట్లాడే తీరు బాగోలేదు. సీమాంధ్ర నాయకులకు ఇక్కడ పోటీ చేసే హక్కు లేదంటున్నారు. అది మీరెలా చెబుతారు? గతంలో పీవీ నరసింహారావు నంద్యాలలో, ఇందిరాగాంధీ మెదక్‌లో పోటీ చేసిన విషయం మర్చిపోయారా? ఈ దేశంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. మీరు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే.. ఇక్కడ చూస్తూ ఊరుకునే వారెవరూ లేరు’ అని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కుటుంబం పేరిట నేను, కూతురు, కోడలు, మేనల్లుడు అంటూ సీట్లు పంచుకోవడం సరికాదన్నారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ‘ఎన్డీయే శంఖారావం’ సభలో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. ‘సోనియా, రాహుల్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విడగొట్టింది. రాష్ట్రం రెండుగా విడిపోవచ్చు.. కానీ తెలుగు జాతి ఒక్కటే. స్వీట్లు పంచుకుని రెండుగా విడిపోవాల్సిన ఇరు ప్రాంతాలు ద్వేషంతో విడిపోయాయి. ఇదిదేశ సమగ్రతకు భంగం కలిగించింది’ అని పవన్ పేర్కొన్నారు. ప్రధాని పీఠం కోసం పోటీ పడుతున్న రాహుల్‌కూ ఆయన చురకలంటించారు. ‘క్రికెట్ ఆడాలంటే తొలుత జోనల్, రంజీ, 20-20 మ్యాచ్‌ల్లో ఆడాలి. ఆ తర్వాత దేశానికి ప్రాతినిధ్యం వహించే 12 మంది సభ్యులుండే జట్టులో అవకాశం వస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలంటే సంబంధిత పరీక్షలన్నీ పాస్ కావాలి. ఇందిరా కుటుంబంలో పుడితే.. పేరు చివర గాంధీ వస్తుంది గాని, ఆమెకున్న అనుభవం రాదు కదా? అది గుర్తుంచుకోవాలి’ అని హితవు పలికారు. ‘ప్రధానిగా దేశాన్ని పరిపాలించాలంటే బలమైన నాయకుడు కావాలి, బలహీనమైన కుటుంబంలోని వారు కాదు’ అని పరోక్షంగా రాహుల్‌ను విమర్శించారు. బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ ప్రధాని కావాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయన్నారు.‘పెరిగిన ధరలను చూసి మా అమ్మ ఎంతో బాధపడుతోంది. నిజానికి సినీ హీరోగా నేను, కేంద్ర మంత్రిగా అన్నయ్య ఓ స్థితిలో ఉన్న మా ఇంట్లోనే ఈ పరిస్థితి ఉంటే. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. ప్రతిదీ మన నియంత్రణలో ఉండాలంటే.. ఎన్డీఏ ప్రభుత్వం రావాలి’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘దేశ్ బచావ్... కాంగ్రెస్ హటావ్’ అంటూ నినాదాలు చేశారు. నా నరనరాల్లో.. ప్రతి రక్తం బొట్టులో తెలంగాణ ‘‘తెలంగాణ అంటే నాకెంతో ప్రేమ.. నా గుండె లోతుల్లో తెలంగాణ ఉంది.. నరనరాల్లో, రక్తంలో తెలంగాణ ఉంది. నాకు తెలంగాణ అంటే ఎంతో ఇష్టం’ అని అంతకుముందు నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీల కూటమైన మూడోఫ్రంట్‌లో కేసీఆర్ ఎలా కలుస్తారని ప్రశ్నించారు. -
పవన్ హీరో.. బాబు జీరో!
* పవన్‌కల్యాణ్‌పై మోడీ పొగడ్తల వర్షం * చంద్రబాబును లైట్ తీసుకున్న పవన్ సాక్షి, హైదరాబాద్ : మోడీ సభల ద్వారా తానూ ప్రచారం పొందాలని భావించిన చంద్రబాబునాయుుడికి అదేమీ దక్కకపోగా, కొంత భంగపాటే మిగిలింది. చంద్రబాబు తన ప్రసంగంలో నరేంద్రమోడీని ఆకాశానికెత్తినా.., ఇటు మోడీగానీ, అటు పవన్‌కల్యాణ్ గానీ వారి ప్రసంగాల్లో చంద్రబాబును పెద్దగా ప్రస్తావించలేదు. బాబును మోడీ పక్కనే కూర్చోబెట్టుకున్నప్పటికీ, టీడీపీ అధినేత గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. పైగా, పవన్‌కల్యాణ్‌ను పొగడ్తల్లో వుుంచెత్తారు. దీంతో బాబు మొహం వెలవెలబోరుుంది. ‘ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర కలిసి మొత్తం తెలుగు స్ఫూర్తిని పవన్‌కల్యాణే రక్షించగలడు’ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మింగలేక, కక్కలేక అన్నట్లుగా వూరారుు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబును లైట్‌గానే తీసుకున్నారు. హైదరాబాద్‌లో వేదికపైనే ఉన్న బాబను పవన్ అంతగా పట్టించుకోలేదు. నిజానికి మోడీ సభల విషయంలో బీజేపీ చంద్రబాబును చాలా తేలిగ్గా తీసుకుంది. తీవ్ర స్థారుులో ఒత్తిళ్లు, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను వుుందుపెట్టి బ్లాక్మెరుులింగుకు దిగడంతో చివరకు రాజీపడి హైదరాబాద్, వుహబూబ్‌నగర్ సభల్లో పాల్గొనటానికి వూత్రం బాబును అనువుతించింది. కేసీఆర్‌పై సంయువునం!: ‘లెక్కల్లో వుూడు ఒకట్లు కలిస్తే మూడవుతుంది. కానీ మోడీ, బాబు, పవన్‌కల్యాణ్ కలిస్తే అది నూటా పదకొండు అవుతుంది’ అంటూ మోడీ హైదరాబాద్ సభలో కొత్త లెక్కొకటి వినిపించారు. మోడీ సభల్లో చంద్రబాబుకు ఇదొక్కటే ఉపశవునం! అది తప్ప మోడీ ఎక్కడా చంద్రబాబు, టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు. రాష్ట్రంలో పర్యటించిన సోనియూ, రాహుల్‌లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడినా, మోడీ వూత్రం ‘ఒక కుటుంబానికి తెలంగాణను అప్పగించకూడద’నే ఒక్క వ్యాఖ్యకే పరిమితవుయ్యారు. కేసీఆర్‌పై పవన్ కల్యాణ్ మండిపడినా, మోడీ మాత్రం సంయమనం పాటించారు. కేంద్రంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే మోడీ టీఆర్ఎస్ నేత కేసీఆర్ జోలికి వెళ్లలేదని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి గత ఆగస్టులో ఇదే స్టేడియుంలో జరిగిన సభలో మోడీ తెలంగాణ కోణంలో పెద్దగా వూట్లాడలేదని, ఆయన ప్రసంగం తెలంగాణలోని పార్టీ శ్రేణులకే నచ్చలేదని బీజేపీ వుుఖ్యులు విశ్లేషించారు. దీంతో ఈసారి తెలంగాణ కోణంలో వూట్లాడాలని మోడీకి వుుందుగానే సూచించారు. అయినా, ఆయన మంగళవారం జరిగిన సభల్లో ‘కాంగ్రెస్ తెలంగాణకు పురుడు పోయుటానికి తల్లిని చంపేసింది’ లాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ తెలంగాణ శ్రేణులకు రుచించలేదు. మోడీ ప్రసంగాల్లో పీవీ నరసింహారావు, అంజయ్యులకు జరిగిన అవవూనాలను పదే పదే ప్రస్తావించారు. ఇది ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా లేదని పార్టీ వుుఖ్యులే అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తెలుగువారిని అవవూనించినట్లే ఉందన్న మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు అపార్థం చేసుకునే అవకాశముందని వారు భావిస్తున్నారు. ‘టీడీపీతో పొత్తు పెట్టుకోవడంవల్ల ఇరు ప్రాంతాలకూ నచ్చేలా మోడీ వూట్లాడాల్సి వచ్చింది. తెలంగాణకు సంబంధించి మోడీ వూటల్లో పంచ్ లేకపోవటానికి ఇదే కారణం’ అని ఓ సీనియర్ నేత అన్నారు. పైగా, పవన్ ప్రసంగమూ తమను ఇరకాటంలోకి నెట్టిందని చెప్పారు. ‘నిజామాబాద్ సభలో పవన్‌కల్యాణ్ జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తెలంగాణవాడినని చెప్పారు. కానీ, హైదరాబాద్‌కు వచ్చేసరికి సీవూంధ్రపై ఎవరు ఏం వూట్లాడినా సహించేది లేదన్నట్లు వూట్లాడారు. దీంతో మేం ఈ సభల ద్వారా ఏం చెప్పుకోగలిగామో వూకే అర్థం కావడంలేదు’ అంటూ పెదవి విరిచారు. -
మోడీ శైలే వేరు
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సభల్లో క్లుప్తంగా, చెప్పదలుచుకున్న విషయాలపై సూటిగా మాట్లాడిన బీజేపీ అగ్రనేత నరేంద్ర మోడీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మాత్రం తనదైన బాణీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పెద్దలకు చురకలంటించారు. అడపాదడపా చలోక్తులు సంధించారు. అవి ఆయన మాటల్లోనే... ఢిల్లీలో ఎలాంటి ప్రభుత్వం కొలువు దీరాలి. గట్టిగా చెప్పండి.. ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ప్రభుత్వం కావాలా? తల్లీకొడుకుల(సోనియా, రాహుల్) ఆక్సిజన్‌తో నడిచే సర్కారు కావాలా? రిమోట్ కంట్రోల్‌తో నడిచే ప్రభుత్వం కావాలా? - గత ఎన్నికల సమయంలో పది కోట్ల మందికి ఉపాధి చూపుతామని తల్లీకొడుకుల ప్రభుత్వం చెప్పింది. ఈ సభలో ఉన్న వారిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వచ్చిందా? మీ దోస్తుల్లో ఎవరైనా ఉద్యోగం పొందారా? వారి దోస్తుల్లో ఎవరికైనా వచ్చిందా? - మోడీ ప్లస్ పవన్‌కల్యాణ్ ప్లస్ బాబు... 1 ప్లస్ 1 ప్లస్ 1... ఎవరినైనా అడిగితే 3(ముగ్గురు) అంటారు. అది అర్థమెటిక్. కానీ నాకు కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక్కడ ముగ్గురు కాదు. 111 (నూటాపదకొండు). - దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే వీసా ఉండాల్సిన పరిస్థితి నుంచి కొద్దిలో తప్పించుకున్నాం. ఆ పుణ్యం సర్దార్ వల్లభాయ్ పటేల్‌దే. ఆ ఉక్కు మనిషి ఈ సంస్థానాన్ని దేశంలో విలీనం చే యించి దీన్ని భారత్‌లో భాగం చేశారు. తెలుగువారిపై పగ కాదా..? మోడీ పాల్గొన్న నాలుగు వేదికల్లో ఓ అంశాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఇందిర కుటుంబానికి ముందు నుంచీ తె లుగువారంటే కోపముందని వివరించారు. ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రపతిగా కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి, తెలుగు వ్యక్తి నీలం సంజీవరెడ్డి గెలవకుండా ఆమె వీవీగిరిని గెలిపించారని గుర్తు చేశారు. దళిత ముఖ్యమంత్రి అంజయ్యను విమానాశ్రయం లో తీవ్రంగా అవమానించి రాజీవ్‌గాంధీ ఆయ న కంట నీరు పెట్టించారన్నారు. దానిపై విమర్శలు చెలరేగడంతో కోపంతో కొద్దిరోజులకే అంజయ్యను పదవి నుంచి తప్పించారన్నారు. పీవీ నరసింహారావు గొప్ప ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయేలా పనిచేస్తే ఆయనను దారుణంగా అవమానిందన్నారు. ఆయన జయంతి, వర్ధంతి సమయాల్లో ఆ పార్టీ నేతలు కనీసం పుష్పాంజలి కూడా ఘటించరని పేర్కొన్నారు.