need help
-
యమున కన్నీరు ఆగేనా? బోసి నవ్వులు విరిసేనా?
యమునా, మోహన్లది అన్యోన్య దాంపత్యం. ఆస్తిపాస్తులు పెద్దగా లేకపోయినా ఆ జంట సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక్క లోటు సంతానం. గతంలో యమునా ఓసారి ప్రసవించినా.. ఈ బిడ్డకు నూరేళ్లు నిండకుండానే దేవుడు తీసుకెళ్లిపోయారు. చాన్నాళ్ల తర్వాత యమున మరోసారి నెల తప్పింది. మరి వాళ్లింట్లో బోసి నవ్వులు వినిపించాయా ? పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో యుమనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. భరించలేని నొప్పిని పంటి బిగువన భరిస్తూనే ఉంది యమున. కాసేపటికి నర్సుల వచ్చి ‘నీకు డబుల్ కంగ్రాట్స్’ అని చెప్పారు. కవలలు పుట్టారని, వాళ్లలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి అంటూ తీపి కబురు అందించారు. పిల్లలు లేరంటూ ఇన్నాళ్లు పడుతున్న వేదనంతా ఒక్కసారిగా దూదిపింజంలా ఎగిరిపోయినట్టు అనిపించింది యమనకి. గంటల గడుస్తున్న డాక్టర్లు పసి బిడ్డలను నాకు చూపించడం లేదు. ఏమైందంటూ నర్సులను అడిగితే ‘ నెలలలు నిండకుండానే ప్రసవం జరగం వల్ల ఇద్దరి ఆరోగ్యం బాగా లేదని, ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని చెప్పారు. కానీ నెల రోజుల తర్వాత యమున గుండె బద్దలయ్యే వార్త డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడక పోడంతో మగ శిశువు మరణించాడని తెలిపారు. అంతేకాదు ఆడ శిశువు సైతం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతోందంటూ చెప్పారు. నెల రోజుల వయస్సున్న చిన్నారి శరరీం నిండా వైద్య పరికరాలే అమర్చి ఉన్నాయి. ఊపిరి తీసుకునేందుకు బిడ్డ అవస్థలు పడుతోంది. 12 వారాల పాటు చికిత్స అందిస్తే బిడ్డ ప్రాణాలు నిలబడతాయని డాక్టర్లు చెప్పారు. దాని కోసం రూ. 6 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. కానీ అప్పటికే రెండు నెలలుగా ఆస్పత్రికి అయిన ఖర్చులతో మోహన్, యమునల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోయాయి. దీంతో కన్నీరు కార్చడం తప్ప యమునకు మరో దారి లేని స్థితిలో ఉండిపోయింది. వైద్యానికి చేతిలో చిల్లగవ్వ లేని పరిస్థితుల్లో కొండంత వేదనలో యుమన, మోహన్‌లు ఉండగా వారికి మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. యమున మోహన్ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వగలరు. సాయం చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేయండి -
చావుబతుకుల్లో నిరుపేద మహిళ.. సాయం చేయరూ!
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): నిరుపేద కుటుంబానికి చెందిన ఓ వివాహిత కొనూపిరితో కొట్టుమిట్టాడుతోంది. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన వడ్ల శ్యామల ఈ నెల 10న సదాశివనగర్ నుంచి ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపునకు వెళ్తుండగా అకస్మాత్తుగా బైక్‌పై నుంచి రోడ్డుపై పడడంతో తలకుబలమైన గాయం అయింది. (చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని..) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనమేరకు హైదరాబాద్‌లోని రెనోవా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు రూ.30లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు మందుల ఖర్చుకు రూ.30వేలు ఖర్చు అవుతుందని కుటుంబీకులు పేర్కొన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి బాధిత కుటుంబానిది. కూలి పని చేసుకునే వారికి ఇంత దయనీయ పరిస్థితి రావడంతో ఆందోళనకు గురవుతున్నారు. దాతలు స్పందించి ఆపన్నహస్తం అందించాలని శ్యామల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) గూగుల్ పే, ఫోన్ పే: (కుమార్) 8897507981, బ్యాంక్ అకౌంట్ నెంబర్: 37911331015 IFSC Code: SBIN0005073 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
చిట్టి తల్లికి పెద్ద కష్టం.. 5 నెలల పాపకు లివర్ ఇన్ఫెక్షన్
సాక్షి, కామారెడ్డి: పిల్లలు పుట్టారన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎక్కువ కాలం లేకుండా పోయింది. తొలి సొంతానంగా పుట్టిన కొడుకును వింత వ్యాధి పీడిస్తోంది. తర్వాత జన్మించిన కూతుర్ని అనారోగ్యం వేధిస్తోంది. తల్లి ఒడిలో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారికి పెద్ద కష్టం వచ్చి పడింది. అమ్మ పాలు తాగుతూ ఆడుకోవాల్సిన చిన్న వయస్సులోనే లివర్ ఇన్ఫెక్షన్ సోకింది. గతంలో రూ.7 లక్షలు అప్పు చేసి పాపకు ఆపరేషన్ చేయించారు తల్లిదండ్రులు. ప్రస్తుతం కాలేయ మార్పిడి కోసం రూ.25 లక్షలు అవసరమని వైద్యులు తెలపడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన శివలింగు సౌజన్య, నవీన్‌కు 2016లో వివాహం జరిగింది. వీరికి ఐదు నెలల క్రితం కూతురు నిక్షిత పుట్టింది. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్న పాప తర్వాత అనారోగ్యం బారిన పడింది. దీంతో వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూయించారు. ఫలితం లేకపోవడంతో చివరికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాపకు లివర్ ఇన్ఫెక్షన్ ఉందని పిత్తాశయం ట్యూబ్ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో రూ.7లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. నెల రోజులు బాగానే ఉన్నా తీవ్ర జ్వరం రావడంతో మళ్లీ హైదరాబాద్‌కు తీసుకెళ్లగా వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. పాపకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని సూచించారు. పాప ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆపరేషన్‌కు రూ.25లక్షలకు వరకు ఖర్చవుతుందని తెలపడంతో దంపతులు ప్రస్తుతం విలవిలలాడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సౌజన్య టీటీసీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్ ఉపాధ్యాయురాలిగా పని చేసి బాబు పుట్టగానే ఇంటి పట్టునే ఉంటుంది. నవీన్ బీఈడీ చేసి ఉద్యోగం రాకపోవడంతో ఉన్న ఎకరం పొలం సాగు చేసుకుంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పేదరికంలో ఉన్న తాము ఇప్పటికే అప్పులు చేసి చిన్నారికి ఆపరేషన్ చేయించామని.. ప్రస్తుతం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించడానికి దాతలు చేయూత అందించాలని కోరుతున్నారు. పాపకు లివర్ మారి్పడి కోసం తండ్రి నవీన్‌ను అన్ని పరీక్షలు చేశారు. ప్రస్తుతం నవీన్ లివర్‌ను తన పాపకు మారి్పడి చేయడానికి ఆపరేషన్ అవసరం. మంచానికే పరిమితమైన కొడుకు ఐదేళ్ల క్రితం వీరికి జన్మించిన కొడుకు విలోహిత్ సైతం అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. బాబు పుట్టిన కొద్ది రోజులకే కదలిక, ఏడుపు లేకపోవడంతో చాలా ఆ్రస్పతులు చూపెట్టి లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేకపోయింది. డౌన్ సిండ్రోమ్ వ్యాధి సోకడంతో రూ.ఐదు లక్షలకు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఆ బాబు మంచానికే పరిమితమయ్యాడు. తన తల్లిని తప్పా ఎవ్వరిని గుర్తుపట్టలేడు. ఫోన్ పే నంబర్: 9848793242 (సౌజన్య చెల్లి సంధ్యారాణి) బ్యాంక్ అకౌంట్ వివరాలు: శివలింగు సౌజన్య (పాప తల్లి) అకౌంట్ నంబర్: 49630100005080 ఐఎఫ్ఎస్సీ కోడ్: BARBOKAMARE ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు బోనకల్: ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సుగంధం మల్లికార్జునరావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను ఇంటర్ వరకు చదివించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పైచదువులకు వెళ్లలేదు. పెద్ద కుమారుడు వెంకటేష్ ఖమ్మంలోని ఓ సూపర్ మార్కెట్లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కుటుంబానికి ఆపద వచ్చి పడింది. తీవ్ర జ్వరంతో వెంకటేష్ బాధ పడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా రెండు కిడ్నీలు పని చేయడం లేదని, అవి ఉండాల్సిన దాని కంటే చిన్నవిగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వెంకటేష్ తల్లిదండ్రులు 6 నెలలుగా అనేక ఆస్పత్రులల్లో రూ.2 లక్షలు వరకు ఖర్చు చేశారు. మూడు రోజులకోసారి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లి గవ్వలేక రెక్కాడితే గానీ డొక్కాడని తల్లిదండ్రులు అందినకాడికి అప్పులు చేసి వైద్యం చేయించారు. ప్రస్తుతం వెంకటేష్ మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో దిక్కు తోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హస్తంకోసం ఎదురు చూస్తున్నారు. తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. దాతలు 70322 13517 నంబర్‌ను సంప్రదించి ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. -
అన్నార్తులకు అండగా..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెద్దహోటళ్లలో మిగిలిపోతున్న ఆహార పదార్థాలు రోజుకు దాదాపు 400 టన్నులు. వీటితో సహా చిన్న హోటళ్లు.. మెస్‌లు ఇతరత్రా ప్రాంతాల్లో వెరసి రోజుకు సగటున 1000 టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. వాటిని చెత్త కుప్పల్లో వేయడమో, బల్క్‌గార్బేజిలో కలిపి పంపడమో చేస్తున్నారు. మిగిలిపోతున్న ఈ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచితే..పాడవకముందే తగిన జాగ్రత్తలతో ఫ్రిజ్‌లలో నిల్వచేస్తే ఆకలితో ఉన్నవారికిఆలోచించిన ఓ ఎన్జీఓ సంస్థ ఇలాంటి ఆహారాన్ని భద్రపరిచేందుకు పది పెద్ద (530 లీటర్ల సామర్ధ్యం) ఫ్రిజ్‌లు కొనుగోలు చేయాలని భావించింది. జీహెచ్ఎంసీ సహకరిస్తే పది ప్రాంతాల్లో వాటిని ఉంచుతామని, ఫ్రిజ్‌ల రక్షణకు అవసరమైన షెల్టర్లను తాము నిర్మిస్తామని, ఫ్రిజ్‌ల నిర్వహణకు అవసరమైన స్థలమిచ్చి, విద్యుత్ చార్జీలు మాత్రం జీహెచ్ఎంసీ చెల్లించాల్సిందిగా కోరింది. హోటళ్ల వారే కాక పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్ల విందు సందర్భంగా మిగిలిపోయే ఆహార పదార్థాలు సైతం ఈ ఫ్రిజ్‌లలో ఉంచవచ్చు. తద్వారా ఎంతో ఆహారం వృథా కాకుండా ఉండటమే కాకుండా అన్నార్తుల ఆకలి తీరుస్తుందని భావించిన జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమిషనర్ హరిచందన ఈ ప్రతిపాదనను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. అందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు సంబంధించి ముందుకొచ్చిన ఎన్జీఓ సంస్థ ‘యాపిల్‌హోమ్’, జీహెచ్ఎంసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. ప్రస్తుతానికి పెద్దహోటళ్లున్న ప్రాంతాలను, ఆకలిగొన్నవారు ఎక్కువగా ఉండే పది ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసినట్లు హరిచందన తెలిపారు. ఎంపిక చేసిన పది ప్రాంతాలు.. 1. శిల్పారామం (ఎయిర్పోర్ట్ బస్టాండ్ ఎదుట) 2. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి 3. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్, జూబ్లీహిల్స్ 4. ట్రైడెంట్ (బిర్యానీస్ ఎదుట) 5.రత్నదీప్, మాదాపూర్ 6 ఈఎస్ఐ హాస్పిటల్ 7. నిలోఫర్ హాస్పిటల్ 8. చందానగర్ మెట్రోస్టేషన్ 9. ఇండో –అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 10. గచ్చిబౌలి సిగ్నల్ బిర్యానీస్ ఎవరైనా తినవచ్చు: హరిచందన,జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ ‘ఫీడ్ ది నీడ్’ పథకం పేరిట ఏర్పాటయ్యే ఈ కేంద్రాల్లోని ఆహారాన్ని యాచకులు, బీదలే కాక ఆకలితోఉన్న ఎవరైనా తినవవచ్చు. ఇంట్లో ఫ్రిజ్‌లోని ఆహారాన్ని ఎలా తీసుకుంటారో కావాల్సిన వారు అలా వెళ్లి తీసుకోవచ్చు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాక, యోగ్యమైన ఆహారమని గుర్తించాకే ఫ్రిజ్‌లో ఉంచుతాం. జీహెచ్ఎంసీ వైద్యాధికారులు ఆడపాదడపా ఆహారపదార్థాల్ని పరీక్షిస్తారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ‘యాపిల్ హోమ్’, జీహెచ్ఎంసీ లోగోలుంటాయి. క్రమేపీ మొబైల్ వాహనాలు కూడా అందుబాటులోకి తెచ్చి..ఎక్కడైనా ఎక్కువ ఆహార పదార్థాలున్నట్లు సమాచారమందిస్తే ఈ వాహనాలను అక్కడకు పంపి ఆహారం సేకరిస్తాం. సమాచారమిచ్చేవారి కోసం ఏదైనా ప్రత్యేక ఫోన్ నెంబర్ కానీ..జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్‌ను కానీ వినియోగించుకుంటాం. వాల్ ఆఫ్ కైండ్‌నెస్..లూ కేఫ్‌ల తరహాలో? ఆశయం, ఔదార్యం బాగానే ఉన్నప్పటికీ ఇది ఎంతమేరకు విజయవంతమవుతుంది.. దీని వెనుక మరో ఆలోచన లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఏడాది కిందట ‘వాల్ ఆఫ్ కైండ్‌నెస్’పేరిట ఎవరైనా తమ ఇంట్లోని తాము వాడని వస్తువులను వాల్ ఆఫ్ కైండ్‌నెస్ గోడల వద్ద వదిలి వెళ్లవచ్చునని పేర్కొంటూ అన్ని సర్కిళ్లలో పెయింటింగ్‌లు వేయించింది. ఇది కొంత విఫలమైంది. ఈ ప్రాంతాల్లోనే ఇప్పుడు ‘ఫుడ్ కోర్టులు’ ఏర్పాటు చేస్తారు. ఇక లగ్జరీ టాయ్‌లెట్లపేరిట లూకేఫ్ అనే ఏజెన్సీ ఏర్పాటు చేసిన పథకం కూడా విఫలమైందనే చెప్పొచ్చు. ఇప్పుడు ‘ఫీడ్ ది నీడ్ ’ ఏమవుతుందో వేచి చూడాలి. -
నాకు బతకాలని ఉంది!
ఒంగోలు (ప్రకాశం): ‘నాకు బతకాలని ఉంది.. కానీ నా పరిస్థితి దినదినగండంగా మారింది. ఏడాది నుంచి అనారోగ్యం నన్ను కబళించివేస్తుంటే.. చికిత్స చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక నా కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దయచేసి నన్ను ఆదుకోండి’ అంటూ స్థానిక జిల్లా జైలు ఎదురుగా ఉన్న సిరి ఈవెంట్స్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొహైల్ అనే బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... సొహైల్ తండ్రి మొయీన్ అహ్మద్ దంపతులకు ఇద్దరు సంతానం. రెండో సంతానమైన సొహైల్‌కు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంగానే ఉండేది. వైద్యులు పరీక్షించి పలు మందులు రాసేవారు. వాటిని వాడుతూ వచ్చారు. 9వ తరగతి వరకు పాఠశాలకు పంపారు. అనారోగ్యం కారణంగా వారంలో మూడురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లేది. ఆ తర్వాత మరింత నీరసిస్తుండటంతో బడి మాన్పించేశారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. టేబుల్ మీద కనిపించే బొమ్మలను తానే తయారుచేస్తూ తాను ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ నుంచి విముక్తి కోసం, భగవంతుడి కృప కోసం ఎదురుచూస్తోంది. తండ్రి చికెన్ పకోడీ బండి పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. సోదరుడు ఇప్పుడిప్పుడే వెబ్‌డిజైనింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలబడేందుకు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏడాది క్రితం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు వైద్యశాలలో సొహైల్‌కు చూపించగా, వైద్యులు సొహైల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అపోలో హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. దీంతో ఆమెకు స్కానింగ్ తీసి పరిశీలించిన అపోలో వైద్యులు.. గుండెకు మూడు రంధ్రాలున్నట్లు నిర్ధారించారు. పల్మనరీ హైపర్ టెన్షన్, వెంట్రిక్యులర్ సెప్టిన్ డిఫెక్ట్, యెజెనెమెంజర్స్ సిండ్రోమ్ అనే మూడు రకాల సమస్యలు ఆమె హృదయానికి ఉన్నాయని, ఆమె జీవించాలంటే గుండె మార్పిడి తప్పనిసరని తెలిపారు. ఆపరేషన్‌కు ముందు రూ.2 లక్షలు, ఆపరేషన్‌కు రూ.30 నుంచి 35 లక్షలు ఖర్చవుతాయని వెల్లడించారు. గుండెమార్పిడికి అవసరమైన ఆర్గాన్‌ను తెప్పించాలంటే ఫ్లైట్ చార్జీలు రూ.12 లక్షలు అవుతాయని పేర్కొన్నారు. మొత్తంగా దాదాపు రూ.50 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలని సొహైల్ కోరుతోంది. సొహైల్‌ను ఆదుకోవాలని భావించే వారు ఆమె సోదరుడైన ‘షేక్ అతికూర్, ఎస్బీఐ అకౌంట్ నంబర్ 20351379362, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0010311’కు నగదు జమచేయవచ్చు. పూర్తి వివరాల కోసం 99492 99089 నంబర్‌ను సంప్రదించవచ్చు. స్పందించిన సిరి ఈవెంట్స్... సొహైల్ విషయం తెలుసుకున్న ఒంగోలు సిరి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎం.శ్రీనివాసులు స్పందించారు. తాను ఇటీవల హీరో సంపూర్ణేష్‌బాబును కలిసి సొహైల్ వృత్తాంతాన్ని వివరించగా, ఒంగోలులో ఒక ఈవెంట్‌ను ఉచితంగా నిర్వహించి వచ్చే నగదును సొహైల్‌కు కేటాయించేందుకు ఆయన ముందుకు వచ్చారన్నారు. ఆగస్టు 26న రక్షాబంధన్ రోజున ఒంగోలులో సొహైల్ ఆపరేషన్ కోసం 57 మంది సినీ, బుల్లితెర కళాకారులతో జబర్దస్త్ నవ్వుల హరివిల్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ వైద్యులు కూడా సహకారం కోసం ముందుకొస్తారన్నారు. ప్రతిఒక్కరూ సొహైల్‌కు తోచిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు పట్టణాభివృద్ధి సమితి అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ తమ సమితి తరఫున తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామని పేర్కొన్నారు. -
ఆపన్నహస్తం కోసం...
సాక్షి, హైదరాబాద్: ఆ బాలుడికి చదువంటే అమితాసక్తి.. కష్టానష్టాలకోర్చి వసతి గృహంలో ఉండి విద్యనభ్యసించాడు. తన కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూసి, ఎంతో శ్రమించి ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 7జీపీఏతో ఉత్తీర్ణత సాధించాడు. అయితే భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న ఆ బాలుడికి తల్లి దూరమైంది. ఐదు రోజుల క్రితం తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో అనాథగా మారాడు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని ఉండ్రాజవరం మండలం తాడిపరువు గ్రామానికి చెందిన సత్యశ్రీ, నాగేశ్వర్రావు దంపతులు. వీరికి కుమారుడు నాగవంశీ(16). నాగవంశీ చిన్నగా ఉన్నప్పుడే నాగేశ్వర్రావు భార్యతో విడాకులు తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో సత్యశ్రీ కొడుకును తీసుకొని జీవనోపాధి కోసం నగరానికి వచ్చి కృష్ణానగర్‌లో అద్దెకు ఉంటోంది. జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ కొడుకును చదివిస్తోంది. అయితే కొడుకుకు ఫీజులు కట్టేందుకు సత్యశ్రీకి భారమైంది. ఇప్పుడు నాగవంశీని ఇంటర్ చదివించలేనేమోనని బెంగపెట్టుకుంది. ఓవైపు భర్త విడాకులు తీసుకోవడం, మరోవైపు స్నేహితుడి చేతిలో మోసపోవడం, ఇంటి అద్దెలు భారంగా మారడం, కొడుకు ఫీజులు బకాయిపడటం... ఆమెను కుంగదీశాయి. దీంతో ఈ నెల 14న సత్యశ్రీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ దూరమైన నాగవంశీ అనాథగా మారాడు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. చదివిస్తే ఉజ్వలంగా ప్రకాశించే సత్తా ఉన్న నాగవంశీకి ఇప్పుడు ఓ ఆసరా అవసరమైంది. మరికొద్ది రోజుల్లో ఇంటర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ బాలుడిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తే... నాగవంశీ జీవితంలో వెలుగులు నింపిన వారవుతారు. -
ఎంత కష్టమొచ్చే నర్సింహా...
అతడు స్టీరింగ్ తిప్పితేనే ఆ ఇంటి బండి నడుస్తుంది. వచ్చే కొద్ది సంపాదనతోనే భార్య, పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునే వ్యాన్ డ్రైవర్ నర్సింహారావుకు రెండు కిడ్నీలు చెడిపోగా.. ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఒకవైపు రోజు విడిచి రోజుకు డయాలసిస్ చేయించేందుకు డబ్బులు లేక.. మరోవైపు ఇళ్లు గడవక దాతల కోసం ఎదురు చూస్తోంది. ఖమ్మంఅర్బన్ : నగరంలోని గోపాలపురం కాల్వ కట్టపై నివాసం ఉంటూ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురుగుల నర్సింహారావుకు ముగ్గురు బిడ్డలు, భార్య ఉన్నారు. రెండు నెలలు క్రితం అతడికి కాళ్లు వాపులు రావడంతో డాక్టరు వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు నిర్దారించారు. నర్సింహారావుతో సహా కుటుంబ సభ్యులు పిడుగు లాంటి వార్త విని తట్టుకోలేకపోయారు. దుఖ:సాగరంలో మునిగిపోయారు. నర్సింహారావు వ్యాన్ నడిపితేనే ఇల్లు గడుస్తుంది. అతడు అనార్యోగం బారిన పడటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. నర్సింహారావుకు రోజు విడిచి రోజు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కిడ్నీలను మార్పిడి చేయాలి. చికిత్సకు, ఇల్లు గడవడానికి కుటుంబం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి నెలకొంది. నర్సింహారావు భార్య, అక్క తమ బంగారం అభరణాలు తాకట్టు పెట్టి నెల రోజులుగా రోజు డయాలసిస్ చేయిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్ ఆస్పత్రుల్లో సుమారు రూ. లక్షా 50 వేలపైగా ఖర్చు చేశారు. మందులకు నెలకు రూ. 10వేలు కన్న బిడ్డపై మమకారంతో నర్సింహారావుకు తల్లి వెంకటరావమ్మ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వైద్యులు అన్ని పరీక్షలు చేసి తల్లి కిడ్నీ సరిపోతుందని చెప్పారు. అయితే ఆపరేషన్ ఆరోగ్య శ్రీలో ఉచితంగానే చేస్తామని వైద్యులు వివరించారు. కాని ఆపరేషన్ తర్వాత మూడు నెలలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. అలాగే జీవితాంతం నెలకు సుమారు రూ.10 వేల విలువైన మందులను వాడాల్సి ఉంటుంది. అందుకు అయ్యే ఖర్చులు లేక కుటుంబ సభ్యులు దాతలకోసం ఎదురు చూస్తున్నారు. చావు బతుకుల మధ్య కొట్టు మిట్లాడుతున్న నర్సింహారావు.. అతడిపై ఆధారపడిన భార్యా పిల్లల బాధను అర్థం చేసుకొని దాతలు ఆదుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం అతడు మమత రోడ్డులో ఒక అపార్టు మెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న తన అక్క, బావ వద్ద ఉంటున్నాడు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9603443486 -
ప్రాణభిక్ష పెట్టండి
= అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు క్యాన్సర్ = చికిత్స చేయించుకోలేక నరకయాతన పడుతున్న తల్లిదండ్రులు = రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం = సాయం కోసం ఎదురుచూపులు తాళ్లూరు: రోజంతా కష్టపడితే కానీ కడుపు నింపుకోలేని బతుకులు వారివి. సాధారణ జబ్బులకే చికిత్స చేయించుకోలేని దుస్థితి వారిది. బిడ్డపై ఆశలన్నీ పెట్టుకుంటే విధి వారికి మరోవిధంగా పరీక్ష పెడుతుంది. బిడ్డకు క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలియడంతో ఆ తల్లిదండ్రుల కాళ్లు చేతులు ఆడడం లేదు. స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగంగవరం గ్రామపరిధిలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన ఏడుకొండలు, రమా దంపతులకు ఇద్దరు పిల్లలు. దంపతులు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ కూలీ డబ్బులతోనే పిల్లలను చదివిస్తుంటారు. వారిలో రమ్యకు ఎనిమిది సంవత్సరాలు. సంతోషంగా బాల్యాన్ని గడపాల్సిన రమ్య క్యాన్సర్ వ్యాధితో కొట్టుమిట్టాడుతోంది. బాలిక పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటివరకు రూ.2లక్షలు ఖర్చు...: రెండు నెలల కిందట రమ్య అకస్మాత్తుగా పాఠశాలలో పడిపోవటంతో చీమకుర్తిలోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ జ్వరం ఉందని గుర్తించి చికిత్స అందించారు. అయినా పాప హుషారుగా లేకపోవటంతో తల్లిదండ్రులు ఒంగోలులో ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. వారు రిమ్స్‌కు సిఫార్సు చేశారు. రిమ్స్ వైద్యులు పాపను పరీక్షించి క్యాన్సర్‌గా గుర్తించారు. దీంతో చెన్నై అడియార్ ఆçస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన తరువాత చిన్నారికి బ్లడ్, లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బంధువులకు విషయం తెలిపారు. ఇప్పటి వరకు రూ.2లక్షలు ఖర్చు చేశారు. ఇంకా లక్షలు ఖర్చు అవుతుందని తమకు అంత స్థోమత లేదని ఆవేదన చెందుతున్నారు. కలలో కూడా అంత మొత్తాన్ని ఊహించని తల్లిదండ్రులు సాయం కోసం ఆర్థిస్తున్నారు. దాతలు సాయం చేస్తే తమ బిడ్డ బతుకుతుందని ఆశగా ఉన్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు అకౌంట్ నంబర్ 11332809853, ఎస్బీఐ పొదిలి, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0000268, ఇతర వివరాలకు 91001 16807 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.