nellore court complex
-
నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో చోరీ కేసుకు సంబంధించి సుమోటో పిల్‌పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏస్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించిన తమకు అభ్యంతరం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు) -
తగిన సాక్ష్యాధారాలతోనే నిందితుల అరెస్టు
సాక్షి, అమరావతి: నెల్లూరు కోర్టులో దొంగతనం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే నిందితులను అరెస్టు చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. దీనిపై కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. మంగళవారం సచివాలయంలో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనితతో డీజీపీ రాజేంద్రనాథ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్, గంజాయి స్మగ్లింగ్ నివారణ, మహిళా భద్రత తదితర అంశాల్లో పోలీసు శాఖ చేపడుతున్న చర్యలను ఆమెకు వివరించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసుకు సంబంధించి కొందరు చేస్తున్న ఆరోపణలు వేరు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరని వ్యాఖ్యానించారు. దర్యాప్తులో నిగ్గుతేలిన వాస్తవాలు, ఆధారాల ఆధారంగానే కేసు కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారులతోనే ఈ కేసును దర్యాప్తు చేయిస్తున్నామని వివరించారు. దిశ యాప్‌ను ఇప్పటివరకు 1.24 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారని డీజీపీ తెలిపారు. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న మహిళల సమాచారం బహిర్గతం కాకుండా భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. దిశ యాప్‌ను వినియోగించి ఇప్పటివరకు 10,983 మంది మహిళలు పోలీస్ రక్షణ పొందారని చెప్పారు. -
ఆధారాల చోరీ ఘటనలో ఇద్దరు అదుపులోకి!?
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు కోర్టులో ఆధారాల అపహరణ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోర్టులో చోరీ జరగడం, అదీ ఓ కీలక కేసుకు సంబంధించిన ఆధారాలు దొం గిలించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయరంగు పులుముకున్న ఈ కేసును ఛేదించేం దుకు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కేసును విచారిస్తున్నారు. కోర్టు ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించి కీలకపత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ నుంచి దొంగిలించారు? తదితర వివరాలను ఆరా తీశారు. వివరాలివీ.. 2016 డిసెంబర్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరు 4వ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగింది. అనంతరం విజయవాడలో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టులో సాగుతోంది. అయితే, కేసు కు సంబంధించిన కీలక ఆధారాలు ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లు, నకిలీపత్రాలు, రబ్బర్‌స్టాంపులు తదితరాలన్నీ నెల్లూరు కోర్టులోనే ఉన్నాయి. తాళాలు పగులగొట్టి దొంగతనం బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన కీలక ఆధారాలున్న బ్యాగ్‌ను తస్కరించారు. బ్యాగ్‌తోపాటు కాగితాలను కోర్టు బయటపడేసి అందులో ఉన్న ట్యాబ్, ల్యాప్ టాప్, నాలుగు సెల్ఫోన్లు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్‌లను అపహరించుకు వెళ్లారు. దీంతో కోర్టు బెంచ్‌క్లర్క్ వి.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. నగర ఇన్చార్జ్ డీఎస్పీ వై. హరినా«థ్‌రెడ్డి నేతృత్వంలో చిన్నబజారు ఇన్స్పెక్టర్ వీరేంద్రబాబు దర్యాప్తు ప్రా రంభించారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. దీంతో కోర్టుకు వచ్చే రహదారులన్నింటిలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో.. గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గుర్తించారు. వారు ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు, పొర్లుకట్టకు చెందిన అతని స్నేహితుడని తేలడంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించి..చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండునెలల కిందట ఓ వృద్ధురాలిని కట్టేసి నగలు దొంగలించిన ఘటనలో పోలీసులు వీరిని అరెస్టు చేశారనీ, పదిరోజుల కిందటే వారు బయటకు వచ్చారని సమాచారం. -
తల్లీకూతుళ్ల హత్యకేసులో ఇంతియాజ్‌కు ఉరిశిక్ష
-
కర్ణాటక ఇంటలిజెన్స్ అధికారుల విచారణ
బాంబు పేలుడు స్థలం పరిశీలన నెల్లూరు(క్రైమ్) : కర్నాటక ఇంటలిజెన్స్ అధికారులు ఆదివారం నెల్లూరుకు వచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితులు పేలుడుకు ఎలాంటి పరికరాలను వినియోగించారు? పేలుడు తీవ్రత? తదితర వివారలను నాలుగో నగర పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఆవరణలో ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం బాంబు పేలుడు సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటలిజెన్స్, గుంటూరు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీస్ బందాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబేటరీస్ బందం సంఘటన స్థలంలో అవశేషాలను పరిశీలన నిమిత్తం తమ వెంట తీసుకెళ్లాయి. కాగా కేరళ రాష్ట్రం కొల్లాం, కర్నాటక రాష్ట్రం మైసూర్, చిత్తూరు జిల్లా కోర్టు ఆవరాణల్లో జరిగిన బాంబు పేళ్లులన్నీ ఒకే తరహాలో ఉన్నాయి. వాటి వెనుక అల్ ఉమ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందని సమాచారం. నెల్లూరు బాంబ్ పేలుడు ఘటన సైతం అదే సంస్థ చేసి ఉంటుందని దర్యాప్తు బందాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు, సంస్థ అనుబంధ సంఘాల వివరాల సేకరణ పనిలో దర్యాప్తు బందాలు నిమగ్నమయ్యాయి. తాజాగా ఆదివారం బెంగుళూరుకు చెందిన ఇంటలిజెన్స్ డీఎస్పీ ప్రవీణ్ నేతత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన బందం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. అనంతరం వారు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీని కలిసి పేలుడు ఘటనపై చర్చించి వెళ్లినట్లు సమాచారం. -
నిఘా వర్గాల దర్యాప్తు వేగవంతం
కోర్టు ఆవరణలో ఓ బాక్స్స్వాధీనం? అణువణువున తనిఖీలు నెల్లూరు (క్రైమ్) : కోర్టు ఆవరణలో బాంబు పేలుడు ఘటనపై కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. ఇప్పటికే ఇంటలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటలిజెన్స్ బృందాలు పేలుడుకు గురైన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు ఎలాంటి పరికరాలు, ఏయే పదార్థాలను వినియోగించారు తదితరాలపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. పేలుడు అనంతరం లభ్యమైన అవశేషాలను పరిశీలించారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ బృందం అవశేషాలన్నింటిని స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు, నెల్లూరు కోర్టు ఆవరణలో జరిగిన బాంబు పేలుడు ఒకే తరహాలో ఉండటంతో ఉగ్రవాద చర్యగా నిఘా వర్గాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే అంతటితోనే కాకుండా విభిన్న కోణాల్లో సైతం విచారణ సాగిస్తున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఎవరో కావాలనే భయాందోళనకు గురి చేసేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ క్షేత్రస్థాయిలో విచారణ చేసి పేలుడు వెనుక సూత్రధారులను కనుగొనే ప్రయత్నంలో జిల్లా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వారి కార్యకలాపాలు, అసాంఘిక శక్తులు తదితరాల వివరాల సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్నీ హోటల్స్, లాడ్జిలు, శివారు ప్రాంతాల్లోని గృహాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సోదాలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, అన్ని ప్రార్థనా మందిరాల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. ఇకపై ప్రతి రోజు బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన కోర్టు ఆవరణలో బుధవారం బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జిల్లా జడ్జి పరిశీలించారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు ఆవరణలోని రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఫ్లిప్‌కార్ట్ బాక్స్‌ను బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
నెల్లూరు బాంబు పేలుడు అల్ ఉమా పనే?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు అల్ ఉమా ఉగ్రవాద సంస్థ పనేనా? పోలీసు వర్గాల్లో ఈ అభిప్రాయం వినిపిస్తోంది. చిత్తూరు, కేరళలోని కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ప్రాంగణాల్లో ఇటీవలి కాలంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇది కొనసాగింపనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ను భయభ్రాంతులు చేయడానికే ఈ చర్యకు పాల్ప డి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చిత్తూరు, కొల్లం, పుదుచ్చేరి కోర్టుల ఆవరణాల్లో బాంబు పేలుళ్లు జరిగిన తీరు, అందులో వాడిన పేలుడు పదార్థాలు, వాటిని పేల్చిన తీరు గురించి ప్రత్యేక బృందం వివరాలు సేకరించింది. ఈ పేలుళ్లకు నెల్లూరు పేలుడుకు దగ్గరి పోలికలు ఉండటంతో ఈ విధ్వంసం కూడా అల్ఉమా ఉగ్రవాద సంస్థ పనే అయిఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. డీఎస్పీ, ఇద్దరు సీఐలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తు సాగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్, జాతీయ నేరపరిశోధన సంస్థలు రంగంలోకి దిగాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం మంగళవారం నెల్లూరుకు చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించింది. స్థానిక అధికారులతో సమావేశమై వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించింది. -
కోర్టు ఆవరణలో పేలుడు
-
కోర్టు ఆవరణలో పేలుడు
కోర్టు ఆవరణలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయం వద్ద జరిగింది. కోర్టు ప్రహరీ సమీపంలో ఉన్న చెత్తకుండీలో కుక్కర్ బాంబు పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అందరూ పరుగులు తీశారు. పేలుడు ధాటికి కోర్టు అద్దాలు కూడా పగిలాయి. అయితే అప్పటికే భోజన విరామ సమయం కావడం, న్యాయవాదులు అంతా బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు. క్యాంటీన్‌కు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సముదాయంలో ఐదు కోర్టులు ఉంటాయి. వీటిలో ఏదో ఒక కోర్టుకు తీసుకొచ్చే నిందితులను తప్పించడానికి ఇలాంటి ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే బాంబు పేలిన ప్రదేశం కోర్టుకు చాలా దూరంలో ఉండటం, బయట ఒక చెత్తకుండీలో పెట్టడంతో అసలు దీని టార్గెట్ ఏమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.