కర్ణాటక ఇంటలిజెన్స్ అధికారుల విచారణ
-
బాంబు పేలుడు స్థలం పరిశీలన
నెల్లూరు(క్రైమ్) : కర్నాటక ఇంటలిజెన్స్ అధికారులు ఆదివారం నెల్లూరుకు వచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలో బాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితులు పేలుడుకు ఎలాంటి పరికరాలను వినియోగించారు? పేలుడు తీవ్రత? తదితర వివారలను నాలుగో నగర పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కోర్టు ఆవరణలో ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం బాంబు పేలుడు సంఘటన జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటలిజెన్స్, గుంటూరు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీస్ బందాలు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబేటరీస్ బందం సంఘటన స్థలంలో అవశేషాలను పరిశీలన నిమిత్తం తమ వెంట తీసుకెళ్లాయి. కాగా కేరళ రాష్ట్రం కొల్లాం, కర్నాటక రాష్ట్రం మైసూర్, చిత్తూరు జిల్లా కోర్టు ఆవరాణల్లో జరిగిన బాంబు పేళ్లులన్నీ ఒకే తరహాలో ఉన్నాయి. వాటి వెనుక అల్ ఉమ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందని సమాచారం. నెల్లూరు బాంబ్ పేలుడు ఘటన సైతం అదే సంస్థ చేసి ఉంటుందని దర్యాప్తు బందాలు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు, సంస్థ అనుబంధ సంఘాల వివరాల సేకరణ పనిలో దర్యాప్తు బందాలు నిమగ్నమయ్యాయి. తాజాగా ఆదివారం బెంగుళూరుకు చెందిన ఇంటలిజెన్స్ డీఎస్పీ ప్రవీణ్ నేతత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన బందం సంఘటన స్థలాన్ని పరిశీలించింది. అనంతరం వారు జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీని కలిసి పేలుడు ఘటనపై చర్చించి వెళ్లినట్లు సమాచారం.