Network 18 Media & Investments
-
నెట్వర్క్18 మీడియా క్యూ3 వీక్.. 97 శాతం పతనం!
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 97 శాతం పతనమై రూ. 9 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 307 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 12 శాతం ఎగసి రూ. 1,850 కోట్లను అధిగమించింది. గతేడాది క్యూ3లో రూ. 1,657 కోట్ల ఆదాయం నమోదైంది. మొత్తం వ్యయాలు 45 శాతం పెరిగి రూ. 1,939 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 63 వద్ద ముగిసింది. చదవండి: స్విగ్గీ సంచలనం..డెలివరీ బాయ్స్‌కు, వారి కుటుంబ సభ్యులకు.. -
నష్టాల్లోకి నెట్వర్క్18 మీడియా
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో ఎంటర్టైన్మెంట్ రంగ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 29 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 199 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం బలపడి రూ. 1,549 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,387 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 34 శాతం ఎగసి రూ. 1,592 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ముగిసింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
అంబానీ చానెల్స్‌లో ‘సోనీ’కి వాటా...!
ముంబై: ముకేశ్ అంబానీకి చెందిన నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి నెట్వర్క్ 18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరకపోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ‘స్థానిక’ బలం కోసం సోనీ..... నెట్వర్క్18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనే విషయమై కూడా సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. నెట్వర్క్18లో వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్వర్క్18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది. ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్ తదితర పోటీ సంస్థలకు గట్టిపోటీనివ్వగలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్ కంటెంట్‌కు యాక్సెస్ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత, జపాన్ విభాగాలు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు. రెండేళ్లలో మరిన్ని భాగస్వామ్యాలు.... భారత ఓటీటీ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఏ అంతర్జాతీయ సంస్థయినా, ఇక్కడి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే స్థానిక వ్యూహం తప్పనిసరని నిపుణులంటున్నారు. రానున్న రెండేళ్లలో ఇలాంటి భాగస్వామ్యాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరిన్ని చోటు చేసుకుంటాయని వారంటున్నారు. సోనీ కంపెనీ భారత్‌తో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ద్వారా వివిధ చానెళ్లను నిర్వహిస్తోంది. ఇక టీవీ18 బ్రాడ్కాస్ట్ సంస్థ మొత్తం 56 చానెళ్లను (వార్తలు, వినోద విభాగాలు) నిర్వహిస్తోంది. ఈ వార్తలతో బీఎస్ఈలో ఇంట్రాడేలో నెట్వర్క్18 మీడియా షేర్ 19%, టీవీ18 బ్రాడ్కాస్ట్ షేర్ 10% మేర పెరిగాయి. చివరకు నెట్వర్క్18 షేర్ 8% లాభంతో రూ.27.70 వద్ద, టీవీ18 బ్రాడ్కాస్ట్ 1.5% లాభంతో రూ. 23 వద్ద ముగిశాయి. -
నెట్వర్క్18లో ఆర్ఐఎల్ వాటాల విక్రయం నేడు
న్యూఢిల్లీ : నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.10 శాతం వాటాలను బుధవారం విక్రయించనుంది. ఇందుకోసం షేరు కనీస ధరను రూ. 53.40గా నిర్ణయించింది. దీని ప్రకారం కనీసం రూ. 173.55 కోట్లు రాగలవని అంచనా. మంగళవారం బీఎస్ఈలో నెట్వర్క్18 షేరు ధర 2.40 శాతం తగ్గి రూ. 61.10 వద్ద ముగిసింది. -
నెట్వర్క్18లో
రిలయన్స్ షేర్ల విక్రయం ముంబై: నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 3.25 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. నిబంధనల ప్రకారం ప్రమోటరు, ప్రమోటర్ గ్రూప్ వాటాలను 75 శాతానికి తగ్గించుకునేందుకు, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 25 శాతానికి పెరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి అనుగుణంగా... నెట్వర్క్18లో 3.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నట్లు ప్రమోటర్ సంస్థ షినానో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఇది నెట్వర్క్18లో దాదాపు 3.1 శాతం వాటా కావటం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్‌కు షినానోలో 100 శాతం వాటాలు ఉన్నాయి. ఈ షినానో రిటైల్ సహా మరో కంపెనీ ద్వారానే రెండు విడతలుగా రామోజీరావుకు చెందిన ‘ఈనాడు’ గ్రూప్‌లో రిలయన్స్ సంస్థ దాదాపు రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.