నెట్‌వర్క్18లో
రిలయన్స్ షేర్ల విక్రయం
ముంబై: నెట్‌వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 3.25 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. నిబంధనల ప్రకారం ప్రమోటరు, ప్రమోటర్ గ్రూప్ వాటాలను 75 శాతానికి తగ్గించుకునేందుకు, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 25 శాతానికి పెరిగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
దీనికి అనుగుణంగా... నెట్‌వర్క్18లో 3.25 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయించనున్నట్లు ప్రమోటర్ సంస్థ షినానో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్లడించింది. ఇది నెట్‌వర్క్18లో దాదాపు 3.1 శాతం వాటా కావటం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్‌కు షినానోలో 100 శాతం వాటాలు ఉన్నాయి. ఈ షినానో రిటైల్ సహా మరో కంపెనీ ద్వారానే రెండు విడతలుగా రామోజీరావుకు చెందిన ‘ఈనాడు’ గ్రూప్‌లో రిలయన్స్ సంస్థ దాదాపు రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.