నెట్‌వర్క్18లో ఆర్‌ఐఎల్ వాటాల విక్రయం నేడు
న్యూఢిల్లీ : నెట్‌వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.10 శాతం వాటాలను బుధవారం విక్రయించనుంది. ఇందుకోసం షేరు కనీస ధరను రూ. 53.40గా నిర్ణయించింది. దీని ప్రకారం కనీసం రూ. 173.55 కోట్లు రాగలవని అంచనా. మంగళవారం బీఎస్‌ఈలో నెట్‌వర్క్18 షేరు ధర 2.40 శాతం తగ్గి రూ. 61.10 వద్ద ముగిసింది.