The new building
-
ఎలా కదిలేది..! కదిలించేది..!
సిటీబ్యూరో: జిల్లా పాలనలో అత్యంత కీలకమైన ప్రభుత్వ కార్యాలయం శిథిలమై ప్రమాదకరంగా మారింది. కొత్త భవనానికి ప్రభుత్వం సరిపడినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ కలెక్టరేట్ భవన సముదాయం పూర్తిగా శిథిలమైంది. ఇందులో ప్రస్తుతం తొమ్మిది ప్రభుత్వ శాఖలకు చెందిన 300 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ భవనం నిర్మాణానికి రూ.19.80 కోట్ల నిధులను గత ఏడాది నవంబర్‌లో విడుదల చేసింది. అయితే, జిల్లా కలెక్టరేట్లను ఇంటిగ్రేటేడ్ భవన సముదాయంగా నిర్మించుకుంటే పరిపాలన సులభమవుతుందని గతంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీందో కలెక్టరేట్‌తో సహా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా నాంపల్లిలోని పాత కలెక్టరేట్ భవనం స్థానంలోనే కొత్త భవన సముదాయం నిర్మించుకునేందుకు జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇది 18 అంతస్తులు ఉండేలా ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం తక్కువ నిధులు మంజూరు చేయటంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. రెండవ దశ నిధుల మంజూరుకు పట్టుదలతో అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నా.. ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ భవనంలోని తొమ్మిది ప్రభుత్వశాఖలను ఎక్కడి తరలించాలని మథనపడుతున్నారు. -
నేడు కోర్టు భవనం ప్రారంభం
కంటోన్మెంట్: సుమారు 140 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ కోర్టు ముచ్చటగా మూడోసారి నూతన భవనంలోకి మారబోతోంది. లక్షా పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదంతస్తులతో నిర్మించిన నూతన కోర్టు భవన సముదాయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభోత్సవం ఉంటుందని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మర్రి గోవర్ధన్‌రెడ్డి, టి.చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి బీఎస్.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రమేశ్ రంగనాథన్, చీఫ్ జడ్జి బాలయోగి, సికింద్రాబాద్ ఒకటో అదనపు చీఫ్ జడ్జి విష్ణుప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. మూడో భవనం బ్రిటిష్ జమానాలో కంటోన్మెంట్లో 1874లోనే సికింద్రాబాద్ మఫిసిల్ కోర్టు పేరిట సేవలు ప్రారంభమయ్యాయి. నాటి నుంచి 1913 వరకు ప్రస్తుత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ భవనంలోనే సికింద్రాబాద్ కోర్టు కొనసాగింది. 1913లో నూతన భవన సముదాయాన్ని నిర్మించడంతో కోర్టును తరలించి.. పాత భవనాన్ని కంటోన్మెంట్ పరిపాలనా కార్యాలయంగా మార్చారు. కాలక్రమేణా అందులో 14 కోర్టులు ఏర్పడ్డాయి. నానాటికీ రద్దీ అధికమవుతుండటంతో దీని స్థానం లో బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని తలచి 2014లో పాత కోర్టు భవనాన్ని కూల్చేశారు. ఈ మేరకు ఐదంతస్తులతో లక్షా పది వేల చదరపు అడుగుల్లో ప్రస్తుత కోర్టు భవన సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి కేవలం పది కోర్టులకు మాత్రమే సరిపోయేలా దీన్ని నిర్మిం చారు. త్వరలో మరో బ్లాకు నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో కోర్టులు కొనసాగేలా విస్తరించనున్నారు. -
టెండర్లతో సరి !
కుప్పం.. సీఎం నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఇక్కడ ప్రగతి పరుగు పెటాల్సి ఉండగా ఇందుకు పూర్తి భిన్నంగా పడకేసింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం మినహా ప్రగతి పట్టాలెక్కిన పాపాన పోవడం లేదు. ఇప్పటికే చాలా వరకు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు వాటిని కైవసం చేసుకున్నారు. బిల్లులు వస్తాయో రావోననే అనుమానంతో పనులు ప్రారంభించేందుకు తటపటాయిస్తున్నారు. కుప్పం: వుుఖ్యవుంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బిల్లుల భయం వెంటాడుతోంది. టెండర్లు కైవసం చేసుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుటికే రూ.350 కోట్లకు పైగా పనులకు టెండర్లు ముగిసినా ప్రారంభానికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. ఫలితంగా కుప్పం అభివృద్ధి పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారింది. నిధులు వుంజూరైనా... వుూడు నెలల క్రితం పంచాయుతీ రాజ్ పరిధిలోని 426 కిలో మీటర్లు, ఆర్ అండ్బి పరిధిలోని 470 కిలో మీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ. 269 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత పట్టణంలోని రోడ్లకు డివైడర్లు, లైటింగ్ ఏర్పాట్లు కోసం రూ.7.23 కోట్లు వుంజూరు చేసింది. ఐసీడీఎస్ నూతన భవన నిర్మాణానికి రూ.59 లక్షలు ఇచ్చింది. ఇలా నిధులు మంజూరయ్యాయో లేదో ప్రజాప్రతినిధులు పోటాపోటీగా భూమి పూజలు పూర్తిచేశారు. తర్వాత వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ఇరిగేషన్‌కు సంబంధించి గంగలవ్ము చెరువు, దళవాయుుకొత్తపల్లి, పిల్ల చెరువు వురమ్మతులకు రూ.5 కోట్లతో టెండర్లు పూర్తిచేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నడువుూరు చెరువు కాలువ తవ్వకాలదీ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లుల రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు ఇతర పనులు చేపట్టేందుకు జంకుతున ్నట్లు తెలిసింది. పెండింగ్‌లో బిల్లులు.. నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన టెండర్, నామినేటెడ్ ద్వారా జరిగిన పనులు పూర్తయినా బిల్లులు అందలేదు. నీరు చెట్టు ద్వారా చేపట్టిన పనులకు వూత్రమే డబ్బులు అందారుు. బుడ్డగాని చెరువు నుంచి రూ.40 లక్షల వ్యయుంతో చేపట్టిన కాలువ పనులు 80 శాతం పూర్తయినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఆపేశాడు. అక్ష్మీపురం చెరువులో రూ.40 వ్యయుంతో పనులది ఇదే పరిస్థితి. రాజనం చెరువు, కల్లివంక, నెర్నికుంట,చెరువుల కాలువ పనులు ఆగిపోయా యి. రైతులకు నష్టా పరిహారం చెల్లించపోవడంతో పను లు నిలిపేశారు. ఇలా నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. సోగడబల్ల, సింగసవుుద్రం చెరువులో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి అధికారులు పనులు చేయించాల్సి వస్తోంది. ప్రకటనలకే పరిమితం.. అభివృద్ధి పనులకు నిధుల మంజూరు ప్రక్రియ ప్రకటనలనే పరిమితమైందన్న విమర్శలున్నాయి. టెండర్లు కైవసం చేసుకుని పనులు చేయించిన కాంట్రాక్టర్లు బి ల్లుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండడం ఇందుకు నిదర్శనం. విషయుంపై ఇరిగేషన్ డీఈ నీలకంఠారెడ్డిని వివరణ కోరగా బుడ్డగా ని చెరువు కాలువ పనులు పూర్తి చేయుకపోవడంతో బి ల్లులు ఇవ్వలేదన్నారు. మిగిలిన కాలువపనులు రైతులకు పరిహారం చెల్లించని కారణంగా ఆగిపోయాన్నారు.