టెండర్లతో సరి ! | Even with the tender offer! | Sakshi
Sakshi News home page

టెండర్లతో సరి !

Published Wed, Oct 28 2015 2:15 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

Even with the tender offer!

కుప్పం.. సీఎం నియోజకవర్గం కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఇక్కడ ప్రగతి పరుగు పెటాల్సి ఉండగా ఇందుకు పూర్తి భిన్నంగా పడకేసింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం మినహా ప్రగతి పట్టాలెక్కిన పాపాన పోవడం లేదు. ఇప్పటికే చాలా వరకు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు వాటిని కైవసం చేసుకున్నారు. బిల్లులు వస్తాయో రావోననే అనుమానంతో పనులు ప్రారంభించేందుకు తటపటాయిస్తున్నారు.
 
కుప్పం:  వుుఖ్యవుంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బిల్లుల భయం వెంటాడుతోంది. టెండర్లు కైవసం చేసుకున్న కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుటికే రూ.350 కోట్లకు పైగా పనులకు టెండర్లు ముగిసినా ప్రారంభానికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. ఫలితంగా కుప్పం అభివృద్ధి పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారింది.
 
నిధులు వుంజూరైనా...
 వుూడు నెలల క్రితం పంచాయుతీ రాజ్ పరిధిలోని 426 కిలో మీటర్లు, ఆర్ అండ్‌బి పరిధిలోని 470 కిలో మీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి రూ. 269 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత పట్టణంలోని రోడ్లకు డివైడర్లు, లైటింగ్ ఏర్పాట్లు కోసం రూ.7.23 కోట్లు వుంజూరు చేసింది. ఐసీడీఎస్ నూతన భవన నిర్మాణానికి రూ.59 లక్షలు ఇచ్చింది. ఇలా నిధులు మంజూరయ్యాయో లేదో ప్రజాప్రతినిధులు పోటాపోటీగా భూమి పూజలు పూర్తిచేశారు. తర్వాత వాటి గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ఇరిగేషన్‌కు సంబంధించి గంగలవ్ము చెరువు, దళవాయుుకొత్తపల్లి, పిల్ల చెరువు వురమ్మతులకు రూ.5 కోట్లతో టెండర్లు పూర్తిచేసినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. నడువుూరు చెరువు కాలువ తవ్వకాలదీ ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లుల రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు ఇతర పనులు చేపట్టేందుకు జంకుతున ్నట్లు తెలిసింది.  

పెండింగ్‌లో బిల్లులు..
నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు జరిగిన టెండర్, నామినేటెడ్ ద్వారా జరిగిన పనులు పూర్తయినా బిల్లులు అందలేదు. నీరు చెట్టు ద్వారా చేపట్టిన పనులకు వూత్రమే డబ్బులు అందారుు.  బుడ్డగాని చెరువు నుంచి రూ.40 లక్షల వ్యయుంతో చేపట్టిన కాలువ పనులు 80 శాతం పూర్తయినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఆపేశాడు. అక్ష్మీపురం చెరువులో రూ.40  వ్యయుంతో పనులది ఇదే పరిస్థితి. రాజనం చెరువు, కల్లివంక, నెర్నికుంట,చెరువుల కాలువ పనులు ఆగిపోయా యి. రైతులకు నష్టా పరిహారం చెల్లించపోవడంతో పను లు నిలిపేశారు. ఇలా నియోజకవర్గంలో చేపట్టిన పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి. సోగడబల్ల, సింగసవుుద్రం చెరువులో పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి అధికారులు పనులు చేయించాల్సి వస్తోంది.

 ప్రకటనలకే పరిమితం..
 అభివృద్ధి పనులకు నిధుల మంజూరు ప్రక్రియ ప్రకటనలనే పరిమితమైందన్న విమర్శలున్నాయి. టెండర్లు కైవసం చేసుకుని పనులు చేయించిన కాంట్రాక్టర్లు బి ల్లుల కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండడం ఇందుకు నిదర్శనం. విషయుంపై ఇరిగేషన్ డీఈ నీలకంఠారెడ్డిని వివరణ కోరగా బుడ్డగా ని చెరువు కాలువ పనులు పూర్తి చేయుకపోవడంతో బి ల్లులు  ఇవ్వలేదన్నారు. మిగిలిన కాలువపనులు రైతులకు పరిహారం చెల్లించని కారణంగా ఆగిపోయాన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement