new drama
-
ఎమ్మెల్సీ రఘురాజు కొత్త డ్రామా..
-
కుప్పంలో కొత్త కుయుక్తులు
-
బాబు&కో కొత్త డ్రామా
-
ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు కొత్త డ్రామా
-
కత్తి శీనుతో కొత్త డ్రామా!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుతో మరో డ్రామాకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ‘మార్పు కోసం’ పేరుతో ఓ పుస్తకాన్ని రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రతిపక్ష నేతను అంతమొందించేందుకు పథకం వేసిన పెద్దలే తాజా నాటకానికీ సూత్రధారులనే ప్రచారం జరుగుతోంది. శ్రీనివాసరావు రాసినట్లుగా చెబుతున్న 11 పేజీల లేఖలో పేర్కొన్న అంశాలనే ఓ పుస్తకంగా ముద్రించి నిందితుడికి ప్రచారం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు తాను చెప్పదలుచుకున్న అంశాలను శ్రీనివాసరావు 22 పేజీల నోట్‌బుక్‌లో రాసినట్టు అతడి తరపు న్యాయవాది ఎ.సలీం ‘సాక్షి’కి తెలిపారు. దీన్ని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ మంత్రి, జైళ్ల శాఖ డీఐజీ, డీజీలకు లేఖ రాస్తానని చెప్పారు. పుస్తకం పేరుతో శ్రీనివాసరావు కాగితాలపై రాసిన విషయాన్ని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి తెలియజేస్తానని విశాఖ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేనిదే ఖైదీలు రాసిన పుస్తకం విడుదలకు వీలు కాదని స్పష్టం చేశారు. -
బాబుగారి కొత్త డ్రామా!
-
ఢిల్లీలో ధర్నా పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా
-రెండేళ్లకు మత్తు దిగిందా? -అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన, న్యాయాధికారుల సమస్యపై ఇప్పటిదాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నాడని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ లీగల్‌సెల్ చైర్మన్ సి.దామోదర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో వారు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయమూర్తులే రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే, న్యాయవాదులు ఆత్మబలిదానాలకు సిద్దపడుతుంటే సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు మత్తుదిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ ఇస్తే, కాంగ్రెస్ పార్టీ మెడలువంచి తెలంగాణ తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రెండేళ్ల నుంచి చిన్న హైకోర్టు విభజన కూడా ఎందుకు సాధించలేకపోయాడని పొన్నం ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష చేస్తానంటున్న కేసీఆర్ అదే డిమాండుతో ఉద్యమిస్తున్న న్యాయవాదులను ఎందుకు అరెస్టుచేశారని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు న్యాయవాదుల జేఏసీ తొత్తుగా మారిందన్నారు. న్యాయమూర్తులను సస్పెండ్ చేస్తే టీఆర్ఎస్ను న్యాయవాదులు ఎందుకు నిలదీయడం లేదని పొన్నం ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే జంతర్‌మంతర్ వద్ద దీక్షకు దిగి హైకోర్టు విభజన జరిగేదాకా హైదరాబాద్‌కు రావొద్దన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు గాజులు తొడుక్కున్నారా? ఢిల్లీలో ఏం చేస్తున్నారు?అని పొన్నం ప్రశ్నించారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ నెల 30న అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ధర్నా చేయాలని లీగల్‌సెల్ చైర్మన్ దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
బీజేపీ, ఎస్పీ కొత్త నాటకం: మాయావతి
లక్నో: వారణాసిలో నరేంద్ర మోడీ సభకు అనుమతి ఇవ్వకపోవడం, బీజేపీ ఆందోళన చేపట్టడం అంతా నాటకమని బహుజన సమాజ్‌వాది పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో బీజేపీ, సమాజ్‌వాది పార్టీ కొత్త కుట్రకు, నాటకానికి తెర తీశాయని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ మిగిలిన స్థానాల్లో విజయం సాధించేందుకు సమాజ్‌వాది పార్టీని బీజేపీ ప్రభావితం చేసిందని ఆరోపించారు. కులం, మతం కార్డు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో కొత్త నాటకం ఆడుతున్నాయని అన్నారు. యూపీలో 18 లోక్‌సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరగనుంది. ఇందులో మోడీ పోటీ చేస్తున్న వారణాసి, ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న అజాంగఢ్ స్థానాలున్నాయి. -
కాంగ్రెస్ కొత్త డ్రామా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంతో ఇరు ప్రాంతాల్లో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త డ్రామాకు రూపకల్పన చేస్తోంది. ఇరు ప్రాంత నేతలతో సయోధ్య పేరిట భేటీలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంగా మార్చిందన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అదే పార్టీ ఇరు ప్రాంతాల మధ్య రాజేసిన ఉద్రిక్తతలను అస్త్రంగా మల్చుకొని ప్రయోజనం పొందాలన్న ఎత్తుగడల్లో వెళ్లే ఆలోచన చేస్తోంది. మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు, ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు శుక్రవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో సమావేశమై ఈ అంశంపై ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకున్నా తమ పార్టీ వరకైనా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలందరూ ఒకే వేదికపైకి వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించాలని వారు నిర్ణయించారు. ప్రజల మధ్య విద్వేషాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలోనైనా పార్టీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే మంచిదని చర్చించారు. ‘రాష్ట్ర విభజనతో రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఎక్కడో ఒకచోట దీనికి చర్చలు ప్రారంభం కావాలి. ప్రక్రియ పూర్తికావాలంటే చర్చలు పెద్దల మధ్య సాగాలి’ అని ఏరాసు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు కొత్త డ్రామా: వాసిరెడ్డి పద్మ