
బీజేపీ, ఎస్పీ కొత్త నాటకం: మాయావతి
లక్నో: వారణాసిలో నరేంద్ర మోడీ సభకు అనుమతి ఇవ్వకపోవడం, బీజేపీ ఆందోళన చేపట్టడం అంతా నాటకమని బహుజన సమాజ్వాది పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో బీజేపీ, సమాజ్వాది పార్టీ కొత్త కుట్రకు, నాటకానికి తెర తీశాయని ఆమె అన్నారు.
ఉత్తరప్రదేశ్ మిగిలిన స్థానాల్లో విజయం సాధించేందుకు సమాజ్వాది పార్టీని బీజేపీ ప్రభావితం చేసిందని ఆరోపించారు. కులం, మతం కార్డు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో కొత్త నాటకం ఆడుతున్నాయని అన్నారు. యూపీలో 18 లోక్సభ స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరగనుంది. ఇందులో మోడీ పోటీ చేస్తున్న వారణాసి, ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్న అజాంగఢ్ స్థానాలున్నాయి.