new forms
-
ఎన్ఆర్ఐ, ఓసీఐల కోసం కొత్త ఫామ్స్.. సులభమైన ఆధార్ ఎన్రోల్మెంట్
ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలి. దీన్ని ఆన్లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ / అప్డేట్ ఫామ్‌లు యూఐడీఏఐ ఇప్పుడు విదేశీ భారతీయుల కోసం ఫామ్స్ ప్రవేశపెట్టింది. ఇందులో భారతదేశం చిరునామాగా ఉన్నవారికి, చిరునామా భారతదేశం వెలుపల ఉన్న వారికి, వయసును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకించి ఫామ్స్ ఉన్నాయి. ఫారమ్ 1 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 3 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. భారతదేశం వెలుపల చిరునామా కలిగిన వారి కోసం ఫామ్ 2, ఫామ్ 4 ప్రత్యేకంగా పరిచయం చేసారు. ఫారమ్ 2 అనేది 18 ఏళ్లు పైబడిన వారి కోసం.. ఫారం 4 అనేది 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను నమోదు చేసుకోవడానికి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు నమోదు చేసుకోవాలనుంటే.. ఫామ్ 5 (చిరునామా భారతదేశంలో ఉంటే), ఫామ్ 6 (చిరునామా భారతదేశం వెలుపల ఉంటే) ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్ల కోసం ఆధార్ ఫామ్‌లు నిజానికి ఇంతకుముందు భారతదేశంలోని విదేశీ పౌరులు ఆధార్ కార్డు పొందటానికి అర్హులు కాదు. ఆధార్ పౌరసత్వాన్ని ధృవీకరించదని ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత, ఆధార్‌కు అర్హులైన విదేశీ భారతీయుల వర్గాలకు OCIలను యాడ్ చేశారు. వీరు ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి క్యాలెండర్ ఇయర్లో కనీసం 182 రోజులు భారతదేశంలో ఉండడం తప్పనిసరి. 18 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులు ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం ఫామ్ 7ని ఉపయోగించాలి. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్నవారు ఫామ్ 8 ఉపయోగించుకోవాలి ఉంటుంది. ఆధార్ కార్డు అప్లై చేసుకున్న వారు సరైన ఇమెయిల్ అందించాలి. చెల్లుబాటు కానీ ఇమెయిల్ పేర్కొంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. UIDAI అంతర్జాతీయ నంబర్లను అనుమతివ్వదు, కాబట్టి భారతీయేతర ఫోన్ నంబర్‌ను అందించినట్లయితే మీ ఆధార్‌కు సంబంధించి SMS/టెక్స్ట్ నోటిఫికేషన్‌ను అందుకోలేరు. ఇవన్నీ నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియన్స్ గమనించాలి. -
చరిత్రకు మూలాధారం
భాష మానవ అస్తిత్వానికి మూలం. భావ వ్యక్తీకరణకే కాదు, బుద్ధి వికాసానికీ ఆలంబనగా నిలిచేది భాష మాత్రమే. చరిత్రగతిలో మార్పులు చెందుతూ కొత్తకొత్త రూపాలు సంతరించుకుంటుంది. భాష లిపిబద్ధమయ్యాక, ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తూ వచ్చింది. చరిత్రకు ఆధారంగా నిలుస్తున్న శాసనాలే అందుకు నిదర్శనాలు. శాసనాల చదువరులు ఇప్పుడు అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. నేటితరంలో అరుదైన శాసనాల చదువరి గండవరం వెంకటరత్నం. పురావస్తు సహాయక సంచాలకుడిగా శాసనాలపై పరిశోధన సాగించిన ఆయన, అత్యంత ప్రాచీనమైన లిపిని సైతం చదవగల నేర్పరి ఆయన. చరిత్రకు మూలాధారమైన శాసనాలపై ‘సిటీప్లస్’తో పలు విషయాలను ముచ్చటించారు. అవి ఆయన మాటల్లోనే.. ‘సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు.. ఈ ధర్మాన్ని నిర్వర్తించగలరు’.. శాసనాల్లో లిఖితమైన తొలి పదం ఇదే. ఆనాడే ధర్మాన్ని గురించిన ప్రస్తావన శాసనాల్లో ఉంది. తెలుగునాట కనిపించే మొట్టమొదటి శాసనం క్రీస్తుశకం 200 నాటిది. బ్రహ్మీలిపిలో ఉన్న ఆ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు తన దూతలను ఆంధ్ర దేశానికి పంపాడు. అశోకుడి నాటి శాసనాల ద్వారా ఈ విషయం తెలుస్తోంది. పూర్తిగా తెలుగులో రాసిన శాసనాలు మనకు క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి దొరుకుతున్నాయి. భాషలో, లిపిలో ప్రతి మూడు శతాబ్దాలకు మార్పు సహజం. చరిత్రకు మూలాధారాలు శాసనాలే. భారతదేశంలో అశోకుడి ముందు లిపి అంటే సింధు నాగరికత నాటి పిక్టోగ్రఫీ మాత్రమే. దీనినే పిట్టల లిపి లేదా బొమ్మల లిపిగా వ్యవహరిస్తారు. తర్వాత రాజరాజ నరేంద్రుడి తామ్రశాసనం పశ్చిమగోదావరి జిల్లా పాతగండిగూడెంలో లభించింది. దక్షిణ భారతదేశంలో దొరికిన తొలి తామ్రశాసనం ఇదే. హైదరాబాద్‌లో శాసనాలు.. శాసనాల్లో హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నగరానికి 30 కి.మీ దూరంలోని కీసరగుట్ట గుండురాతిపై పెద్ద అక్షరాలు తొలచబడి ఉన్నాయి. అది క్రీ.శ. 4వ శతాబ్దంలో పాలించిన విష్ణుకండినుల నాటిది. అక్కడ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నాటివిగా గుర్తించిన బొమ్మల లిపికి సంబంధించి 400 ముద్రలు లభ్యమయ్యాయి. వాటిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మూసీ ఒడ్డున చైతన్యపురి కాలనీలో పెద్దకొండరాతిపై క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటి శిలాశాసనం బయటపడింది. తొలిసారి 1986లో ఆ శాసనాన్ని కాపీ చేయించాను. అనుభవంతోనే సాధ్యం.. శాసనాలు చదవడం అనుభవంతోనే సాధ్యం. వేద పాఠశాలలో మూడు నుంచి పదో తరగతి వరకు సంస్కృతం చదువుకున్నాను. ఎస్వీయూలో సాహిత్య శిరోమణి, సంస్కృతంలోనే బీఈడీకి సమానమైన ‘శిక్షా శాస్త్రి’ పూర్తి చేశాను. తర్వాత కేంద్రీయ విద్యాపీఠంలో ఆచార్య కోర్సు, ఎంఏ సంస్కృతం, ఎంఏ ఆర్కియాలజీ చదువుకున్నాను. పురావస్తు శాఖలో 1985లో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి శాసనాల పరిశోధన మొదలైంది. శాసనాల పరిశోధనకు నేటితరం యువత ముందుకు రావాలి. చరిత్ర పరిశోధనలపై అభిలాష పెంచుకోవాలి. అందుకు ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. లేకుంటే, భవిష్యత్తులో శాసనాలు చదివేవారే కరువైపోతారు. ‘ఎపిగ్రఫీ’ పూర్తిగా భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించిన అంశం. ఇదివరకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా పనిచేసిన చెల్లప్ప ఈ అంశంలో కొంతవరకు దీని అభివృద్ధి కోసం కృషి చేశారు. తర్వాత పట్టించుకున్న వారే లేరు. తెలుగు వర్సిటీ, భాషా సాంస్కృతిక శాఖలు ముందుకొచ్చి కృషిచేస్తే, శాసనాలను చదవగలవారు తయారవుతారు. సుధాకర్ ఫొటోలు: కె. రమేష్ బాబు