new ordinance
-
దేవాలయాలకు మహర్దశ
-
మత మార్పిడుల నియంత్రణకు ఆర్డినెన్స్
బెంగళూరు: మత మార్పిడుల నిరోధక బిల్లుకు శాసన మండలి మద్దతు లభించకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుంది. రాష్ట్రంలో మత మార్పిడులను అరికట్టడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకురావాలని కర్ణాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ గత ఏడాది డిసెంబర్లో కర్ణాటక అసెంబ్లీలో ఆమోదం పొందింది. శాసన మండలిలో మాత్రం ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో ఉండిపోయింది. మండలిలో అధికార బీజేపీకి తగిన మెజార్టీ లేకపోవడమే ఇందుకు కారణం. బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేకపోవడంతో బీజేపీ ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయానికొచ్చింది. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంత్రి జె.సి.మధుస్వామి స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల బెంగళూరు ఆర్చిబిషప్ పీటర్ మచాడో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేయొద్దంటూ కర్ణాటక గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు. ఆర్డినెన్స్ ఆలోచన చాలా బాధాకరమని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. ‘కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్లు’ను అసెంబ్లీలో క్రైస్తవ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. -
పాక్‌లో రేప్ చేస్తే మగతనం మటాష్!
ఇస్లామాబాద్: రేపిస్టులకు కెమికల్ కాస్ట్రేషన్ (రసాయనాల ద్వారా పుంసత్వాన్ని దెబ్బతీయడం) చేయడం, రేప్‌ల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం కోసం పాక్ ప్రభుత్వం రెండు కొత్త ఆర్డినెన్సులు తీసుకువచ్చింది. ఈ చట్టాలను కేబినెట్ మరోమారు పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. కొత్త చట్టాల ప్రకారం అన్ని వయసుల స్త్రీలను మహిళగా నిర్వచిస్తారు. ప్రస్తుత చట్టం ప్రకారం 15ఏళ్లలోపు స్త్రీలతో సంభోగాన్ని మాత్రమే రేప్‌గా పరిగణిస్తారు. అలాగే రేప్‌కు విధించే కెమికల్ కాస్ట్రేషన్ ప్రభావం కేసు స్వభావాన్ని అంటే తొలిసారి నేరం చేశారా లేక పదేపదే ఇలాంటి నేరాలు చేస్తున్నారా అనే విషయాన్ని బట్టి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రేప్‌కేసులకు ప్రత్యేక కోర్టులతో పాటు యాంటీ రేప్ సెల్స్‌ను కూడా ఏర్పరుస్తారు. అలాగే మహిళల కన్యత్వాన్ని పరీక్షించేందుకు చేసే టూ ఫింగర్ టెస్ట్‌ను నిషేధిస్తారు. -
ఒకే దేశం.. ఒకే మార్కెట్
న్యూఢిల్లీ: రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత వ్యవసాయ మార్కెట్లలోనే కాకుండా.. దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పించే ‘ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్, 2020’కి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘ఒకే దేశం.. ఒకే వ్యవసాయ మార్కెట్(వన్ నేషన్..వన్ అగ్రి మార్కెట్)’ దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని పేర్కొంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. మార్కెట్లకు వెలుపల తమ దిగుబడులను అమ్మితే రైతులపై రాష్ట్రాలు ఎలాంటి పన్ను విధించవద్దు. రైతులు తాము కోరుకున్న ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఈ విషయంలో తలెత్తిన వివాదాలను సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, కలెక్టర్ నెల రోజుల్లోగా పరిష్కరించాలి. ఈ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి రావు. ప్రస్తుతం రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ– ఏపీఎంసీ)ల్లోనే తమ ఉత్పత్తులను అమ్ముతున్నారు. ఈ మార్కెట్లకు వెలుపల అమ్మాలనుకుంటే వారిపై పలు ఆంక్షలు ఉంటాయి. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడిస్తూ.. ఏపీఎంసీలు యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రాల ఏపీఎంసీ చట్టాలు కూడా కొనసాగుతాయన్నారు. మండీలకు వెలుపల కూడా రైతులు తమ ఉత్పత్తులను అమ్మే అవకాశం కల్పించి, వారికి అదనపు ఆదాయం అందించాలన్నదే ఈ ఆర్డినెన్స్ ఉద్దేశమన్నారు. ‘ఈ ఆర్డినెన్స్ ద్వారా రైతులు నేరుగా తమ ఇళ్ల నుంచే ఆహార సంస్థలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, రైతు సహకార సంస్థలకు తాము కోరుకున్న ధరకు తమ పంటలను అమ్మవచ్చు’ అని వివరించారు. దీనిపై ఎలాంటి నియంత్రణలు ఉండబోవన్నారు. ‘ఈ – ట్రేడింగ్’కు కూడా అవకాశం ఉందన్నారు. వీటిపై నియంత్రణ ఉండదు 65 ఏళ్ల నాటి నిత్యావసర వస్తువుల(ఎసెన్షియల్ కమాడిటీస్– ఈసీ) చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ చట్ట నియంత్రణ పరిధిలో నుంచి నిత్యావసరాలైన పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలను తప్పించేందుకు ఆ సవరణను ప్రతిపాదించారు. ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం.. యుద్ధం, జాతీయ విపత్తు, కరువు, ధరల్లో అనూహ్య పెరుగుదల వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆయా ఆహార పదార్థాలు ఈసీ చట్ట నియంత్రణలో ఉంటాయి. మిగతా సమయాల్లో వాటి ఉత్పత్తి, నిల్వ, సరఫరాలపై ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ప్రాసెసింగ్ చేసేవారు, సరఫరా వ్యవస్థలో ఉన్నవారిపై ఆయా ఆహార ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి నిల్వ పరిమితి ఉండదు. రైతుల ఆదాయ పెంపు నిర్ణయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆహార ఉత్పత్తులను దిగుబడి చేసుకునే, నిలువ చేసుకునే, పంపిణీ చేసుకునే హక్కు లభించడంతో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రైవేట్ సంస్థలకు ఆసక్తి పెరిగే అవకాశముందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తాయని పేర్కొంది. కోల్‌కతా పోర్ట్ ఇక శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం కోల్‌కతా నౌకాశ్రయం పేరును శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కోల్‌కతా నౌకాశ్రయానికి జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెడ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఫిబ్రవరి 25న భేటీ అయి పేరు మార్పును ప్రతిపాదిస్తూ ఒక తీర్మనాన్ని ఆమోదించారు. కోల్‌కతా పోర్ట్ భారత్‌లోని ఏకైక నదీముఖ నౌకాశ్రయం. 1870 నుంచి కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. రైతులకు మేలు: మోదీ వ్యవసాయ సంస్కరణలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ భారతం, ముఖ్యంగా రైతులపై గణనీయ సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలపై ఆంక్షలను తొలగించాలని రైతులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని, ఆ డిమాండ్‌ను తాము నెరవేర్చామని తెలిపారు. -
ప్రలోభపెట్టే అభ్యర్థులకు ఇది షాకే!
సాక్షి, అమరావతి : గ్రామ పంచాయతీ, ఇతర పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే అభ్యర్థులకు ఇది షాకే! ఏ రకంగానైనా వారు ఈ చర్యలకు పాల్పడి.. ఆ తర్వాత అది రుజువైతే వారు గెలిచినా ఆయా పదవుల్లో కొనసాగటానికి వీల్లేకుండా అనర్హులుగా పరిగణించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలే ప్రధాన అంశంగా ఏపీ పంచాయతీరాజ్ చట్టానికి పలు సవరణలు చేస్తూ ఇటీవలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం గురువారం ఈ ఆర్డినెన్స్ రూపంలో ఉత్తర్వులు వెలువరించింది. పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించటానికి, సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించటానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994’కు సవరణలను ప్రతిపాదిస్తూ ఆ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటానికి, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నిరోధించటానికి, మద్యం పంపిణీని అరికట్టాలని సర్కారు సంకల్పించింది. ప్రస్తుతం ఎంతో సుదీర్ఘంగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కాలపరిమితిని తగ్గించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించిన రోజు నుంచి 18 రోజుల్లో.. గ్రామ పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లో పూర్తిచేయాలని నిర్ణయించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణలో సర్పంచ్‌లకు పూర్తి అధికారాలను కల్పించారు. సర్పంచ్ సంబంధిత గ్రామంలోనే నివసించాలని.. పంచాయతీ కార్యాలయానికి క్రమం తప్పకుండా హాజరుకావాలని నిబంధన విధించారు. వంద శాతం గిరిజన జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ సహా వార్డు సభ్యుల పదవులన్నీ గిరిజనులకు రిజర్వు చేస్తూ నిబంధనను తీసుకొచ్చింది. గ్రామసభలను నిర్వహించటంలో సర్పంచ్ విఫలమైనా.. గ్రామ పంచాయతీ అకౌంట్లను సకాలంలో ఆడిట్ చేయించకపోయినా సర్పంచ్, ఉపసర్పంచ్‌లను తొలగించే వీలు కల్పించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓటర్లను ప్రలోభపరచటం, ఎన్నికల ప్రక్రియలో వారిని పాల్గొనకుండా చేయటం వంటి నేరాలకు అభ్యర్థులు పాల్పడినట్లు తేలితే వారికి మూడేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి వరకు జరిమానా విధిస్తూ చట్టంలో మార్పులు చేశారు.అధికారుల అలసత్వం లేదా విధి నిర్వహణలో లోపాలుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. -
రాజస్థాన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేరారోపిత ప్రజా సేవకులు, న్యాయమూర్తులకు రక్షణ కల్పించే చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాజే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 180 రోజులపాటు వారిని విచారణ చేపట్టే హక్కు ఎవరికీ ఉండదని కొత్త చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ క్రిమినల్ చట్టం 2017కి సవరణ ద్వారా సెప్టెంబర్ 7న ఓ ఆర్డినెన్స్ రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానికి ఆమోదం తెలుపుతూ రాజస్థాన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ‘‘ అవినీతితోపాటు వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న న్యాయమూర్తులు(మాజీ అయినా సరే), ప్రజా సేవకులపై ఆయా అభియోగాలు నమోదయినప్పుడు.. వారిని విచారణ చేపట్టేందుకు వీల్లేదు. ఈ మేరకు న్యాయమూర్తిసహా ఎవరికీ కూడా విచారణకు ఆదేశించే హక్కు లేదు. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు 6 నెలలపాటు ఉపశమనం ఉంటుంది’’ అని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. అదే సమయంలో ఆయా అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ ఏ రూపంలో అయినా కథనాలు ప్రచురించటానికి వీల్లేదంటూ మీడియాపై ఆంక్షలు కూడా విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతోపాటు రెండేళ్ల జైలు శిక్ష తప్పదని చట్టంలో హెచ్చరించింది. కాగా, ఇలాంటి చట్టం ఒకటి రూపకల్పన అవుతోందని తెలిసినప్పటి నుంచే రాజే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆరు నెలలో కేసును తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉంటాయని.. ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులకు లాభం చేకూర్చేలా ఉన్న ఈ చట్టం సరికాదంటూ వసుంధరా రాజేపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. -
కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వండి
- భూ సేకరణాధికారికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సేకరించిన ఆస్తులకు గాను వాటి యజమానులకు గతేడాది జనవరి 1 నాటికి నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలని భూసేకరణాధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే, తాజా పరిహార నిర్ణయం ఇప్పటికే చేపట్టిన ఆస్తుల స్వాధీన ప్రక్రియకు ఎంత మాత్రం అడ్డుకాదని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు గత వారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీ అందుకున్న నాలుగు వారాల్లో ఆస్తులను ఖాళీచేసి, అధికారులకు స్వాధీనం చేయాలని పిటిషనర్లను కూడా న్యాయమూర్తి ఆదేశించారు. బాధితులు ఎప్పుడు ఆశ్రయిస్తే అప్పుడు కొత్త చట్టం ప్రకారం పరిహారాన్ని చెల్లించాలని భూసేకరణాధికారికి స్పష్టం చేశారు. గతేడాది జనవరి 1న కొత్త భూ సేకరణ చట్టం అమల్లోకి వస్తే, అధికారులు పాత భూ సేకరణ చట్టం కింద పరిహారాన్ని నిర్ణయించారని, కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కొందరు యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో నాంపల్లిలో మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి, ఆ ప్రాంతంలో భూ సేకరణ చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం హైదరాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో 20 ప్రైవేటు ఆస్తులను సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఆస్తుల సేకరణపై వాటి యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని తోసిపుచ్చిన జిల్లా కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తరువాత పరిహారాన్ని ఖరారు చేశారు. నాంపల్లి వద్ద మెట్రో రైల్ అలైన్‌మెంట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రెస్‌నోట్ ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి రాలేదని న్యాయమూర్తి చెప్పారు. నాంపల్లిలో రోడ్డు విస్తరణ అవసరమా..? కాదా..? అన్న విషయాన్ని కోర్టు తేల్చదని, ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. తమ ముందున్నది పరిహారం చెల్లింపు అంశమేనంటూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
భూసేకరణ చట్టంలో కొత్త సవరణలో కేంద్రం అర్డినెన్స్
-
కనిపిస్తే ఉన్నట్లేనా !
దెయ్యాలు లేవన్నది నిజమైతే... మనిషికి ఇంకా వాటిపట్ల భయమెందుకుంది? దెయ్యాలు ఉండేది నిజమే అయితే... వాటి ఉనికి ఇంకా ప్రశ్నార్థకంగానే ఎందుకుంది? వీటికి కచ్చితమైన సమాధానాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ... దెయ్యాలు ఉన్నాయనడానికి చరిత్రలో పేజీలకు పేజీలు కథనాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పటికీ దెయ్యం ఉనికి పట్ల సందేహాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. అందుకే లలోరీ హౌస్‌లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా లేవా అన్నది ఇప్పటికీ తేలలేదు. ఇంతకీ లలోరీ హౌస్ ఎక్కడుంది? దాని వెనుక ఉన్న కథేంటి? న్యూ ఆర్లియన్స్, అమెరికా. టెన్షన్‌గా ఉన్నాడు డేవిస్. కోపంగా కూడా ఉన్నాడు. రోజూ రాత్రి తన ఫర్నిచర్ షాపు కట్టేసి వెళ్లిపోగానే ఎవరో లోపల దూరుతున్నారు. రోజుకో వస్తువు చెల్లాచెదురు చేస్తున్నారు. మొదట ఏదో దొంగలముఠా పని అయి ఉంటుందనుకున్నాడు. కానీ ఏ వస్తువూ పోవడం లేదు. పైగా వెళ్లేటప్పుడు తాళం పెట్టి పోతున్నారు. అంటే కచ్చితంగా తన షాపులో పని చేసేవాళ్ల పనే అయి ఉంటారని అర్థమైంది. ఎలాగైనా ఆరోజు వారి ఆట కట్టించాలని నిర్ణయించుకున్నాడు డేవిస్. రాత్రయ్యాక అందరినీ పంపించేశాడు. తర్వాత తన ఇంట్లో పనిచేసే వాళ్లను రమ్మని చెప్పి, తనని లోపలుంచి బయట తాళం పెట్టి, ఎక్కడైనా కనబడకుండా నిలబడమన్నాడు. విజిల్ ఊదుతానని, అప్పుడు వచ్చి వాళ్లని పట్టుకోవాలని చెప్పాడు. వాళ్లు సరేనని చెప్పి, తాళం పెట్టిపోయారు,లైట్లన్నీ ఆర్పేసి, తలుపు పక్కన ఉన్న చిన్న బెడ్‌లైట్ లాంటిది మాత్రం వేసి, ఓ మూలన నక్కాడు డేవిస్. క్షణాలు... నిమిషాలు... గంటలు గడిచాయి. సమయం పన్నెండు గంటలయ్యింది. తలుపు దగ్గర ఏదో చప్పుడు. వచ్చేది ఎవరా అని తలుపు వైపే చూస్తున్నాడు డేవిస్. ఓ వ్యక్తి లోనికి ప్రవేశించాడు. అతణ్ని చూస్తూనే కెవ్వున కేక పెట్టబోయి తమాయించుకున్నాడు డేవిస్. ఎందుకంటే, అతడికి రెండు చేతులూ లేవు. అంతలోనే ఓ స్త్రీ వచ్చింది. ఆమెను చూడగానే అదిరిపడ్డాడు. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుందా స్త్రీ. ముఖం తెల్లగా పిండి పూసినట్టుగా ఉంది. కళ్లు ఎర్రగా రక్తమోడుతున్నట్టుగా ఉన్నాయి. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చాడు. అతడికసలు తలే లేదు. మొండెమే నడచుకుంటూ వస్తోంది. వాళ్లంతా తలుపు తీసుకుని రావడం లేదు. తలుపులోంచి దూసుకొస్తున్నారు. పై ప్రాణాలు పైనే పోయాయి డేవిస్‌కి. వణుకుతున్న చేతులతో విజిల్‌ని నోటిలో పెట్టుకున్నాడు. దాన్ని ఊదుతూనే కళ్లు తిరిగి పడిపోయాడు. మెలకువ వచ్చేసరికి తన ఇంట్లో ఉన్నాడు డేవిస్. అందరూ తనవైపే విచిత్రంగా ఉండటం చూసి ఏమైందో అర్థం కాలేదతడికి. రాత్రి విజిల్ వినిపించి తలుపు తీసుకుని లోనికి వచ్చామని, స్పృహ తప్పిన తనని ఇంటికి తీసుకొచ్చామని పనివాళ్లు చెప్పాడు. అప్పుడుగానీ రాత్రి జరిగింది గుర్తు రాలేదు. భయంతో గుండె దడదడలాడింది. అంతే... వారం తిరిగేలోపు షాపుని అమ్మేశాడు. అసలు డేవిస్ చూసింది ఎవరిని? ఆ వింత రూపాలు అక్కడికెలా వచ్చాయి? వీటికి సమాధానాలు తెలియాలంటే 1832వ సంవత్సరానికి వెళ్లాలి. లలోరీ హౌస్... అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో ఉన్న ఈ భవనం గురించి తెలియనివాళ్లు లేరు. 1832లో ఓ రోజు... డాక్టర్ లూయిస్ లలోరీ తన భార్య డెల్ఫైన్ని, పిల్లల్ని తీసుకుని క్రియోల్లోని ఓ మ్యాన్షన్‌కి వచ్చాడు. అప్పట్నుంచీ అందరూ దాన్ని లలోరీ హౌస్ అని పిలవడం మొదలుపెట్టారు. డాక్టర్ లూయిస్ నెమ్మదస్తుడు. తన పనేంటో తాను చేసుకుపోయేవాడు. అయితే అతడి భార్య డెల్ఫైన్ అలా కాదు. ఎప్పుడూ సందడిగా ఉండేది. అందరినీ పలకరిస్తూ, సరదాగా ఉండేది. అందుకే అందరూ ఆమె పరిచయం కోసం ఉవ్విళ్లూరేవారు. అంతగా ఆమె ఫేమస్ అయిపోయింది. అయితే డెల్ఫైన్లో మరో మనిషి ఉందని ఎవరికీ తెలియదు. ఆ మరో మనిషి ఎలాంటిదో తెలిశాక... ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఓ రోజు లలోరీ హౌస్‌కి పక్క భవనంలో నివాసముంటోన్న ఓ మహిళ... తన ఇంటి మేడ మెట్లెక్కుతోంది. అంతలో లలోరీ హౌస్ నుంచి చిన్నపిల్ల ఆర్తనాదం వినిపించింది. కంగారు పడిన ఆ మహిళ అటు చూసింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకైంది. డెల్ఫైన్ ఓ పిల్లని తరుముతోంది. తను ఏడుస్తూ పరిగెత్తుతోంది. పరుగెత్తి పరుగెత్తి మేడమీదికి చేరింది. ఇక ఎటు పోవాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడింది. ఆ పిల్ల దగ్గరకు వచ్చింది డెల్ఫైన్. వికృతంగా నవ్వి, పాపను మేడమీది నుంచి తోసేసింది. తర్వాత పనివాళ్లు ఆ పిల్ల శవాన్ని ఇంటి వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లి కాల్చేయడం చూసి నిలువెల్లా వణికిపోయిందామె. తన ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. కన్ను మూసి తెరిచేలోగా విషయం అంతటా పాకిపోయింది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకున్నారు. అంతలోనే ఓ రోజు లలోరీ హౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వంటగది నుంచి మంటలు చెలరేగడంతో హాహాకారాలు మొదలయ్యాయి. ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్లంతా ఇంటిముందు గుమిగూడారు. పోలీసులు సైతం చేరుకున్నారు. మెయిన్ గేటు మూసి ఉండటంతో తీయమంటూ కేకలు వేశారు. కానీ లోపలి నుంచి ఎవరూ రాలేదు. కాసేపటి తర్వాత ఓ నల్లటి వాహనం లోపలి నుంచి దూసుకొచ్చింది. గేటు విరిగిపడేంత వాయువేగంతో వెళ్లిపోయింది. క్షణాల్లో కనుమరుగయ్యింది. పోలీసులు లోనికెళ్లారు. ఎవరైనా ఉంటే పట్టుకోవాలని వెతికారు. లోపల చాలామంది ఉన్నారు. అయితే వాళ్లు లలోరీ కుటుంబానికి చెందినవారు కాదు. వారి చేతుల్లో చిత్రహింసలకు గురై, చావలేక బతకలేక మిగిలున్న జీవచ్ఛవాలు. కొందరికీ కాళ్లూ చేతులూ లేవు. కొందరికి కళ్లు లేవు. కొందరికి నాలుకలు, ఇంకొందరికి మర్మాంగాలు కోసేశారు. గోళ్లు పీకేశారు. ఒంటి నిండా వాతలు పెట్టారు. ఓ మహిళ పరిస్థితి చూసి పోలీసులు సైతం షాక్ తిన్నారు. అతి చిన్న చెక్కపెట్టెలో బలవంతంగా ఆమె శరీరాన్ని కుక్కారు. దాంతో ఆమె ఎముకలు ఫెళఫెళ విరిగిపోయాయి. చాలాకాలం పాటు కదలకుండా అలానే ఉండటంటే... విరిగినవి విరిగినట్టుగానే అతక్కుపోయి ఆమె శరీరం విచిత్రంగా తయారయ్యింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారక్కడ. కొందరు మాట్లాడలేకపోతున్నారు. కొందరు మాట్లాడటమే మర్చిపోయారు. కాస్తో కూస్తో నోరు మెదపినవారు చెప్పిన వివరాలు విని అందరికీ ఒళ్లు జలదరించింది. డెల్ఫైన్ ఒక నరరూప రాక్షసి. పనికి మనుషుల్ని రప్పించుకునేది. బానిసల్ని చేసి బంధించేది. చిన్న తప్పు చేసినా పెద్ద పెద్ద శిక్షలు వేసేది. తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే ఇంటి వెనుక పూడ్చిపెట్టేది. లేదంటే కాల్చి బూడిద చేసేది. దాంతో కడుపు మండిన ఓ పనివాడు వంటగదిలో కావాలని నిప్పుపెట్టాడు. అతడు చేసిన ఆ పని... డెల్ఫైన్ దారుణాలను బయటపెట్టింది. పోలీసులు లలోరీ హౌస్‌కు తాళం పెట్టారు. ఆ కుటుంబం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. కొన్నాళ్ల తరువాత ఆ ఇల్లు వారి బంధువుల చేతికి వెళ్లింది. వాళ్లు దానిలో నివసించే ధైర్యం చేయకపోవడంతో చాన్నాళ్లు ఖాళీగానే ఉండిపోయింది. కొన్నాళ్ల తర్వాత దాన్ని ఓ కుటుంబం కొనుక్కుంది. కానీ అక్కడ నివసించడం గగనమయ్యింది. రాత్రి అయితే చాలు... అరుపులు, కేకలు, ఏడుపులు, విచిత్ర ధ్వనులు, అడుగుల చప్పుళ్లు, ఆర్తనాదాలు... భయంతో అల్లాడిపోయారు. ఇంట్లో రకరకాల ఆకారాలు కనిపిస్తుంటే... ప్రాణాలు చిక్కబట్టుకుని గడిపారు. చివరకు ఆ ఇంటిని అమ్మేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత లలోరీ హౌస్ చాలామంది చేతికి వెళ్లింది. ఎవరూ అందులో నివసించలేకపోయారు. అందుకే డేవిస్ ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటానంటే అమ్మేశారు. కానీ జడుసుకున్న డేవిస్ కూడా దాన్ని మరొకరికి అమ్మి ఊరొదిలిపోయాడు. ఇప్పుడు లలోరీ హౌస్‌ను అత్యాధునికమైన అపార్ట్‌మెంట్‌గా తీర్చిదిద్దారు. పలువురు నివసిస్తున్నారు. కానీ డెల్ఫైన్ చేతిలో చనిపోయినవారి ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతున్నాయనే అంటున్నారు. అదే నిజమైతే... అక్కడ ఎలా నివసించగలుగుతున్నారు? దెయ్యాలు వారినేమీ చేయవని ధైర్యమా? లేక అసలు ఏమీ లేకపోయినా ఉన్నాయని ఫీలవుతున్నారా? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి డెల్ఫైన్ అద్భుతమైన సౌందర్యరాశి. ఆమె కూతుళ్లు కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నారేమో... వారిని చూసిన కళ్లు రెప్ప వేయడం మర్చిపోయేవి. వాళ్లు ఏదైనా ఫంక్షన్‌కు వస్తే... ఇక అందరి కళ్లూ వాళ్ల మీదే.