షియామి అభిమానులకు పండగే
కొచ్చి: క్రేజీఫోన్లతో ఆకట్టుకుంటున్న చైనా మొబైల్‌దిగ్గజం షియామి తన అభిమానులకు శుభవార్త అందించింది. రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 100 ఎంఐ హోం స్టోర్లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. కస్టమర్ ప్రతిస్పందనను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ రిటైల్ అవులెట్లను తెరవాలని యోచిస్తోంది.
ఎంఐ తాజా స్మార్ట్పోన్లు, రెడ్మి 4, రెడ్మి 4ఏ , ఎంఐ రౌటర్ సీ కేరళ మొబైల్ మార్కెట్లో షియామి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎంఐ హెం స్టోర్లు షియామి ఇంటర్నెట్ + కొత్త రిటైల్ విధానాన్ని సూచిస్తా యన్నారు. ఇంటర్నెట్ సామర్ధ్యంతో ఇ-కామర్స్ సేవలను ఆఫ్‌లైన్ రిటైల్ ద్వారా యూజర్ అనుభవాన్ని జోడించనున్నామన్నారు.
తన మొదటి స్టోర్‌ను గత నెలలో బెంగళూరులో ప్రారంభించిన షియామి ప్రారంభ దశలో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నైలలో రాబొయే కొన్ని నెలల్లో ప్రారంభించనుంది. బెంగళూరులో ప్రారంభించిన మై హోమ్ స్టోర్‌లో మొదటిరోజు మొదటి 12 గంటల్లోపు 5 కోట్ల విక్రయాలను రికార్డు చేశామని మను జైన్ చెప్పారు. అలాగే ప్రస్తుతం 225 సర్వీసుసెంటర్లను వచ్చే నెలనాటికి 500 కి పెంచాలని భావిస్తన్నట్టు చెప్పారు. అలాగే చిన్న గిడ్డంగులను తెరిచి విడిభాగాల సరఫరాను మెరుగుపరచనున్నామన్నారు.