nine injured
-
ఆటోను ఢీకొన్న బస్సు: తొమ్మిది మందికి గాయాలు
గుంటూరు: గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగొండ్లలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది పుష్కర భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
ఆటో బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
వరంగల్ : వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా.. కొట్టడంతో అందులో ఉన్న తొమ్మిది మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 సాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని కాపవరం వద్ద మంగళవారం రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలోకి దూసుకెళ్లిన ఆటో: ఇద్దరి మృతి
కోనరావుపేట (కరీంనగర్): ప్రమాదవశాత్తు ఆటో రోడ్డు పక్కన బావిలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. డ్రైవర్ సహా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి మల్కపేటకు వస్తున్న ఆటోలో పది మంది ప్రయాణికులు ఎక్కారు. మర్తనపేట గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద ఆటో బ్రేకు ఫెయిలై, హ్యాండిల్ తిరగకపోవడంతో అదే వేగంతో రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ధర్మారానికి చెందిన పిట్టల చిన్నరాములు (65) అక్కడికక్కడే చనిపోయాడు. బావిలో పడ్డ ప్రయాణికుల అరుపులు విన్న స్థానికులు బాధితులను మంచం, తాళ్ల సాయంతో పైకి తీశారు. తీవ్రంగా గాయపడ్డ ఇదే గ్రామానికి మహ్మద్ ఖతీజా (60) ను కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. గాయపడిన తొమ్మిది మందిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు
నల్లగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లా మునగాలలో కారు - బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.