Nisar Ali Khan
-
'మీడియా జాగ్రత్తగా ఉంటే మంచిది'
ఇస్లామాబాద్: తమ దేశ మీడియాకు పాకిస్థాన్ గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్‌తో కలిసి గూఢచర్యం నిర్వహిస్తున్నారనే కారణంతో భారత్ కు చెందిన ఓ ఇంటెలిజెన్స్ అధికారిని అరెస్టు చేశారని అక్కడి కొన్ని పాకిస్థాన్ మీడియా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తల పట్ల ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొంది. దీంతో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి తాము అరెస్టు చేసిన భారత అధికారికి ఇరాన్ కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని వార్తలు ప్రచురించే సమయంలో కాస్తంత ముందూ వెనుక చూసుకొని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, తమది సోదరుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అని, అది చెడిపోయేలా చూడొద్దని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాగే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. -
మూడేళ్ల బాలుడు భూకబ్జా చేశాడు!
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాకిస్తాన్ పోలీసులు ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మూడేళ్ల బుల్లోడు భూకబ్జా చేశాడట. ప్లాజా స్థలాన్ని ఆక్రమించి, అందులోని వస్తువులను దొంగతనం చేశాడట. ఇది నిజమో కాదో తేల్చకుండానే పోలీసులు ఆ బాలుడిపై ఎఫ్ఐఆర్ పెట్టారు. దీంతో సంబంధిత పోలీసు అధికారులను హోం మంత్రి మంత్రి నిసార్ అలీ ఖాన్ సస్పెండ్ చేశారు. శనివారం ఎస్పీకి షోకాజ్ నోటీసూ ఇచ్చారు. ఇస్లామాబాద్‌లోని షాలిమర్ పోలీస్‌స్టేషన్ విచారణాధికారి, స్టేషన్‌హౌస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక ప్లాజాలోని భూమిని కబ్జా చేసి, అందులోని వస్తువులను దొంగతనం చేశాడని బాలుడిపై కేసుపెట్టారు. బాలుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుడికి బెయిల్ ఇవ్వొచ్చా అని లీగల్ కౌన్సిల్‌ను సంప్రదించింది. బాలుడి పేరు ఎఫ్ఐఆర్లో ఉన్నందున బెయిల్ ఇవ్వొచ్చని కౌన్సిల్ పేర్కొంది. -
భారత్ ఓర్వలేకపోతోంది: ఖాన్
ఇస్లామాబాద్: తమ దేశ అభివృద్ధిని చూసి భారత్ ఓర్వలేకపోతోందని పాకిస్థాన్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి నిసార్ అలీ ఖాన్ విమర్శించారు. పొరుగు దేశం ప్రగతి పథంలో పయనించడాన్ని ఇండియా జీర్ణించుకోలేకపోతోందని ఆయన ఆరోపించారు. 46 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శమన్నారు. దీంతో భారత్ నిజస్వరూపం బయటపడిందన్నారు. తమ దేశాన్ని అస్థిరపరచాలనే కాకుండా ఆధిపత్యం చెలాయించాలని కూడా భారత్ భావిస్తోందని ఆరోపించారు. ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ ఆజీజ్ కూడా అంతకుముందు భారత్ పై ఇదే రకమైన విమర్శలు చేశారు.