ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పాకిస్తాన్ పోలీసులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో మూడేళ్ల బుల్లోడు భూకబ్జా చేశాడట. ప్లాజా స్థలాన్ని ఆక్రమించి, అందులోని వస్తువులను దొంగతనం చేశాడట. ఇది నిజమో కాదో తేల్చకుండానే పోలీసులు ఆ బాలుడిపై ఎఫ్‌ఐఆర్ పెట్టారు. దీంతో సంబంధిత పోలీసు అధికారులను హోం మంత్రి మంత్రి నిసార్ అలీ ఖాన్ సస్పెండ్ చేశారు. శనివారం ఎస్పీకి షోకాజ్ నోటీసూ ఇచ్చారు. ఇస్లామాబాద్‌లోని షాలిమర్ పోలీస్‌స్టేషన్ విచారణాధికారి, స్టేషన్‌హౌస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఒక ప్లాజాలోని భూమిని కబ్జా చేసి, అందులోని వస్తువులను దొంగతనం చేశాడని బాలుడిపై కేసుపెట్టారు.
బాలుడి తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసుల తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుడికి బెయిల్ ఇవ్వొచ్చా అని లీగల్ కౌన్సిల్‌ను సంప్రదించింది. బాలుడి పేరు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నందున బెయిల్ ఇవ్వొచ్చని కౌన్సిల్ పేర్కొంది.
మూడేళ్ల బాలుడు భూకబ్జా చేశాడు!
Published Mon, Dec 21 2015 1:29 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement