భారత్ ఓర్వలేకపోతోంది: ఖాన్
ఇస్లామాబాద్: తమ దేశ అభివృద్ధిని చూసి భారత్ ఓర్వలేకపోతోందని పాకిస్థాన్ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి నిసార్ అలీ ఖాన్ విమర్శించారు. పొరుగు దేశం ప్రగతి పథంలో పయనించడాన్ని ఇండియా జీర్ణించుకోలేకపోతోందని ఆయన ఆరోపించారు.
46 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శమన్నారు. దీంతో భారత్ నిజస్వరూపం బయటపడిందన్నారు. తమ దేశాన్ని అస్థిరపరచాలనే కాకుండా ఆధిపత్యం చెలాయించాలని కూడా భారత్ భావిస్తోందని ఆరోపించారు. ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ ఆజీజ్ కూడా అంతకుముందు భారత్ పై ఇదే రకమైన విమర్శలు చేశారు.