Nivin Paulie
-
చిన్న బ్రేక్ తర్వాత..
స్మాల్ బ్రేక్ తీసుకున్నారు నయనతార. అదేంటీ తమిళంలో మూడు నాలుగు సినిమాలు చేస్తూ, తెలుగులో ‘సైరా’లో నటిస్తున్నారు కదా.. చిన్న బ్రేక్ ఎప్పుడు తీసుకున్నారు అనుకుంటున్నారా? బ్రేక్ తీసుకున్నది మలయాళంలో. నిజానికి నయనతార మాతృభాష మలయాళం. అయినా మలయాళంలో ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. ఇప్పటివరకూ నయనతార తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 70 సినిమాలు చేస్తే వాటిలో మలయాళ సినిమాలు ఓ పది ఉంటాయంతే. తెలుగు, తమిళంలో మంచి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడంతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నారు కాబట్టి మలయాళ సినిమాలపరంగా సంఖ్య తక్కువగా ఉంది. 2016లో మాలీవుడ్‌లో ‘పుదియ నిమయమ్’ చేశాక ఇప్పుడు మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారీ బ్యూటీ. నివిన్ పౌలీ హీరోగా నటించనున్న ఈ చిత్రం ద్వారా ధ్యాన్ శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం కానున్నారు. త్వరలో సినిమా ఆరంభం కానుంది. ఇది లవ్, యాక్షన్, డ్రామా మూవీ. రెండేళ్ల తర్వాత నయనతార మాతృభాషలో నటించడం అక్కడి ఆమె అభిమానులకు హ్యాపీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్
దాదాపు 3,864 గంటలు.. అంటే 161 రోజులు దొంగగా ఉన్నారు మలయాళ నటుడు నివిన్ పౌలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదంతా.. ఆయన హీరోగా నటించిన ‘కాయమ్‌కులమ్ కొచ్చున్’ సినిమా గురించి. ‘నోట్‌బుక్’ ఫేమ్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. 19వ శతాబ్దంలో దారి దోపిడీ దొంగగా సెంట్రల్ ట్రావెన్కోర్ ప్రాంతాన్ని గడగడలాడించిన కాయమ్‌కులమ్ కొచ్చున్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోహన్‌లాల్ కీలక పాత్ర చేసిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కథానాయిక. గోపీసుందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ‘‘సెట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్స్‌తో 161 డేస్ వర్క్ చేశాను. ఈ ఒక్క సినిమాతో లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్ పొందిన అనుభూతి కలిగింది’’ అని పేర్కొన్నారు నివిన్ పౌలి. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. -
రెమో సంస్థలో నివీన్ పౌలీ
తమిళసినిమా: మలయాళ నటుడు నివీన్‌పౌలీ కోలీవుడ్‌లోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే మాలీవుడ్‌లో ప్రేమమ్ చిత్రంతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నివీన్ పౌలీ ప్రస్తుతం అక్కడ నయనతారతో రొమాన్స్ చేస్తున్నారు. ఈయన తాజాగా శివకార్తీకేయన్ సంస్థలో పాగా వేయనున్నారు. శివకార్తీకేయన్ హీరోగా రెమో చిత్రాన్ని నిర్మించిన 24 ఏఎం స్టూడియోస్ అధినేత ఆర్డీ.రాజా ప్రస్తుతం అదే నటుడితో వేలైక్కారన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో ఆర్డీ.రాజా తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. తన సంస్థలో తెరకెక్కనున్న మూడవ చిత్రంలో కథానాయకుడిగా నివీన్ పౌలీని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి నవదర్శకుడు ప్రభు రాధాకృష్ణన్ మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ విషయంపై మంగళవారం ఓ ప్రకటనలో తెలుపుతూ దర్శకుడు ప్రియదర్శన్,సంతోష్‌శివన్‌లవద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన ప్రభు రాధాకృష్ణన్‌లో మంచి ప్రతిభ ఉందన్నారు. ఈ చిత్రానికి ప్రముఖ చాయాగ్రహకుడు పీసీ.శ్రీరామ్ పని చేయనుండటం సంతోషకరమైన విషయం అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ జనవరిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 24 ఏఎం.స్టూడియో ద్వారా దర్శకుడిగా పరిచయం కానుండడం సంతోషంగా ఉందని దర్శకుడు ప్రభు రాధాకృష్ణన్ అన్నారు. చిత్ర నిర్మాణంపై మంచి అవగాహన ఉన్న నిర్మాత ఆర్డీ.రాజాలో మంచి కథకుడు ఉన్నాడని, ఈ చిత్రానికి కథను ఆయనే అందించారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.