No doctors
-
జ్వరాలతో గజ..గజ...
ఓ పక్క సీజనల్ వ్యాధులు.. మరో పక్క కంటి వెలుగు కార్యక్రమం.. ముగ్గురు వైద్యాధికారులకు ఇద్దరు కంటి వెలుగు విధుల్లో.. ఒక్క వైద్యుడిపైనే అదనపు భారం....ఆస్పత్రిలో రోగులు కిక్కిరిసిపోతున్నారు.. వైద్య సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు దాదాపు 300 మందికి పైగా ఓపీ వస్తుంది. దీంతో సిబ్బంది కూడా అసహనంతో రోగులపై చికాకు పడుతున్నారు. చీదరింపులకు చాలా మంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదీ నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి. నేలకొండపల్లి : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల ప్రజలు వైరల్ ఫీవర్‌తో వణికిపోతుంది. గ్రామాల్లో పేరుకపోయిన పారిశుద్ధ్యం వలన సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మండలంలో ఏ గ్రామం, ఏ ఇంటి తలుపు తట్టినా జ్వరపీడితులే. గ్రామాల నుంచి వస్తున్న జ్వరపీడితులతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రోగులతో కిక్కిరిసిపోతుంది. జ్వరాలు, నీరసం, కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ 300 మందికి పైగా అవుట్ పేషెంట్(ఓపీ) హాస్పిటల్‌కు వస్తున్నారు. దీంతో సిబ్బంది రోగుల పట్ల చికాకుపడటం, చీదరించుకోవటం చేస్తున్నారు. అసలే రోగం, నొప్పులతో వైద్యం కోసం వచ్చే వారి పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో చాలా మంది బాధపడుతున్నారు. చీదరింపులు తట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒక్కరే వైద్యుడు.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావటంతో మండలం నుంచే కాకుండా ముదిగొండ, కూసుమంచి మండలాలకు చెందిన ప్రజలు కూడా నేలకొండపల్లి హాస్పిటల్‌కు వస్తున్నారు. ఈ హాస్పిటల్లో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు. మండల వైద్యా«ధికారి డాక్టర్ రాజేష్‌ను కంటి వెలుగు పథకానికి నియమించారు. మరో డాక్టర్ రత్నమనోహర్‌ను మంచుకొండ కంటి వెలుగు పథకానికి డిప్యూటేషన్‌పై పంపిం చారు. ఇక మిగిలింది డాక్టర్ సురేష్‌నారాయణ. ఒక్కరే 300 మందికి పైగా ఓపీ చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా రాత్రి డ్యూటీలు చేసి మళ్లీ ఉదయం డ్యూటీలు చేస్తుండటంతో అదనపు భారంతో సతమతం అవుతున్నారు. డాక్టర్‌కూ జ్వరమే.. సీజనల్ వ్యాధుల వలన హాస్పిటల్‌కు రోగుల సంఖ్య పెరగటంతో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు సురేష్నారాయణకు జ్వరం వచ్చింది. కంటి వెలుగు పథకం ప్రారంభం నుంచి ఒక్కరే విధులు నిర్వహిస్తుండటంతో జ్వరం వచ్చింది. జ్వరం, గొంతు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సెలవు పెట్టేందుకు ప్రత్యామ్నాయం వైద్యులు లేకపోవటంతో జ్వరంతోనే విధులు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు జ్వరం తీవ్రత కావటంతో ఓపిక తగ్గుతుందని తాను సెలవులో వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఉన్న ఒక్క డాక్టర్ కూడా సెలవు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా వైద్యులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రోగులను సిబ్బంది గౌరవించాలి రోగులను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తే సిబ్బంది పై చర్యలు తీసుకుంటాం. సీ జనల్ వ్యాధుల వలన రోగు ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి. రోగులను ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. డాక్టర్స్ కొరత ఉన్న మాట వాస్తవమే. వాటిని భర్తీ చేసేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ కొండల్రావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ వారం రోజులుగా జ్వరం వారం రోజులుగా జ్వరం వస్తుంది. జ్వరం, నీరసం తో బాధపడుతున్నాను. హాస్పిటల్‌కు వస్తే జనం బాగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాను. జ్వర పీడితులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైద్యం అందించేందుకు మరింత సిబ్బందిని పెంచాలి. – కె.నాగమణి, సింగారెడ్డిపాలెం కీళ్ల నొప్పులు, నీరసంతో ఇబ్బందిగా ఉంది కీళ్ల నొప్పులు, నీరసంతో బాధపడుతున్నాను. రోగులు ఎక్కువగా వస్తున్నారు. దీంతో నిలబడే ఓపిక లేకుండా ఉంది. ఇంటి వద్ద నుంచి హాస్పిటల్‌కు కూడా రాలేక పోయాను. ఇక్కడ డాక్టర్ ఒక్కరే చూడటం వలన క్యూలో నిలబడలేక పోతున్నా. రోగుల బాధలు అర్థం చేసుకుని వైద్యులను నియమించాలి. – పి.కాంతయ్య, మండ్రాజుపల్లి -
డాక్టర్లు కావలెను
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత రోగులకు ప్రాణ సంకటంగా మారింది. ముఖ్యంగా ప్రత్యేక వైద్య నిపుణుల కొరత వేధిస్తోంది. సివియర్ కేసులకు కూడా జనరల్ వైద్యులకే చూపించాల్సి రావడంతో రోగులు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి. ప్రభుత్వం ప్రకటించే జీతాలకు ప్రత్యేక వైద్య నిపుణులు రావడం లేదని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. సివిల్ సర్జన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్, గైనకాలజిస్టు, చిన్న పిల్లల వైద్య నిపుణలకు నెలకు ప్రభుత్వం ఇచ్చేది సుమారు రూ.60 వేల వేతనమని, ఈ వేతనానికి ఎవరూ ముందుకురావడం లేదని తెలిపారు. ఆసుపత్రుల వారీగా వైద్యుల, సిబ్బంది కొరత జిల్లాలోని ఏరియా, సీసీహెచ్సీ ప్రభుత్వాసుపత్రులు మొత్తం 10. అందులో వైద్య నిపుణుల కొరత ఇలా ఉంది. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో సహా ఆరుగురు వైద్యులు ఉండాలి. కానీ ఒక వైద్యులు మాత్రమే ఉన్నారు. సిబ్బంది ఆరుగురికి గాను ఒకరు మాత్రమే ఉన్నారు. తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌తో కలిపి వైద్యులు ముగ్గురు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు 12 మందికి గాను 10 మంది ఉన్నారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులు 10 మందికి గాను 9 మంది ఉన్నారు. ఒకరు లేరు, ఆర్ఎంఓ ఒకరు లేరు. నర్సింగ్ సూపరింటెండెంట్ లేరు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లేరు. నర్సాపురం ఆసుపత్రిలో సూపరింటెండెంట్ లేరు. ఐదుగురు వైద్యులకు గాను ఒకరు లేరు. పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో సహా ఐదుగురు వైద్యులు ఉండాలి. ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు వైద్యులు లేరు. డిప్యూటీ సివిల్ సర్జన్ లేరు. హెడ్ నర్సు ఒకరు, ఎస్ఎన్ఓ ఒకరు లేరు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మొత్తం సివిల్ సర్జన్ వైద్యులు 12 మంది ఉండాల్సి ఉంది. ఆరుగురు వైద్యులే ఉన్నారు, ఆర్ఎమ్ఓ లేరు. డిప్యూటీ సివిల్ సర్జన్ లేరు. సివిల్ అసిస్టెంట్ వైద్యులు 27 మందికి గాను 26 మంది ఉన్నారు. సిబ్బంది 30 శాతం లేరు. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో సివిల్ సర్జన్, చిన్న పిల్లల వైద్యులు, మత్తు వైద్యులు, దంత వైద్యులు లేరు. ఇక్కడ రోగుల సంఖ్య 300 నుంచి 400 వరకు ఉండగా సూపరింటెండెంట్ వైద్య సేవలు అందిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో నలుగురు సివిల్ సర్జన్ వైద్యులు ఉండాలి. కానీ ఒకరు లేరు. ఆర్ఎంఓ లేరు. దెందులూరు ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ వైద్యులు లేరు, రేడియోగ్రాఫర్ లేరు. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ వైద్యులు ఒకరు లేరు. ఫార్మాసిస్ట్ ఎవరూ లేరు. స్టాఫ్ నర్స్ ఒక పోస్టు ఖాళీగా ఉంది. వైద్యులు సరిపోవడం లేదు భీమవరం ప్రభుత్వాసుపత్రికి రోజూ సుమారు 400 నుంచి 500 మంది వైద్య సేవల కోసం వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆసుపత్రికి రోగులు, గర్భిణులు వస్తున్నారు. ఉన్న వైద్యులు సరిపోక రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి వైద్యుల సంఖ్య పెంచాల్సి ఉంది. –ఎం.వీరాస్వామి సూపరింటెండెంట్, భీమవరం ప్రభుత్వాసుపత్రి నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యల కొరత తీర్చడానికి ఇప్పటికి మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చాం. కానీ వైద్యులెవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోదనే కారణంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. జిల్లాలోని ఆసుపత్రులకు 13 మంది గైనకాలజిస్టులు, 12 మంది చిన్న పిల్లల వైద్యులు, 11 మంది మత్తు వైద్యుల అవసరం ఉంది. – డాక్టర్ శంకరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ కర్త, ఏలూరు -
నాడి పట్టే నాథుడేడి?
ఈదగోని రాజలింగం.. వరంగల్ జిల్లా మరిపెడ.. కూలి పనులతో పొట్టబోసుకుంటాడు.. ఇటీవల వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మధ్యాహ్నం పూట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు.. అక్కడ డాక్టర్ లేడు.. ఇతర వైద్య సిబ్బంది కూడా లేరు.. చేసేది లేక ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్తే రూ.2,500 ఖర్చయింది! నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడుకు చెందిన కుంభం నాగార్జున (12)కు గత సోమవారం తీవ్రంగా జ్వరమొచ్చింది. చింతపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే డాక్టర్ లేరు. ఉదయం 10 గం. దాటినా ఎవరూ రాలేదు. దీంతో 15 కి.మీ. దూరంలోని మల్లేపల్లికి వెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు!! సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్ : ..ఇది ఈ ఇద్దరి వ్యథ మాత్రమే కాదు. రాష్ట్రంలోని అనేక పల్లెల్లో పీహెచ్సీ దుస్థితిS ఇలాగే ఉంది. మామూలు రోజుల్లో మధ్యాహ్నం ఒంటి గంట దాటితే వైద్యులు పత్తా లేకుండా పోతున్నారు. సెలవు తర్వాత డాక్టర్లు, నర్సులు మధ్యాహ్నం దాటినా అందుబాటులో ఉండటం లేదు. సోమవారం మధ్యాహ్నం 12 దాకా అసలు ఆస్పత్రుల ముఖమే చూడటం లేదు. రాష్ట్రంలోని పది పాత జిల్లాల్లో 675 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ) ఉండగా.. వాటిలో పనిచేస్తున్న డాక్టర్లలో అత్యధికులు స్థానికంగా ఉండటం లేదు. సమీప పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ మొక్కుబడిగా పీహెచ్‌సీకి వెళ్తున్నవారు 90 శాతం దాకా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖలో సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నల్లగొండ, యాదాద్రి, జనగామ, నాగర్‌కర్నూలు, వికారాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే డాక్టర్లలో 80 శాతం (ఓ డీఎంఅండ్‌హెచ్‌వో అంచనా ప్రకారం) మంది హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన 20 శాతం మంది పాత జిల్లాలు నల్లగొండ, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి వెళ్తున్నారు. దీంతో చాలాచోట్ల డాక్టర్లు అనధికారికంగా ఐదు రోజుల పని దినాలు పాటిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. కొన్నిచోట్ల అయితే వారంలో నాలుగు రోజులు కూడా డాక్టర్లు విధులకు వెళ్లడం లేదని, నర్సులే పీహెచ్‌సీలకు పెద్ద దిక్కు అని వైద్యారోగ్య శాఖ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. శనివారం చాలా చోట్ల డాక్టర్లు విధుల్లో ఉండటం లేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నల్లగొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు గతంలో ఆయా జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. అయితే నాలుగు రోజులు హడావుడి చేయడమే తప్ప దీనికి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నామని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పలుకుబడి ముందు బలాదూర్ హైదరాబాద్‌కు సమీపంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పోస్టింగ్‌లు వేయించుకున్న నలుగురు వైద్యులు వారం అంతకంటే ఎక్కువ రోజులు గైర్హాజరు కావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వారిపై చర్యలకు సిద్ధమయ్యే లోపే తమకు సంబంధించిన వారని, చూసీ చూడనట్లు వెళ్లమని సంబంధిత అధికారులకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాయి అందాయి. ఈ నలుగురు వైద్యుల్లో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తనయులు కావడం గమనార్హం. మరొకరు సీనియర్ ఐఎఎస్ అధికారి కూతురు. వీరు పని చేస్తున్న చోట నర్సులే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహిస్తుంటారు. మామూలుగా జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఈ కేంద్రాలకు వచ్చేవారే అధికం. డాక్టర్లు లేకపోయినా నర్సులు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. మరీ సీరియస్ కేసు అయితే స్థానికంగా ఉండే లేదా సమీప పట్టణాలకు తీసుకువెళ్లమని సూచిస్తారు. మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం నాలుగు గంటల దాకా పని చేయాలి. కానీ ఏ రోజూ సగటున మూడు గంటలకు మించి ఇవి పని చేయడం లేదని సెస్ గతంలో ఓ నివేదికలో స్పష్టంచేసింది. ‘‘ఆస్పత్రికి వెళ్తే డాక్టర్, ఇతర సిబ్బంది ఎవరూ ఉండటం లేదంటూ వచ్చే ఫిర్యాదులు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. ఇవి సగటున రోజు ప్రతి జిల్లాలో వంద దాకా వస్తుంటాయి. కలెక్టరేట్ల నుంచి వచ్చే ఆ ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవడానికి మా వద్ద సరైన యంత్రాంగం కూడా లేదు’’ అని వైద్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది కొరత గ్రామీణ ప్రాంతాల్లో పని చేసేందుకు అటు డాక్టర్లు, ఇటు పారామెడికల్ సిబ్బంది ఆసక్తి చూపకపోవడం కూడా పీహెచ్‌సీల పరిస్థితి దారుణంగా మారడానికి ఓ కారణం. ఏదో మొక్కుబడిగా వారు పనిచేస్తారని, ఒత్తిడి తెచ్చి వారిని ఇబ్బంది పెద్దవద్దంటూ ఇటీవల ఓ ఉన్నతాధికారి ఒక జిల్లా వైద్యాధికారిని మందలించారు. ఇదిలా ఉంటే పీహెచ్‌సీల్లో ఉండాల్సిన మేరకు సిబ్బంది లేకపోవడం వల్ల తెలంగాణలోని 675 పీహెచ్‌సీలు, 264 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉండాల్సిన మేరకు సిబ్బంది లేరు. ఒక్కో పీహెచ్సీలో ఒక మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్)తో పాటు ఒక ఫార్మాసిస్ట్, ఒక స్టాఫ్ నర్స్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక బ్లాక్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్‌తో పాటు ఒకరు చొప్పున మగ, ఆడ హెల్త్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండాలి. మొత్తం 675 పీహెచ్సీలలో 40 శాతం అంటే 270 చోట్ల నిర్దేశిత మొత్తంలో సిబ్బంది ఉన్నారు. 200 కేంద్రాల్లో డాక్టర్ ఉన్నా తగిన సంఖ్యలో ఇతర సిబ్బంది లేరు. మరో 205 కేంద్రాల్లో 25 నుంచి 30 శాతం మాత్రమే సిబ్బంది ఉన్నారు. డాక్టర్లు లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎన్ని అన్న స్పష్టమైన వివరాలు లేవని అధికారులు చెపుతున్నారు. పీహెచ్‌సీకి వచ్చిన వారు ఏ రకమైన జ్వరంతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి అవకాశం లేని పీహెచ్‌సీలు 50 శాతం కంటే ఎక్కువ ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల కొరత వల్ల మామూలు రక్త పరీక్షలకు కూడా పేద ప్రజలు నోచుకోవడం లేదు. -
ఖర్మాసుపత్రులు
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాట ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. దవాఖానాల దుస్థితికి నిత్య దర్పణం ఆ పాట. దానిని దాదాపు ప్రతినిత్యం ఎక్కడో దగ్గర వింటున్నా.. ప్రభుత్వాల కళ్లు తెరచుకోవడంలేదు. ప్రభుత్వాసుపత్రులపై పాలకులు నేటికీ అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. అరకొర వైద్య సేవలు, చాలీచాలని వసతులు, సౌకర్యాల లేమి, మందుల కొరత.. ఇలా అనేక సమస్యలు సర్కారీ ఆసుపత్రులను పట్టి పీడిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్‌లో ఇటువంటివే అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అరకొరగానే ఉన్నాయి. దీంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని విభాగాలకైతే డాక్టర్లు లేక వైద్యం అందని దుస్థితి నెలకొంది. ఇక కొన్ని విభాగాల్లో ఒకే మంచంపై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్న దుర్భర పరిస్థితి నెలకొంది. పేద రోగులకు అందించాల్సిన మందుల కొరత కూడా తీవ్రంగా ఉంది. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై సోమవారం చేసిన ‘సాక్షి’ విజిట్‌లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.∙కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) బోధనాసుపత్రి కూడా. ఇక్కడ పడకల కొరత తీవ్రంగా ఉంది. అనేక విభాగాల్లో ఒకే బెడ్‌పై ఇద్దరేసి రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. కీలకమైన కార్డియాలజీ విభాగానికి పూర్తిస్థాయి వైద్యులు లేరు. ప్రస్తుతం గుండె వ్యాధుల చికిత్స నిపుణునిగా సేవలందిస్తున్న డాక్టర్ చలం మూడు రోజులు కాకినాడ జీజీహెచ్‌లో, మూడు రోజులు విశాఖ కేజీహెచ్‌లో సేవలు అందిస్తున్నారు. దీంతో ఇక్కడ అరకొర వైద్యసేవలే దిక్కవుతున్నాయి. ప్రధానమైన బీ కాంప్లెక్స్ నుంచి గుండె జబ్బులు, న్యూరాలజీ, కీళ్లనొప్పులతోపాటు కాల్షియం మాత్రలు కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి. చెవి, కంటికి సంబంధించి వేసే డ్రాప్స్ కూడా మూడు నాలుగు నెలలుగా సరఫరా కావడంలేదు. ఆసుపత్రి డ్రగ్స్ బడ్జెట్ రూ.1.82 కోట్లు. ఇది ఆరు నెలలకు కూడా సరిపోవడం లేదు.∙రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఓపీ చీటీలు రాసేచోట సరైన సిబ్బంది లేరు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారిని పారిశుద్ధ్య సిబ్బందిగా, ట్రైనీ నర్సులుగా నియమిస్తుంటారు. ఇక్కడ పని చేస్తున్న 69 మందిని ఒకేసారి బదిలీ చేయడంతో పలు విభాగాల్లో సకాలంలో సరైన వైద్య సేవలు అందడంలేదు. ఒకేసారి సీనియర్ సిబ్బందిని బదిలీ చేయడంతో గైనిక్ వైద్య సేవలు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. డెలివరీ కూడా సకాలంలో చేయడం లేదని రోగులు వాపోతున్నారు. ఏడాదికి రూ.1.62 కోట్ల మేర డ్రగ్స్ బడ్జెట్ కేటాయించినా అది చాలడంలేదు. దీనిని రూ.3 కోట్లకు పెంచాల్సిన అవసరం ఉంది.∙అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కన్ను, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వైద్యం అందే పరిస్థితి లేదు. కోనసీమలోని కిడ్నీ రోగులను ఈ ఆసుపత్రి ఆదుకోలేకపోతోంది. డయాలసిస్ యూనిట్ లేక కాకినాడ, రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారు. ఇక్కడ కూడా మందుల కొరత ఉంది. దాదాపు రూ.70 లక్షల బడ్జెట్ అవసరం కాగా, కేవలం రూ.51.52 లక్షల మేరకే ప్రభుత్వం ఇస్తోంది. ∙తుని ఏరియా ఆసుపత్రిలో చీటీలు తీసుకున్న రోగులు సంబంధిత డాక్టరు గది వద్దకు వెళ్లి క్యూలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఇక్కడ మూడు ఎక్స్‌రే మెషీన్లు ఉండగా ఒకటి మాత్రమే పని చేస్తోంది. నెలలు నిండిన మహిళలు పురుడు కోసం వస్తే చేయి తడపందే వైద్యులు కత్తెర పట్టుకోవడం లేదు. డ్రగ్స్ కొరత ఉంది. ప్రభుత్వం కేటాయించిన రూ.52.65 లక్షల బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదు. రూ.75 లక్షల మేర అవసరం ఉంది.∙మూడు నియోజకవర్గాలకు ఏరియా ఆసుపత్రిగా ఉన్న రామచంద్రపురంలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు సహితం ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక వెనుదిరగాల్సి వస్తోంది. గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్, చంటిపిల్లల వైద్యులు లేకపోవటంతో మహిళా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కార్డియాలజిస్టు పోస్టు లేకపోవడంతో గుండెపోటుకు గురైనవారికి అత్యవసర చికిత్స అందించే పరిస్థితి లేదు. ముఖ్యమైన సామగ్రి అందుబాటులో లేకపోవటంతో ఆర్థోపెడిక్ ఆపరేషన్లు అవసరమైన వారిని కాకినాడ తరలిస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఏటా రూ.35.80 లక్షల మేర డ్రగ్స్‌కు కేటాయిస్తున్నా సరిపోవడం లేదు. మందుల కొరత తీరాలంటే రూ.55 లక్షల మేరకు అవసరం ఉంది. జిల్లాలోని ఇతర ఆసుపత్రుల్లోనూ దాదాపు ఇదే దుస్థితి నెలకొందిగొంతుకు ఎక్స్‌రే తీయమంటే చెస్ట్‌కు తీశారుకాకినాడ జగన్నాథపురానికి చెందిన 12 ఏళ్ల రాముడుకు గొంతులో కాయ ఏర్పడింది. శనివారం ఎక్స్‌రే తీయాల్సిందిగా వైద్యులు సూచించారు. తీరా అన్నీ చేసి సోమవారం ఆస్పత్రికి వచ్చాక గొంతుకు తీయాల్సిన ఎక్స్‌రే చెస్ట్‌కు తీశారని వైద్యులు తేల్చారు. ఎక్స్‌రే సరిగా లేనందున మళ్లీ తీయించుకురమ్మని చెప్పడంతో ఉసూరుమంటూ మండుటెండలో అతడి తల్లి చక్కా రాఘవ ఎక్స్‌రే విభాగం వైపు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తాను ఇబ్బంది పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.. మందులు లేవు కాకినాడకు చెందిన ఓలేటి అప్పారావుకు అకస్మాత్తుగా కాళ్లు, చేతులు పడిపోయాయి. చేపల వేట చేస్తూ జీవనం సాగించే అప్పారావు చికిత్స నిమిత్తం నాలుగు రోజుల క్రితం జీజీహెచ్‌లో చేరాడు. చికిత్స అందించేందుకు అవసరమైన ఇమ్యునోగ్లోబ్లెన్స్ అందుబాటులో లేవని సిబ్బంది తేల్చేశారు. ఇది ఉంటేనే కానీ రోగికి మెరుగైన వైద్యం అందించలేని పరిస్థితి. మందులు అందుబాటులో లేని దుస్థితి. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మందు బయట కొనలేకపోతున్నామని రోగి బంధువు చెప్పాడు. అతడిని ఆసుపత్రిలోనే ఉంచి సాధారణ చికిత్స అందిస్తున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో కన్పించని డాక్టర్లు
-
వైద్యులులేని ఆస్పత్రి మాకొద్దు
ఆత్మకూర్ : వైద్యులు, వైద్య సిబ్బందిలేని ఈ ఆస్పత్రి ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే అని గ్రామస్తులు ఆస్పత్రికి తాళం వేశారు. మండల పరిధిలోని తిప్డంపల్లిలోని పీహెచ్సీలో ఏడాది నుంచి వైద్యులు లేకపోవడంతో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులే వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఎవరూ లేకుండా పోయారు. గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి అతిసార బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతో ఆత్మకూర్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు, సర్పంచ్ విజయమ్మ, ఎంపీటీసీ పురం సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆస్పత్రికి తాళం వేసి క్లస్టర్ వైద్యాధికారి శ్రీనివాసులుకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ అత్యవసరంగా నిర్వహించి వైద్య అధికారుల తీరుపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న క్లస్టర్ వైద్యాధికారి శ్రీనివాసులు, హెల్త్ ఎడుకేటర్ శ్రీరామ్‌సుధాకర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. నర్సు అనారోగ్యానికి గురై వెళ్లిపోయిందన్నారు. వైద్యులతోపాటు సిబ్బందిని నియమిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శాంతమ్మ, వార్డు సభ్యులు బాల్‌రాజ్, మాకం క్రిష్ణ, శంకర్, పాండురంగం, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పడకేసిన సంజీవని
చోడవరం,న్యూస్‌లైన్: సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న 104 సేవలు పేదలకు సక్రమంగా అందడం లేదు. ఈ పథకం ద్వారా రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం కొరవడింది. ఒకపక్క సిబ్బంది కొరత, మరోపక్క వైద్య సిబ్బంది అరకొర సేవలతో ఈ పథకం నామాత్రమయింది. జిల్లాలో క్లస్టర్‌కి ఒకటి చొప్పున 20 వాహనాలున్నాయి. 150 మంది పని చేస్తున్నారు. ప్రారంభంలో ఈ వాహనాలు నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వచ్చేవి. ఎల్టి, ఫార్మసిస్టు, ఆపరేటర్, ఇద్దరు నర్సులు, మరో ముగ్గురు సిబ్బంది ఒక్కో వాహనంలో ఉండేవారు. మందులతో పాటు వైద్యం కూడా నేరుగా దీర్ఘకాలిక రోగులకు అందేది. ఆ తర్వాత వీటిని పూర్తిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధీనంలోకి నెట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సేవలు కూడా కుంటుపడ్డాయి. ఈ వాహనం అప్పుడప్పుడు గ్రామాల్లోకి రావడం పోవడం మినహా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పలు పీహెచ్‌సీలకు వైద్యులే లేరు. ఆరోగ్య కేంద్రాల్లోనే అరకొర సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటిల్లో సేవలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఈ పథకం సేవలకు మందుల కొరత ఉంది. బిపి, షుగర్, టీబీ,ఆస్త్మా వంటివాటితో దీర్ఘకాలికంగా బాధపడే వారికి ఈ వాహనాల ద్వారా నెలకు సరిపడే మందులు సరఫరా చేసేవారు. గర్భిణులకు కూడా పూర్తిస్థాయి సేవలు అందడంలేదు.104 ద్వారా అరకొర వైద్యంతో గ్రామాల్లో రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక ఈ వాహనాల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మూలకు చేరిన వాటిని బాగు చేయించడం లేదు. సిబ్బందికి నాలుగు నెలలుగా జీతాలు లేవు. సిబ్బంది కుటుంబాలు పూటగడవడమే కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిబ్బంది సేవలపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఇలా పలు సమస్యలతో 104 సేవలు నామమాత్రంగా మారాయి. ఇప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించి సేవలు పూర్తిస్థాయిలో అందివ్వాలని రోగులు కోరుతున్నారు. -
వైద్యులు ఉండరు..వైద్యం అందదు
భువనగిరి, న్యూస్‌లైన్: నిరుపేదలకు అధునాతన వైద్యం అందించాలని ఏర్పాటు చేసిన సముదాయ (క్లస్టర్) ఆస్పత్రి విధానం జిల్లాలో అభాసుపాలవుతోంది. 2010లో ప్రారంభించిన ఈ విధానం ద్వారా రోగులకు 24గంటలూ అవసరమైన వైద్యం అందించాలని నిర్ణయించారు. అయితే స్థానికంగా వైద్యులు ఉండకపోవడం.. మందుల కొరత, సిబ్బంది లేమి వంటి కారణాలతో ఈ వ్యవస్థ అలంకారప్రాయంగా మారింది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 15 క్లస్టర్లుగా విభజించారు. వాటి ద్వారా పేదలకు వైద్యం మరింత చేరువ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రతి క్లస్టర్‌కు సీనియర్ మెడికల్ ఆఫీసర్‌ను అధికారిగా నియమించా రు. ఆయన ఆయా క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు అంటువ్యాధులు రాకుండా ముందస్తు నివారణ చర్యలు, జ్వరాలు, చిన్న పిల్లల ఆరోగ్యం, ప్రసవాలను పర్యవేక్షించాల్సి ఉంది. ఎంబీబీఎస్ వైద్యులను పీహెచ్‌సీలు, క్లస్టర్లలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా నియమించారు. అదే విధంగా చిన్నపిల్లల, గర్భకోశ, మత్తు, ఎముకల స్పెషలిస్టులతోపాటు అత్యవసర విభాగాల్లో రెండు పోస్టులను భర్తీ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వైద్యులు, వైద్యం అందుబాటులో ఉండడం లేదు. పోచంపల్లిలో ఒక్కరే డాక్టర్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. వైద్యురాలు నెలలో 15 రోజుల పాటు 104లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరోడాక్టర్ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. డాక్టర్ స్థానింగా ఉండకపోవడం వల్ల స్టాఫ్‌నర్స్ ఇతర సిబ్బంది వైద్యం అందిస్తారు. ఇక.. బొల్లేపలి,్ల వర్కట్‌పల్లి పీహెచ్‌సీల్లో వైద్యులు వచ్చినప్పుడే రోగులు రావాలి. వైద్యఆరోగ్య శాఖ అధికారి ఇటీవల వర్కట్‌పల్లి పీహెచ్సీ తనిఖీ కోసం వచ్చినప్పుడు వైద్యులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో కంగుతిన్నారు. ఇలాంటి పరిస్థితి అన్ని పీహెచ్‌సీల్లోనూ ఉంది. జిల్లాలో ఏర్పాటైన క్లస్టర్లు భువనగిరి : బొల్లేపల్లి, బీబీనగర్, కొం డమడుగు, బొమ్మలరామారం, తు ర్కపల్లి, ఆత్మకూర్(ఎం), గుండాల రామన్నపేట : మునిపంపుల, చిట్యాల, వలిగొండ, వేములకొండ, మోత్కూరు, అడ్డగూడూర్ ఆలేరు : రాజాపేట, శారాజీపేట, యాదగిరిగుట్ట, మోటకొండూర్ చౌటుప్పల్ : వర్కట్‌పల్లి, పోచంపల్లి, నారాయణపురం, వెల్మినేడు నల్లగొండ : నల్లగొండ, కనగల్, గుర్రంపోడ్, తిప్పర్తి, నార్కట్‌పల్లి, అక్కినేపల్లి, మునుగోడు నాగార్జునసాగర్ : హాలియా, నిడమనూరు, పెద్దవూర దేవరకొండ : డిండి, చందంపేట, పీఏపల్లి, గుడిపల్లి, కొండమల్లేపల్లి, చింతపల్లి హూజర్‌నగర్ : మేళ్లచెరువు, మఠంప ల్లి, లింగగిరి, గరిడేపల్లి, కల్మల్చెరువు నకిరేకల్ : కేతేపల్లి, శాలిగౌరారం, ఓగోడు, కట్టంగూర్ మర్రిగూడ : మర్రిగూడ, చండూరు, నాంపల్లి, వి.టి.నగర్ మిర్యాలగూడ : ఆలగడప, వేముల పల్లి, త్రిపురారం, పెద్దదేవులపల్లి, దా మరచర్ల, నేరడుచర్ల, పెంచికల్ దిన్నె కోదాడ : అనంతగిరి, కాపుగల్లు, చిలుకూరు నడిగూడెం :త్రిపురవరం, మునగాల, రేపాల సూర్యాపేట : కాసరాబాద, ఆత్మకూర్.ఎస్, పెన్‌పహాడ్, మోతె, పాములపహాడ్, చివ్వెంల తుంగతుర్తి : తుంగతుర్తి, అర్వపల్లి. నూతనకల్, నాగారం, తిరుమలగిరి అందుబాటులో లేని వైద్యం : గోద శ్రీనివాస్ , సర్పంచ్ బొల్లేపల్లి : మా గ్రామంలో ఉన్న పీహెచ్‌సీల్లో వైద్యు లు, సిబ్బంది సరిగా విధులకు హాజరుకారు. డాక్టర్ ఎప్పుడు వస్తుందో ఎప్పు డు పోతుంతో తెలియదు. సిబ్బంది కూ డా అదే పరిస్థితి. ప్రజలకు అందుబాటు లో ఉండాలని ఇటీవల నేను చెప్పినప్పటికీ వారిలో మార్పు రాలేదు. అధికారు లు గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలి.