Non-Cooperation Movement
-
బంగ్లాలో మళ్లీ ఘర్షణలు: 97 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు, విద్యార్థులు చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం తొలిరోజే హింసాత్మకంగా మారింది. అధికార ఆవామీ పార్టీ కార్యకర్తలకు, ఆందోళకారులకు మధ్య ఆదివారం దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన ఘర్షణల్లో ఏకంగా 97 మంది మరణించారు. ఆందోళనల ధాటికి రాజధాని ఢాకాలో దుకాణాలు మూతబడ్డాయి. షాబాగ్‌లో వేలాది మంది విద్యార్థులు తదితరులు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బంగాబంధు షేక్ ముజీబ్ మెడికల్ కాలేజీలో వీరంగం సృష్టించారు. వాహనాలను తగలబెట్టారు. దాంతో రోగులు, వైద్యులు, విద్యార్థులు భయంతో వణికిపోయారు. దేశ విమోచన పోరాట అమరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను తగ్గించాలంటూ యువత, ఆందోళనకారులు ఇటీవల చేపట్టిన భారీ ఆందోళనల్లో 200కు పైగా చనిపోవడం తెలిసిందే. అందుకు బాధ్యత వహిస్తూ హసీనా గద్దె దిగాలంటూ నిరసనకారులు తాజాగా మళ్లీ ఉద్యమబాట పట్టారు. దాంతో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. ఫేస్బుక్, వాట్సప్, మెసేంజర్, ఇన్‌స్ట్రాగాం సేవలను నిలిపేశారు. 4జీ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేయాలని మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ఉద్యమం చేస్తున్న వారిలో యువత లేరని, ఉగ్రవాదులే ఉన్నారని హసీనా ఆరోపించారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాజా పరిస్థితిపై ఆర్మీ, పోలీసు విభాగాల అధిపతులతో ఆమె సమీక్ష జరిపారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామంటూ నిరుద్యోగులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం, వారు తిరస్కరించడం తెల్సిందే. రాజుకున్న చిచ్చు... బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది. -
జీఎస్టీ కౌన్సిల్‌కి మరో తలనొప్పి
న్యూఢిల్లీ : జీఎస్టీ కౌన్సిల్‌కు మరో తలనొప్పి ఎదురుకాబోతుంది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు పరోక్ష పన్ను అధికారుల అసోసియేషన్లు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగేందుకు సిద్ధమయ్యారు.. శుక్రవారం జరుగబోయే ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేను జరుపుకోమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. అంతేకాక జనవరి 30న జరుగబోయే అమరుల దినోత్సవం రోజు కూడా బ్లాక్ బ్యాడ్జ్‌లను ధరించి బ్లాక్ డేను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జనవరి 16న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఎక్కువగా నిరాశపరిచే నిర్ణయాలు తీసుకుని మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 12 నాటికల్ మైళ్ల పరిధిలో ఉన్న ప్రాదేశిక జలాల ఆర్థిక వ్యవహారాలపై లెవీ ట్యాక్స్ అధికారాలను కౌన్సిల్ రాష్ట్రాలకు ఇచ్చింది. రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్ కిందనున్న పన్ను చెల్లింపుదారుల హక్కులూ 90 శాతం రాష్ట్రాలకే ఇస్తున్నట్టు ప్రకటించింది.. ఈ నిర్ణయం కేవలం రెవెన్యూ ఆఫీసర్ల కెరీర్‌పైనే కాదని, ఇది అసలు జాతీయ ప్రయోజనం కాదని ఉద్యోగులు పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల కేంద్రం బలహీన పడడమే కాక, ఆర్థిక వ్యవస్థపై, రెవెన్యూ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డులోని ఏ,బీ,సీ గ్రూప్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే స్టాండింగ్ కమిటీ అసోసియేషన్ మీటింగ్ అనంతరం ఈ నిర్ణయాలను వారు ప్రకటించారు. మొత్తం 70వేల మంది అధికారులు సహాయ నిరాకరణ ఉద్యమానికి దిగనున్నట్టు ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.