non stop flight
-
నాన్‌స్టాప్‌గా ఎగిరిపోదాం!
న్యూఢిల్లీ: అమెరికా, యూరప్ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విమాన ప్రయాణికులు ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ల కన్నా నాన్–స్టాప్, డైరెక్ట్ ఫ్లయిట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ గణాంకాల ప్రకారం గత కొన్నాళ్లుగా ఈ ధోరణి పెరుగుతోంది.2023లో 3.72 కోట్ల మంది ప్యాసింజర్లు నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించారు. కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే ఇది ఇరవై లక్షలు అధికం. ఇదే వ్యవధిలో ఒకటి లేదా అంతకు మించి స్టాప్స్‌లో ఆగుతూ వెళ్లే ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్స్‌లో ప్రయాణించిన వారి సంఖ్య 25 లక్షలు తగ్గి 2023లో 2.74 కోట్లకు పరిమితమైంది. 2023లో ప్రయాణించిన మొత్తం 6.46 కోట్ల మంది ప్యాసింజర్లలో 57 శాతం మంది నాన్–స్టాప్ ఫ్లయిట్స్‌నే ఎంచుకున్నారు. 2019లో ఇది 53 శాతంగా ఉంది.పశ్చిమాసియా హబ్‌లకు తగ్గిన ప్రయాణికులు అమెరికా, యూరప్‌లకు వెళ్లే ఫ్లయిట్స్ కోసం భారతీయులు ఎక్కువగా పశ్చిమాసియా హబ్‌ల వైపు మొగ్గు చూపే ధోరణి తగ్గింది. ఓఏజీ గణాంకాల ప్రకారం 2019–2023 మధ్య కాలంలో పశ్చిమాసియా హబ్‌లకు ప్యాసింజర్ల సంఖ్య 10 లక్షల మేర తగ్గింది. ఆ నాలుగేళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇతర హబ్‌లకు కూడా ప్రయాణికుల సంఖ్య 28 లక్షల మేర తగ్గింది. మరోవైపు, కొత్తగా 52 అంతర్జాతీయ రూట్లను జోడించడంతో ఇన్‌డైరెక్ట్ ఫ్లయిట్ ప్యాసింజర్లకు సంబంధించి దేశీ హబ్‌లలో ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మేర పెరిగింది.ఓఏజీ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) 36 లక్షల మంది, సౌదీ అరేబియాలో 26 లక్షల మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ రూట్లలో భారతీయులను గమ్యస్థానాలకు చేరవేయడంలో పశ్చిమాసియా దేశాల ఎయిర్‌లైన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ విషయంలో దశాబ్దం క్రితం గల్ఫ్ దేశాల ఎయిర్‌లైన్స్ వాటా 48 శాతంగా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 50 శాతానికి పెరిగింది. -
ముంబై - హాంకాంగ్ నాన్‌స్టాప్
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దూకుడు మీద ఉంది. జాతీయంగా,అంతర్జాతీయంగా పలు విమాన సర్వీసులను కొత్తగా పరిచయం చేస్తూ ప్రస్తుత డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అప్పుల సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను నిలిపివేసిన నేపథ్యంలో కొత్త వ్యూహాలతో విమాన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో వివిధ కొత్త విమానాలను ప్రకటించిన స్పైస్ జెట్ ప్రస్తుత డిమాండ్‌ను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ముంబై, ఢిల్లీ నగరాలనుంచి విదేశాలకు నాన్ స్టాప్ విమానాలను నడపబోతున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా ముంబై నుంచి హాంకాంగ్‌కు రోజూ నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ప్రారంభిస్తున్నట్టు గురువారం తెలిపింది. జూలై 31, 2019 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై- హాంకాంగ్ ఏకైక నాన్-స్టాప్ విమానం తమదేననని పేర్కొంది. ఈ విమానం ముంబై లో ఉదయం 1.05 గంటలకు బయలుదేరి ఉదయం 9.40 గంటలకు హాంకాంగ్ చేరుకుంటుంది. ముంబై-హాంకాంగ్‌లో రూ.16,700 గాను, హాంకాంగ్-ముంబై రూట్లలో రూ .19,200 గా ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది. ముంబై వ్యాపార ప్రయోజనాలకు, పెరుగుతున్న డిమాండ్‌కు తమ కొత్త విమానం దోహదం చేస్తుందని స్పైస్ జెట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. ముంబై , ఢిల్లీ నుంచి ఎనిమిది కొత్త నాన్ స్టాప్ అంతర్జాతీయ విమానాలను ప్రారంభించినట్లు స్పైస్ జెట్ ఈ వారం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబై- రియాద్, ఢాకా-ఢిల్లీ, జెడ్డాలకు ఈ సర్వీసులను అందించనుంది. జూలై చివరి వారం నుంచి ఢాకా, జెడ్డాలకు విమానాలు అమలులో ఉంటాయనీ, రియాద్ వెళ్లే విమానాలు ఆగస్టు 15న ప్రారంభమవుతాయని స్పైస్ జెట్ తెలిపింది. కాగా ఏప్రిల్ 1 నుండి స్పైస్ జెట్ కొత్తగా 124 విమానాలను ప్రకటించింది, ఇందులో 76 ముంబైకి సంబంధించినవి కాగా, 20 ఢిల్లీవి. అలాగే ముంబై, ఢిల్లీ మధ్య 8 విమాన సర్వీసులను స్పైస్ జెట్ నడుపుతోంది. -
ఇక సుదీర్ఘ ప్రయాణం షురూ...!
ఇకపై సుదీర్ఘ విమాన ప్రయాణాలకు ప్రపంచం సిద్ధమవుతోంది. సింగపూర్ నుంచి నేరుగా నాన్‌స్టాప్ ఫ్లయిట్లో 19 గంటల వ్యవధి లోనే 16,700 కి.మీ దూరంలో (10,400 మైళ్లు) ఉన్న న్యూయార్క్‌కు చేరుకోవచ్చు. గురువారం 161 మంది ప్రయాణికులతో కూడిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం ‘ఎయిర్‌బస్ ఏ350– 900 యూఎల్ఆర్’న్యూయార్క్‌కు తొలిసారిగా బయ లుదేరి వెళ్లింది. ప్రస్తుతం పౌర విమానరంగంలో డైరెక్ట్ ఫ్లయిట్ రూపంలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న విమానం ఇదే కావడం విశేషం. ఈ విమానాన్ని నడిపేందుకు ఇద్దరు పైలట్లు ఉంటారు. ఇద్దరు ఫస్ట్ ఆఫీసర్లతో పాటు 13 మంది కేబిన్ సిబ్బంది ఉంటారు. వీరందరికీ కూడా కచ్చితమైన పని విభజన ఉంటుంది. ప్రతి ఒక్కరికీ కనీసం నాలుగు గంటల విశ్రాంతి లభించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఆహారపరంగా కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకాశయానం సందర్భంగా ఆరోగ్య పరిరక్షణకు వీలుగా సేంద్రియ ఉత్పత్తులతో తినుబండారాలు తయారుచేశారు. సుదీర్ఘ ప్రయాణంతో ప్రయాణికులు విసుగు చెందకుండా ఉండేందుకు 1,200 గంటల పాటు వినోదం అందించేందుకు వివిధ రకాల ఆడియో, వీడియో కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయి. సినిమాలు, టీవీల ద్వారా వినోదాన్ని అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 25 శాతం తక్కువ ఇంధనం.. మామూలు విమానాల్లో కంటే ఇందులో కేబిన్ ఎత్తు ఎక్కువగా ఉంటుంది. జెట్‌లాగ్‌ను తగ్గించేం దుకు ఉపయోగపడేలా తగిన లైటింగ్ ఏర్పాట్లతో పాటు పెద్ద కిటికీలు ఉంటాయి. దాదాపుగా ఒక రోజంతా విమానంలోనే గడపాల్సి ఉన్నందున ప్రయాణికులు అలసిపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇతర విమానాల కంటే 25 శాతం తక్కువ ఇంధనం ఖర్చయ్యేలా ఈ రెండు ఇంజన్ల విమానాన్ని రూపొందించారు. ఈ విమానం 18 గంటల 45 నిమిషాల్లోనే నేవార్క్ ఎయిర్‌పోర్టులో దిగేందుకు అవకాశమున్నా, ఏకధాటిగా 20 గంటల పాటు ప్రయాణిం చేందుకు వీలుగా దీనిని తయారుచేశారు. మరో 6 విమానాల కొనుగోలు.. ఇప్పటివరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్– ఖతార్‌లోని దోహాల మధ్య 17 గంటల 40 నిమిషాల పాటు సాగే ఖతార్ విమాన ప్రయా ణమే సుదీర్ఘమైనది. తాజాగా సింగపూర్– న్యూయార్క్‌ల మధ్య డైరెక్ట్ ఫ్లయిట్ సర్వీస్ మొదలయ్యాక మరిన్ని సుదూర ప్రయాణాలకు విమానయాన సంస్థల మధ్య పోటీ పెరగవచ్చని అంచనా. ఈ డైరెక్ట్ ఫ్లయిట్‌ను ప్రయాణికులు ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఈ ప్రయాణాల కోసం త్వరలో మరో 6 విమానాలు కొనుగోలు చేయనుంది. -
నాన్ స్టాప్ విమానాలు వచ్చేస్తున్నాయ్
సింగపూర్ : నాన్-స్టాప్ బస్సులు, రైళ్లే కాదు ఇక మీదట నాన్-స్టాప్ విమానాలు రానున్నాయి. అవును ప్రపంచంలోనే తొలి నాన్-స్టాప్ విమానాన్ని ప్రారంభించనున్నట్లు సింగపూర్ విమానయాన సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ విమానం ఏకధాటిగా 20 గంటల పాటు గాలిలోనే ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. సింగపూర్ విమానయాన సంస్థ నూతనంగా ప్రారంభించబోయే ‘ఎయిర్‌బస్ ఏ350 - 900 యూఎల్ఆర్’(అల్ట్రా లాంగ్ రేంజ్) విమానం ఈ ఘనతను సాధించబోతుందని పేర్కొన్నారు. ఈ విమానం సింగపూర్ నుంచి న్యూయార్క్ వరకూ 20 గంటల పాటు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందని గురువారం నాడు అధికారులు ప్రకటించారు. గతంలో 9 వేల మైళ్ల దూరాన ఉన్న న్యూయార్క్ వెళ్లడానికి ఈ విమానయాన సంస్థ గ్యాస్‌తో నడిచే నాలుగు ఇంజిన్లు గల ‘ఏ340 - 500’ విమానాలను ఉపయోగించేది. అయితే ఈ విమానంలో కేవలం వంద బిజినెస్ క్లాస్ సీట్లు మాత్రమే ఉండేవి. అంతేకాక వీటి సేవలు కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో సింగపూర్ విమానయాన సంస్థ వీటిని 2013లో రద్దు చేసింది. ఈ ‘ఎయిర్‌బస్ ఏ340 - 500’ స్థానంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న ‘ఎయిర్‌బస్ ఏ350 - 900’లను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలాంటివి మొత్తం ఏడు అల్ట్రా లాంగ్ రెంజ్ విమానాల కొనుగోలుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏ350 - 900 విమానాన్ని ఈ నెల 23న దాదాపు ఐదు గంటల పాటు పరీక్షించిన అనంతరం ఫ్రాన్స్‌లోని టౌలాస్ విమానాశ్రయంలో లాండ్ చేశారు. వాస్తవానికి అల్ట్రా లాంగ్ రేంజ్ విమానాలు ఏకధాటిగా దాదాపు 11,160 మైళ్లే ప్రయాణిస్తాయని, కానీ ప్రస్తుతం రూపొందించిన ఏ350లో ఈ సామర్థ్యాన్ని మరో 1800 మైళ్లను పెంచనున్నట్లు తెలిపారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత దూరం ఏకధాటిగా ప్రయాణించే విమానయాన సంస్థగా సింగపూర్ రికార్డు సృష్టించనుంది. ‘ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం రూపొందించబోయే ఏ350 విమానాల్లో అనేక మార్పులు చేయనున్నాం. పాత విమనాల్లో క్యాబిన్ పొడవైన గొట్టం మాదిరిగా ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకురానున్న ఏ350 ఎయిర్‌బస్‌లలో క్యాబిన్ పూర్తిగా మార్చివేసి ఒక గదిలాగా డిజైన్ చేయనున్నాం. అంతేకాక విమానం లోపల అధునాతన ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థతో పాటు తక్కువ శబ్దం వచ్చేలా మార్పులు చేయనున్నాం’ అని ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఫ్లారెంట్ పెటేని తెలిపారు. -
ఎయిర్ ఇండియా రికార్డు
భారత ప్రభుత్వ విమానయాన సంస్ధ ఎయిర్ ఇండియా రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కోకు నాన్ స్టాప్ ఫ్లైటును నడుపుతున్న ఏకైక సంస్ధగా రికార్డు బుక్ లలో చేరింది. ఈ నెల 16వ తేదీన ఉదయం నాలుగు గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 15,300 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోకు 14గంటల 30 నిమిషాల్లో చేరుకుందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లేప్పుడు పసిఫిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణించే విమానం.. తిరుగు ప్రయాణంలో అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ఢిల్లీకి చేరుకుంటుంది. గతంలో వెళ్లడానికి రావడానికి ఒకే మార్గం( అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా) 14 వేల కిలోమీటర్లు ప్రయాణించడానికి వినియోగించినా గాలి వేగం ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రయాణ మార్గాన్ని మార్చారు. ప్రయాణ మార్గంలో మార్పుల కారణంగా వెళ్లి వచ్చే మార్గాల్లో గాలి వాలును విమానానికి అనుకూలంగా వినియోగించవచ్చని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. రెండేళ్ల వరకు మాత్రమే అతిపెద్ద నాన్ స్టాప్ విమానాన్ని నడుపుతున్న సంస్ధగా ఎయిర్ ఇండియా పేరు నిలవనుందని ఓ విదేశీ పత్రిక తెలిపింది. ఆ తర్వాత సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రారంభించే సింగపూర్-న్యూయార్క్ సర్వీసు 16,500కిలోమీటర్ల దూరాన్ని 19 గంటల్లో చేరుకోనుందని చెప్పింది.