non subsidy cylinder
-
నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.100 తగ్గింపు
న్యూఢిల్లీ: సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 తగ్గిస్తున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. అంతర్జాతీయ రేట్లు తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో రూ. 737.50గా ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ. 637కు తగ్గనుంది. ఢిల్లీలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 494.35గా ఉంది. ఇలా ఉండగా, జూన్ 22న పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన బీజేపీ మళ్లీ ప్రజలను మోసం చేయడం ప్రారంభించిందని కాంగ్రెస్ ఆరోపించింది. -
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: సబ్సిడీ వంటగ్యాస్(ఎల్పీజీ)సిలిండర్ ధర మరోసారి పెరిగింది. తాజాగా సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.94లు మేర పెరిగింది. అలాగే సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 మేర పెరిగింది. ఈ ఏడాది జూన్ నుంచి గ్యాస్ సిలిండర్ రేట్లు వరుసగా ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత పెంపుతో సబ్సిడీ సిలిండర్ మొత్తం ఆరు నెలలో రూ.14.13 పెరిగింది. దీంతో ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ. 505.34కి చేరగా, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 880గా ఉంటుంది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడంతోపాటు విదేశీమారకం రేటులో ఒడిదుడుకుల వల్ల ధరలు పెరుగుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) అధికారులు తెలిపారు. పెరిగిన ఇంధన ధరల ప్రకారం వినియోగదారులపై భారం పడకుండా సబ్సిడీని ప్రభుత్వం భరిస్తున్నదని, అయితే జీఎస్టీ భారం మాత్రమే వినియోగదారులపై పడుతుందని పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో రాయితీ కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాలో రూ.376.60 జమకాగా, నవంబర్‌లో రాయితీ రూ.433.66కు పెరగనున్నదని అధికారులు తెలిపారు. -
ముంచుకొస్తున్న గడువు
ఈ నెల 31తో పూర్తిఆధార్‌తో గ్యాస్ అనుసంధానం 43 శాతమే! వినియోగదారుల స్పందన అంతంత మాత్రమే విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లా లో నగదు బదిలీ పథకానికి గడువు ముంచుకొస్తున్నా ప్రజల నుంచి స్పందన మాత్రం కనిపించడం లేదు. ఫిబ్రవరి 1 నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉన్నా గ్యాస్, ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానంపై ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటి వరకు కేవలం 43 శాతం మంది మాత్రమే నగదు బదిలీకి వివరాలను అనుసంధానం చేసుకున్నారు. ఇంకా జిల్లాలో 4,73,100 మంది గ్యాస్ వినియోగదారులు వరకు నమోదు చేయించుకోవాల్సి ఉంది. గ్యాస్ సబ్సిడీ డబ్బును వినియోగదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువిచ్చినా అప్పటికి కేవలం 25 శాతం మాత్రమే నమోదు చేసుకోవడంతో జనవరి 31వ తేదీ వరకు గడువు పెంచిన విషయం తెలిసిందే. జిల్లాలో 8.3 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా ఇప్పటి వరకు 3,56,900 మంది గ్యాస్ వినియోగదారులు మాత్రమే గ్యాస్ కనెక్షన్‌ను ఆధార్, బ్యాంకు అకౌంట్లతో అనుసంధానం చేసుకున్నారు. జనవరి 31వ తేదీతో గడువు ముగుస్తుండడంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాన్‌సబ్సిడీ సిలిండర్‌ను ప్రస్తుత ధర ప్రకారం రూ.1310 కొనుగోలు చేయాల్సి ఉంటుంది.